అడవిలో నడక
అడవిలో నడక
పిల్లలూ! హాయిగా సుఖంగా కూర్చోండి. బిగిసిపోయి కూర్చోవద్దు. తల ముఖం, మెడ, చేతులు, పాదాలు విశ్రాంతిగా ఉండేటట్లు కూర్చోండి.
కళ్ళు మూసుకోండి. మీరు ప్రశాంతంగా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మనం అడవిలో కొద్దిసేపు నడక సాగిద్దామా!,నడక కదా వాకింగ్ షూస్ వేసుకుందాం. మనం చెట్ల మధ్యలో నడుస్తున్నాం. మంచి గాలి వీస్తోంది. చెట్లు ఎంత ఎత్తుగా ఉన్నాయో కదా! ఆకాశానికి తగులుతున్నాయి. గుబురుగా కొమ్మలు, వాటి మీద వున్న పక్షులు, వింత వింత శబ్దాలు చేస్తున్నాయి. వినండి,. ఉదయం కదా! సూర్యకిరణాలు చెట్ల ఆకుల సందుల నుండి భూమి మీద పడుతున్నాయి. అవి చిన్న చిన్న వజ్రాల వలే ప్రకాశిస్తున్నాయి.
ఎన్ని రంగుల పూలు, మ వున్నాయి కదా.ఆకులు కూడా మంచి వాసనను వెదజల్లుతున్నాయి. పూల వాసన, హాయిగా ఉంది. చూడండి. చూడండి .
ఉడతలు, కుందేళ్ళు, పక్షులు, హాయిగా స్వేచ్ఛగా అడవిలో సంతోషంగా పరుగులు తీస్తున్నాయి. ఎక్కడినుంచో గలగలమని నీటి చప్పుడు కూడా వినపడుతోంది. రండి మంచి నీళ్ళు తాగండి అని ఆహ్వానిస్తున్నట్లు, పాట పాడుతున్నట్లు నది ప్రవహిస్తున్నది కదా. కొద్దిసేపు ఇక్కడ విశ్రాంతిగా కూర్చుందామా!.
సరే! దీర్ఘంగా గాలి పీల్చుకుని మెల్లగా వదులుదాం. తిరిగి వెళ్ళాలి కదా. అడవిలో నడవటం వల్ల చాలా సమయం కూడా అయింది. జంతువుల్ని, పక్షుల్ని, మన స్నేహితుల్ని కలవడానికి మరొక రోజు కూడా వద్దాం.పదండి.
హమ్మయ్య! వచ్చేశాం.
ఇప్పుడు కళ్ళు తెరవండి. కానీ నిశ్శబ్దంగా ఇంత క్రితం అనుభవించిన అడవిలో నడకను ఆనందంగా ఈ రోజంతా తలచుకోండి.
కార్యాచరణ:
మీరు చూసిన దృశ్యాన్ని చిత్రంగా గీయండి.
[Source : Silence to Sai-lens – A Handbook for Children, Parents and Teachers by Chithra Narayan & Gayeetree Ramchurn Samboo MSK – A Institute of Sathya Sai Education – Mauritius Publications]