రాముని పంచవటి నివాసం
రాముని పంచవటి నివాసం
వెంటనే సీతా లక్ష్మణులతో కలిసి రాముడు అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళేడు. రాముడిని గోదావరీ నదీ తీరంలో ఉన్న పంచవటికి వెళ్ళమని అగస్త్యుడు చెప్పేడు. దాని ప్రక్కనే మహర్షులు నివసించే దండకారణ్యం ఉందని అగస్త్యుడు చెప్పేడు. ఆ అరణ్యప్రాంతమంతా శాపగ్రస్తమైందని, రాక్షస ప్రవృత్తి గల యక్షులకు తరచూ నివాసమౌతుందని ఆయన చెప్పేడు. రాముని ఉనికితో పిశాచాలు, రాక్షసులు నాశనమౌతాయని, తిరిగి మునులు, సాధకులు ప్రశాంతంగా జీవించ గలుగుతారని అగస్త్యుని నమ్మకం. రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యం ప్రవేశించగానే చెట్లు మళ్ళీ చిగుళ్ళు, ఆకులు తొడిగి పచ్చదనం పరుచుకుంది. ఎండిపోయిన లతలు మళ్ళీ జీవం సంతరించుకున్నాయి.
గురువులు బాలలకు బోధించవలసినవి:
ఈ హఠాత్పరిణామానికి కారణం దివ్యత్వం. దివ్యత్వం అందరిలో ఉంది.
మనలోని అంతర్గత దివ్యత్వాన్ని అర్ధం చేసుకుని తగిన రీతిలో మన జీవితాలు గడుపుకుంటే, ఏ విధంగా మనం ప్రేమని, సంతోషాన్నీ ఉత్పన్నం చేయగలమో బోధించండి.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు:
ఎడ్యుకేర్ అంటే అంతర్గతంగా ఉన్న మానవతా విలువలు వెలికి తీయడం. ఎడ్యుకేర్ అనగా విలువల్ని కర్మలుగా అనువదించడమే.
ఒక మహావృక్షపు చల్లని నీడలో రాముడున్నప్పుడు, తమ్ముడు లక్ష్మణుడిని పిలిచి పర్ణశాల నిర్మించడానికి తగిన ప్రదేశాన్ని ఎంపిక చెయ్యమన్నాడు. దానికి లక్ష్మణుడు నొచ్చుకున్నాడు. “తనకు స్వంత ఎంపిక ఉంటే రామునికి సేవకునిగా ఎలా ఉండగలను?” అనుకున్నాడు లక్ష్మణుడు. దీన్ని అర్థం చేసుకున్న రాముడు, పర్ణశాల నిర్మించడానికి తగిన ప్రదేశాన్ని ఎంపిక చేశాడు.
ఒక రోజున, రావణుని చెల్లెలు శూర్పణఖ లక్ష్మణుని చూడటం జరిగింది. అతని మంచితనపు కాంతి వలయం ఆమెను ఆకర్షించింది. అప్పుడు రావణుడు శక్తివంతుడైన రాక్షసరాజు. అతను లంకను పరిపాలిస్తున్నాడు. శూర్పణఖ అందమైన స్త్రీ రూపం ధరించి వివాహం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో లక్ష్మణుని ఆకర్షించడానికి ప్రయత్నం చేసింది. లక్ష్మణుడు తాను రాముని బంటునని, వారి ఆజ్ఞను పాలిస్తానని చెప్పేడు. తరువాత శూర్పణఖ రాముడిని వివాహం చేసుకోమని అడిగింది. కాని విఫలమైంది. సీత తనకి అడ్డంకిగా మారిందనుకుని సీతపై దాడి చేసి ఆమెను మ్రింగాలనుకుంది. రాముడి ఆజ్ఞను అనుసరించి లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు, చెవులు కోసేడు. బాధతో పరుగెత్తిన శూర్పణఖ సహాయం కోసం ఆ అడవిలోనే తన రాక్షస సోదరులైన ఖర, దూషణల వద్దకు పారిపోయింది. వెంటనే వారు పద్నాలుగు వేల మంది రాక్షస సేనతో వచ్చేరు. రామాజ్ఞ ప్రకారం లక్ష్మణుడు సీతను తీసుకువెళ్ళి ఒక గుహలో ఉంచి, తాను పహరా కాస్తున్నాడు. రాముడు రాక్షస సేనను చిరునవ్వుతో సమీపించేడు. అత్యంత వేగంగా ఖర దూషణులతో సహా రాక్షస సైన్యాన్నంతంటినీ సంహరించాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
లక్ష్మణుడు రామునికి సంపూర్ణ శరణాగతుడయ్యేడు. పర్ణశాల కట్టడానికి తగిన స్థలాన్ని ఎంపిక చేయడం కావచ్చు, పర్ణశాల నుండి సీతను తీసుకుని వెళ్ళి ఆమె రక్షణకై జాగ్రత్త తీసుకోవడం కావచ్చు, రాముడు రాక్షసుల కోసం సంబాళించేవేళ కావచ్చు, రాముడు ఎప్పుడు ఎలా చెయ్యమని ఉత్తర్వులు ఇచ్చేడో అలాగే అనుసరించేడు.
స్వామి బిడ్డలమైన మనం మన పనులన్నీ మన మంచి కోసం భగవంతునికి సమర్పించాలి.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు:
అంతరాత్మను అనుసరించు, మనోభూతాన్ని ఎదురుకో, అంతం వరకూ పోరాడు, ఆటని ముగించు.