శాంతాకారం శ్లోకము – ఆక్టివిటీ

Print Friendly, PDF & Email
శాంతాకారం శ్లోకము – ఆక్టివిటీ
  1. ఒక పావు చార్ట్ పేపర్ తీసుకొని ఒక కార్డు లాగా తయారు చేయండి. ఇప్పుడు శ్లోకంలోని ఒక్కొక్క పంక్తిని ఒక్కొక్క కార్డు మీద వ్రాయాలి. ఉదాహరణకు, శాంతాకారం భుజగశయనం ఒక కార్డు మీద, పద్మనాభం సురేశం ఇంకొక కార్డు మీద వ్రాయాలి. బాలవికాస్ గురువులు ఈ కార్డులన్నీ ముందుగానే తయారు చేసి ఉంచుకోవాలి..
  2. క్లాసులో పిల్లలను ఒక్కొక్క కార్డును తీసుకోమని చెప్పండి. ఒకవేళ పిల్లల సంఖ్య 8 కంటే ఎక్కువ ఉంటే ఈ శ్లోకం తాలూకు ఇంకొక సెట్ కార్డులను తయారు చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా పిల్లలందరికి ఈ ఆక్టివిటీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
  3. ఇప్పుడు పిల్లలందరినీ ఆ శ్లోకం ప్రకారం నిలబడమని చెప్పాలి. ఉదాహరణకు, పద్మనాభం సురేశం కార్డు వచ్చిన విద్యార్థి శాంతాకారం భుజగశయనం వచ్చిన విద్యార్థి తరువాత నిలబడాలి.
  4. ఇలా నిలబడిన తరువాత వారి కార్డులో ఉన్న శ్లోకం తాలూకు పంక్తిని చదవమని చెప్పాలి.

ఇలా కాకుండా, శ్లోకం తాలూకు అర్ధాన్ని వేర్వేరు కార్డుల మీద వ్రాసి శ్లోకంతో జత చేయమని కూడా చెప్పవచ్చు.

లక్ష్యం

ఇలా చేయడం ద్వారా పిల్లలు శ్లోకాన్ని సులువుగా నేర్చుకోగలుగుతారు. పెద్దగా ఉన్న ఏ శ్లోకం అయినా ఈ విధంగా సులువుగా నేర్పించవచ్చు.