దయ మరియు నిస్వార్థత
దయ మరియు నిస్వార్థత
మానవీయత యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకొనుట
(ఉపాధ్యాయుడు చుక్కల వద్ద పాజ్ చేస్తూ నెమ్మదిగా వ్యాయామాన్ని చదువుతాడు. మీరు అవసరమనుకుంటే, నేపథ్యంలో మృదువైన సంగీతాన్ని పెట్టుకొనవచ్చు).
దశ 1:
సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి. మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి. మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.
దశ 2:
ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రేకాలను తగ్గించండి. మీ కాలి వేళ్ళను సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు చూడండి.కుడి వైపుకు చూడండి. మళ్ళీ ముందుకు చూడండి. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని పొందండి. అన్ని ఉద్రేకాలు తొలిగిపోతాయి.
దశ 3:
మీరు కళ్ళు మూసుకుని, మీ లోపల ఏవైనా జుగుప్సాకరమైన మరియు అసౌకర్యమైన ఆలోచనలు అనే ఊపిరిని బయటకు వదలండి. ప్రేమ, కరుణ ఉన్నందువల్ల మీరు నిస్వార్ధంగా ఉన్నారు అని తెలుసుకోండి. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనడానికి మీకు ధైర్యము మరియు బలం ఉందని తెలుసుకోండి. ప్రేమకు అర్థం మీరే. మీలోని ప్రేమను మరియు మంచితనాన్ని మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో పంచుకోవాలని మీరు నిర్ణయించుకోండి. మీరు దీన్ని ఏ విధంగా అమలు చేయాలనుకుంటున్నారో ఆలోచించండి.
దశ 4:
ఇప్పుడు మీ దృష్టిని తరగతి గదికి తీసుకురండి, వ్యాయామం పూర్తయినందునది మీ కళ్ళను విప్పార్చి, మీపక్కన ఉన్న వ్యక్తిని చూసి నవ్వండి.
(శ్రీ సత్య సాయి మానవతా విలువల బోధన ఆధారంగా)