శరీరాన్ని నిశ్చలంగా ఉంచుకోవడం

Print Friendly, PDF & Email
శరీరాన్ని నిశ్చలంగా ఉంచుకోవడం
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి…. 
పారే నీటి సవ్వడి, ప్రకృతి ధ్వనులు,నీటిలో తిమింగలములు నీటిలో చేయు ధ్వనులు మరియు ఇంపైన సంగీతమును వినండి.

నెమ్మదిగా స్థిరాసనంలో కూర్చోండి. వెన్నెముకను నిటారుగా ఉంచండి. .

మోకాళ్లపై చేతులను ఉంచండి. మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా శ్వాసను బయటకు వదలండి. ఈసారి శ్వాసను నిశ్శబ్దంగా లోపలికి తీసుకుని వదలడానికి ప్రయత్నించండి.

శరీర భాగాలను నిశ్చలంగా ఉంచి మీరు కూర్చున్న గదిలోని ప్రశాంతతను అనుభవించండి.

మీ కళ్ళను మూసుకోవాలనుకుంటే ఐదు సెకండ్ల పాటు మూసుకోండి.

ఇప్పుడు మీ తరగతి గది వెలుపలి శబ్దాలను వినండి.

ఇప్పుడు మీ శరీరాన్ని నెమ్మదిగా సడలింపజేసి, కళ్ళను నెమ్మదిగా తెరిచి నవ్వండి.

ఇప్పుడు నిశ్శబ్దంగా లేచి దగ్గరగా కూర్చోండి.

చర్చ:
  • మీరు ఎలాంటి శబ్దాలు విన్నారో చర్చించండి?
  • మీరు నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఏమి ఆలోచించారు?
  • మీరు ఎలాంటి అనుభూతి పొందారు?
  • మీరు ఈ నిశ్శబ్ద సమయాన్ని ఆస్వాదించినట్లయితే మీ చేతిని పైకి ఎత్తండి?

[శ్రీ సత్య సాయి మానవతా విలువల బోధన ఆధారంగా – చక్కని నడత మరియు భావోద్వేగ అక్షరాస్యత అభివృద్ధి కొరకు పాఠ్య ప్రణాళిక -కరోలే ఆల్డర్మాన్]