నిర్భయత్వము

Print Friendly, PDF & Email
నిర్భయత్వము
మూల్యాంకనము మరియు ప్రేరణ

(ఉపాధ్యాయుడు చుక్కల వద్ద పాజ్ చేస్తూ నెమ్మదిగా వ్యాయామాన్ని చదువుతాడు. మీరు అవసరమనుకుంటే, నేపథ్యంలో మృదువైన సంగీతాన్ని పెట్టుకొనవచ్చు.)

దశ 1:

సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.

మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.

మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.

కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.

దశ 2:

ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రేకాలను తగ్గించండి. మీ కాలి వేళ్ళను సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు చూడండి.కుడి వైపుకు చూడండి. మళ్ళీ ముందుకు చూడండి.

మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని‌ పొందండి. అన్ని ఉద్రేకాలు తొలిగిపోతాయి.

దశ 3:

మీరు వేసవి కాలంలో ఒక ఉద్యానవనంలో నడుస్తున్నారని ఊహించుకోండి. మీరు కళ్ళతో చూడలేరని భావించుకోండి, కానీ మీరు చాలా బాగా వినగలరు. ఆ అనుభూతిని మీరు పొందుతారు. మీ పాదాల క్రింద మృదువైన గడ్డి యొక్క స్పర్శను అనుభూతి పొందండి. మీ ముఖంపై వీచే సున్నితమైన గాలి యొక్క స్పర్శను అనుభవించండి… సూర్యరశ్మి యొక్క వెచ్చదనాన్ని అనుభూతి చెందండి. చెట్లపై ఆకుల శబ్దాన్ని వినండి. ఇప్పుడు మీ యొక్క అంతరంగాన్ని తెలుసుకోండి.

దశ 4:

ఇప్పుడు మీ దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి.వ్యాయామం పూర్తయినది కనుక, మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి.

(శ్రీ సత్య సాయి మానవతా విలువల బోధన ఆధారంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: