అందము
అందము
రేఖాగణితము ననుసరించి అందం యొక్క ప్రాముఖ్యతను గుర్తించుట
(ఉపాధ్యాయుడు చుక్కల వద్ద పాజ్ చేస్తూ నెమ్మదిగా వ్యాయామాన్ని చదువుతాడు. మీరు అవసరమనుకుంటే, నేపథ్యంలో మృదువైన సంగీతాన్ని పెట్టుకొనవచ్చు.)
దశ 1:
సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి. మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి. మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.
దశ 2:
ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రేకాలను తగ్గించండి. మీ కాలి వేళ్ళను సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు చూడండి.కుడి వైపుకు చూడండి. మళ్ళీ ముందుకు చూడండి. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి.
ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని పొందండి. అన్ని ఉద్రిక్తతలు తొలిగిపోతాయి.
దశ 3:
మీరు పక్షిలా స్వేచ్ఛగా ఎగురుతున్నారని ఊహించుకోండి. మీరు ఆకాశంలో సురక్షితంగా, సంతోషంగా, ప్రశాంతంగా, ఎంతో విశ్వాసంతో ఎగురుతున్నారు. మీరు ఆ విధంగా విశ్వాసంతో ఎగురుతున్నప్పుడు, ఆకాశం నుండి ప్రకాశవంతమైన వెచ్చని కాంతి భూమిపై ప్రతిబింబించింది ప్రతిబింబించింది. ఇప్పుడు భూమిని గురించి తెలుసుకోండి.
భూమిపై ఒక ప్రదేశాన్ని ఎంచుకుని, క్రిందికి జారుతూ, దానిపైన దిగండి. ఇలా దిగుతున్నప్పుడు మీరు మీతో పాటు భద్రత, సౌకర్యం, ఆనందం, సృజనాత్మకత, స్వేచ్ఛ మరియు స్నేహం వంటి అమూల్యమైన బహుమతులను తెచ్చుకున్నారని ఊహించుకోండి. అవే గోడలు, కిటికీలు, తలుపులు, నేల మరియు పైకప్పుగా మీ చుట్టూ రూపుదిద్దుకోవడం చూడండి… వాటిని మీ అంతర్గత మరియు బహిర్గత శీలమును, నాణ్యతను వ్యక్తీకరించే లక్షణాలు గా చూడండి. ఈ లక్షణాలు మరియు విలువలను ఏ రూపంలో ఉత్తమంగా వ్యక్తీకరించవచ్చో ఊహించండి. మీరు నిర్మించిన ఇల్లు సురక్షితంగా మరియు భద్రతగా ఉందని మరియు మీ బాహ్యశరీరం మరియు మీ అంతరంగం అవే అవసరాలను వ్యక్తపరుస్తున్నాయి.
ఇప్పుడు మీరు తెచ్చుకున్న విలువైన బహుమతులు సంతోషకరమైన స్వేచ్ఛను కలిగి ఉన్నాయి.
సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు, మీ కొత్త ఇల్లు కాంతి మరియు వెచ్చదనంతో మెరుస్తూ ఉంది. మీ కొత్త ఇంటిలో ఆనందం మరియు సంతృప్తితో విశ్రాంతి తీసుకోండి.
దశ 4:
ఇప్పుడు మీ దృష్టిని తరగతి గదికి తీసుకురండి, వ్యాయామం పూర్తయినందునది మీ కళ్ళను విప్పార్చి, మీపక్కన ఉన్న వ్యక్తిని చూసి నవ్వండి.
(శ్రీ సత్య సాయి మానవతా విలువల బోధన ఆధారంగా)