పూర్వం రామ శ్లోకము – ఆక్టివిటీ
పూర్వం రామ శ్లోకము – ఆక్టివిటీ
ఆక్టివిటీ: రామాయణంలోని ఘట్టాలు తాలూకు చిత్రాలని సమకూర్చి ఒక పుస్తకము తయారు చేయాలి.
గురువులు శ్లోకానుగుణంగా చిత్రాలను అంటించి ఒక పుస్తకము తయారు చేయమని చెప్పాలి.
- పూర్వం రామ తపోవనాది గమనం – రాముడు, సీత మరియు లక్ష్మణుడు అడవికి వెళ్తున్న చిత్రాన్ని అంటించి క్రింద ఈ పంక్తిని వ్రాయమని చెప్పాలి.
- హత్వా మృగం కాంచనం – సీతాదేవి రాముడిని బంగారు జింక తీసుకురమ్మని అడిగే చిత్రాన్ని అంటించి ఈ పంక్తిని వ్రాయమని చెప్పాలి.
- వైదేహీ హరణం – రావణుడు సీతాదేవిని ఎత్తుకొనిపోతున్న చిత్రాన్ని అంటించి ఈ పంక్తిని క్రింద వ్రాయమని చెప్పాలి.
ఇలానే మిగిలిన శ్లోకము మొత్తాన్ని ఈ పుస్తకంలో పొందుపరచమని చెప్పాలి.
గమనిక:
- ఈ పుస్తకం వాడుకలోలేని పాత పుస్తకాల లోని పేపర్లు సేకరించి తయారు చేయవచ్చు.
- ఈ ఆక్టివిటీని తల్లిదండ్రుల సహాయముతో ఇంట్లో తయారు చేసుకోవచ్చు. తద్వారా తల్లిదండ్రులకు పిల్లలతో మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది.