రుచి – నాలుక
రుచి – నాలుక
ఒకసారి నాలుకను చూడండి. నాలుక వలన మనం చక్కగా మాట్లాడగలుగుతున్నాము.మనందరికీ భగవంతుడు నాలుకను బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకోండి.
“జాగ్రత్త నాలుకా! జాగ్రత్త నాలుకా! మాట్లాడేటప్పుడు జాగ్రత్త నాలుకా!”
ఏం మాట్లాడతావో జాగ్రత్త! భగవంతుడు ఎల్లప్పుడూ గమనిస్తున్నాడు. ఆయన ఎల్లవేళలా మనలోనే ఉంటాడు!
“జాగ్రత్త నాలికా! ఏం మాట్లాడతావో జాగ్రత్త నాలికా!”
భగవన్నామ స్మరణతో నాలుకను పవిత్రం గావించాలి. అది తృప్తిని, సంతోషాన్ని ప్రసరింప చేసే చక్కని మాటలు మాట్లాడాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళు మాట్లేడే మాటలు జాగ్రత్తగా గమనించుకోవాలి. జంతువులకు కొమ్ములు, పురుగులకు కొండులు, క్రూర మృగాలకు పంజాలు, కోరలు: మనిషికి ఆయుధం నాలుకే. నాలుక అణుబాంబును మించిన ప్రమాదకారి అన్నారు బాబా.
అందుకే మృదు మధురంగా మాట్లాడడానికి నాలుకను ఉపయోగించండి. మన ప్రియతమ భగవానుని వైభవాన్ని కీర్తించేందుకు ఉపయోగించండి.మీ మాటలతో ప్రేమను,శాంతి ని వ్యాపింప చేసి భగవానునికి చేరువ కండి. మెల్లగా కళ్ళు తెరవండి.
ప్రశ్నలు:
- నాలుక వల్ల ఉపయోగాలేమి?
- మనం మృదువుగా ఎందుకు మాట్లాడాలి?