గాలి బుడగలో ప్రయాణం

Print Friendly, PDF & Email

గాలి బుడగలో ప్రయాణం

కళ్ళు మూసుకొని సావధానంగా కూర్చుండి. గది వెచ్చదనాన్ని అనుభవించడం ప్రారంభించండి. గదిలో పక్కనే ఉన్న మీ స్నేహితుని గుర్తించండి.

నెమ్మదిగా లేచి గది తలుపు తెరవండి. నిశ్శబ్దంగా నెమ్మదిగా మెట్లు దిగుతూ బయటి గేటును చేరుకోండి. వీధి అంతా నిశ్శబ్దంగా ఉంది..

ఆకస్మాత్తుగా చాలా బెలూన్లు మీ వైపు వస్తున్నాయి.. అవి చాలా పెద్దగా అనేక రంగులతో ఉన్నాయి. అందరికీ సరిపడా బెలూన్లు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బెలూన్ తీసుకొని దానిలోకి ఎక్కారు..

నీ బెలూన్ ప్రయాణించడం ప్రారంభమైంది. అది చాలా ఎత్తులో ఎగురుతోంది.పైకి వెళ్లిన కొద్దీ క్రింద అన్నీ చిన్నవిగా కనపడుతున్నాయి. నీకు చాలా సంతోషం గా ఉంది. ప్రయాణం చాలా హాయిగా ఉంది.

పట్టణాల మీదుగా అడవిలోకి వెళ్లావు. అక్కడ ఎన్నో అడవి జంతువులు కనిపించాయి.. అవి అన్నీ చక్కగా సమన్వయంతో జీవిస్తున్నాయి. నువ్వు సముద్రం మీదకు వచ్చావు. సముద్రం యొక్క తాజాదనపు సువాసనను అనుభూతి చెందావు. సముద్రం చాలా పెద్దది.

చివరిగా మీ పట్టణానికి వచ్చేసావు. బెలూన్ దిగి నెమ్మదిగా మీ రూమ్ లోకి నడుచుకుంటూ వెళ్ళావు. ఇప్పుడు చాలా నెమ్మదిగా మెల్లగా కళ్ళు

తెరవండి.

ప్రశ్నలు:
  1. నీ బెలూన్ ఏ రంగులో ఉంది?
  2. అది ఎంత పెద్దగా ఉంది?
  3. నీ ప్రియమైన స్నేహితుడి బెలూన్ ఏ రంగులో ఉంది?
  4. బెలూన్ లో ఉండగా నీవు ఏమేమి చూసావు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *