శబ్దము – శ్వాస

Print Friendly, PDF & Email

శబ్దము – శ్వాస

ప్రియమైన పిల్లలూ!

కళ్ళు మూసుకోండి. గట్టిగా శ్వాస తీసుకుని వొదలండి. మీ శ్వాస ను గమనించండి. మీరు సాధారణంగా ఉన్నప్పుడు శ్వాస నిశ్శబ్దంగా, నెమ్మదిగా బయటకు వస్తుంది. అదే మీరు కోపంగా ఉన్నప్పుడు అది భారంగా తన అవిశ్రాంత స్థితిని తెలియ జేస్తుంది. శ్వాస సందర్భాన్ని, ఉద్వేగాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

శ్వాసని నిర్వహించడం అంటే తనను తాను సరిగా నిర్వహించుకోవడమే. మనం యీ ప్రపంచం లో శ్వాస ఉన్నంత వరకే బ్రతుకుతాము. మనకు ఈ శ్వాస ద్వారా జీవితాన్ని. ఇచ్చిన భగవంతుడికి మనం కృతజ్ఞతలు తెలపాలి. శ్వాస మరియు ఆలోచనతో ఉంటే మనం శివం.. అనగా దివ్యత్వము. శ్వాస లేనిచో శవం అనగా ప్రాణము లేని కట్టె మాత్రమే.

మనం రోజులో 21,600 సార్లు గాలిని పీల్చి వదులుతుంటాము.

“జీవజాతులెన్నో కానీ శ్వాస ఒక్కటే.”

ఇట్టి శ్వాసనిచ్చిన భగవంతునికి కృతజ్ఞతలు తెలపాలి. మన ఆలోచనలు, మాటలు చేతలలో భగవంతుని పట్ల విధేయత, నమ్రత కలిగి ఉండేలా దీనిని ఉపయోగించాలి.

శ్వాసను గమనిస్తూ నెమ్మదిగా సావధాన స్థితికి రండి.

ప్రశ్నలు:
  1. ఒక రోజులు మనం ఎన్నిసార్లు గాలి పీల్చి వదులుతాము?
  2. మీరు పరిగెత్తుతున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, దుముకుతున్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుందో తెలపండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: