సూర్యుడు
సూర్యుడు
పిల్లలు నిటారుగా కూర్చోండి. కళ్ళు మూసుకోండి. దీర్ఘంగా ఊపిరి పీల్చండి .మెల్లగా వదలండి. మీరందరూ వేడిగా ఉండే సూర్యుడిని చూడటానికి వెళుతున్నామని ఊహించండి. సూర్యుడు ఒక గుండ్రని నిప్పులాంటి బంతి. దానిలో ఎరుపు నారింజ మరియు పసుపు రంగులు ఉన్నాయి. మనం సూర్యునికి దగ్గరగా మరింత దగ్గరగా వెళ్ళినప్పుడు మనకు వేడి తగులుతుంది. అందుకని సూర్యుని దగ్గరికి వెళ్లడం అంత సులభం కాదు.
సూర్యుడు మనకి వెలుగును, వేడిని ఇస్తాడు. సరైన సమయంలోనే అనగా పొద్దున్నే ఉదయిస్తాడు. సాయంత్రం అస్తమిస్తాడు. దీని ద్వారా సయమపాలన పాటిస్తాడని తెలుసుకోండి. భూమిపై జీవించడం సూర్య కాంతి ద్వారానే సాధ్యం అవుతున్నది. సూర్యకాంతిలోనే మొక్కలకి ఆహారం ఆందుతుంది. సూర్యుడు భూమి మీద ఉన్న అన్నిటిని సమానంగా చూస్తాడు. అలాగే నిస్వార్ధంగా ఎప్పుడు సూర్యుడు తన దగ్గర ఉన్న దాన్ని ఇస్తూనే ఉంటాడు.
కనుక మనం కూడా నిస్వార్ధంగా ఎప్పుడు ఇవ్వటం నేర్చుకోవాలి. అందరిని ప్రేమతో, శ్రద్ధతో సమానంగా చూడాలి. మీరందరూ సూర్యుడు ఎలా కదుల్తుంటాడో చూడాలని ఉత్సాహంతో ఉన్నారు. కానీ సూర్యుడు కదలడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యున్ని మీ మనసులో ఊహించుకోండి . మెల్లగా తిరిగి మామూలు స్థితికి రండి. ఇప్పుడు కళ్ళు తెరవండి.
సూర్యుడు అందరికీ కాంతిని, వెచ్చదనాన్ని ఇస్తాడు. మీరు సూర్యునిలా అందరికీ ప్రేమను అందించాలి.
కార్యాచరణ:
గైడెడ్ విజువలైజేషన్ సమయంలో పిల్లలు వారు ఊహించిన దాన్ని చిత్రంగా గీయమని అడగాలి.
[Source : Early Steps to Self Discovery Step – 2, Institute of Sathya Sai Education (India), Dharmakshetra, Mumbai.]