లంకలో హనుమంతుడు

Print Friendly, PDF & Email

లంకలో హనుమంతుడు

Hanuman in Lanka

హనుమంతుడు తన రూపాన్ని చిన్న కోతిలాగా మార్చుకుని లంకా ద్వారంలో ప్రవేశించాడు. అప్పుడు లంక ద్వారపాలకి లంఖిణి అనే రాక్షసి అతన్ని ఆపింది. హనుమంతుడు లంఖిణిని తేరుకోలేనంతగా బలంగా గుద్దాడు. ఏ రోజున లంక ద్వారపాలకి ఓడిపోతుందో, రావణుడు ఆపదలో ఉంటాడని భవిష్యవాణి హనుమంతునికి చెప్పింది. హనుమంతుడు సీత కోసం తన అన్వేషణ కొనసాగిస్తూ ఒకచోట తులసివనం, అందులో శ్రీహరి దేవాలయం చూసేడు. తన రూపాన్ని ఒక బ్రాహ్మణుడిగా మార్చుకుని అక్కడకు వెళ్ళేడు. అక్కడ హరి నామాన్ని స్మరిస్తున్న ఒక వ్యక్తిని చూసేడు. అతడు తాను విభీషణుణ్ణనీ, రావణుని సోదరుడిననీ చెప్పేడు. విభీషణుడు సత్పురుషుడు. హనుమంతుడు తాను రామబంటునని, సీతాన్వేషణలో వచ్చాననీ చెప్పేసరికి అతడు హనుమంతుని పాదాలపై పడ్డాడు.”నేను రాముణ్ణి చూడాలని తీవ్రమైన కాంక్షతో ఉన్నాను. కాని నేను రాక్షస వంశానికి చెందినవాణ్ణి. రాముడు తన దర్శనంతో నన్ను అనుగ్రహిస్తాడా? అని అడిగేడు విభీషణుడు. “రాముడు నీ కుటుంబము, కులం, మతము వంటివి వచ్చా న్ను పట్టించుకోడయ్యా! ఆయన నీ భావాల్లోని పవిత్రతను చూస్తాడు. నువ్వు తీవ్రంగా కోరుకుంటున్న దర్శనాన్ని ప్రసాదిస్తాడు, విచారించకు” అని హనుమంతుడు విభీషణునికి ధైర్యం చెప్పేడు. విభీషణుడు హనుమంతునికి సీతను ఉంచిన అశోకవనానికి దారి కూడా చెప్పేడు.

గురువులు బాలలకు బోధించవలసినవి: భగవంతుని దృష్టిలో అందరూ ఒక్కటే. మనం కూడా కులము, మతము, భౌతిక రూపము, అంతస్థు, సంపద మొదలైన వాటిపై ఆధారపడి భేదభావాలు ప్రదర్శించకూడదు.

ఎవరూ తనను గమనించకుండా ఒక కొమ్మ మీద నుండి మరొక కొమ్మ మీదకు ఎగురుతూ గుబురుగా ఉన్న ఆకుల మధ్య దాక్కుంటూ హనుమంతుడు ఆశోకవనానికి బయలుదేరేడు. చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా ఒక చెట్టు క్రింద కూర్చున్న సీతను హనుమంతుడు చూసేడు. అప్పుడే రావణుడు వచ్చి తన పట్టపురాణిగా ఉండాలని సీతను భయపెట్టడానికి ప్రయత్నించేడు. కాని సీత రావణుని వైపు కన్నెత్తి కూడ చూడలేదు. ఆమె రామనామాన్నే స్మరిస్తూ ఉంది.

గురువులు బాలలకు భోధించవలసినవి: కొన్ని సమయాల్లో మనం చెడ్డవారి మధ్య ఉన్నప్పుడు వారి వైపు చూడకూడదు, అనవసరంగా వారితో మాట్లాడకూడదు. ఎందుచేతనంటే అది వాదనలకు దారి తీయవచ్చు. ఇలాంటి సమయాల్లో ఎల్లప్పుడూ భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండిపోవాలి. దానివల్ల భగవంతుడు మనని రక్షిస్తాడు.

హనుమంతుడు రాముని ఉంగరాన్ని సీత ముందు జారవిడిచాడు. రాముని ఉంగరాన్ని గుర్తించగానే సీత సంతోషించింది. చుట్టూ చూసింది. చిన్న కోతి రామనామాన్ని స్మరించడం ఆమె విన్నది. అతడు దగ్గరకు వచ్చి తాను నిజంగా రాముని బంటునని ఋజువు చేసుకునేందుకు, కేవలం రాముడు, సీతకు మాత్రమే తెలిసిన రహస్య వివరాలు తెలియజేసేడు. తన సహజ రూపాన్ని ధరించి రాముని అనుగ్రహం వల్ల లంక చేరుకున్నానని చెప్పేడు. తల్లి సీతమ్మను తన వీపు మీద మోసుకుని రాముని దగ్గరకు తీసుకుపోదామనుకున్నాడు. కాని సీత అంగీకరించలేదు. రాముడు వస్తాడనీ, రావణుని ఓడించి తనని సగౌరవంగా తిరిగి తీసుకొని వెళతాడనీ ఆమె చెప్పింది.

గురువులు బాలలకు బోధించవలసినవి: సీత హనుమంతునితో వెళ్ళగలిగి ఉండేది. కాని ఆమె తిరస్కరించింది. ఎందుచేతనంటే ఆమెకు రాముని పై దృఢమైన విశ్వాసం ఉంది. అతడు వచ్చి తనను రక్షిస్తాడని ఆమెకు పూర్తి నమ్మకం ఉంది. మన జీవితాల్లో కష్టసమయంలో మనం కూడా దగ్గర దారులు వెతుక్కోకూడదు. భగవదనుగ్రహంతో మనకనుకూలంగా పరిస్థితులు మలుపు తిరిగేవరకు సరియైన సమయం కోసం వేచి ఉండాలి. మనం సక్రమమైన రీతిలో పని చెయ్యాలి. దైవాన్ని ప్రార్థించాలి. మిగిలినది దైవానికి విడిచిపెట్టాలి.

గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: మంచి లక్ష్యంకోసమైనా, ఆ మంచి లక్ష్యసాధనకైనా చెడ్డ దారులు వెతక రాదు. ఫలితం ఎంత ప్రధానమో దాన్ని సాధించే మార్గాలు కూడా ధర్మబద్ధమైనవిగా ఉండడం అంతే ముఖ్యము.

బయలుదేరేముందు చిన్న కోతిగా తిరిగి మారిపోయేడు హనుమ. రుచికరమైన కొన్ని పళ్ళు తిని రుచి లేని వాటిని విసిరివేశాడు. పువ్వులన్నీ నలిపేశాడు, చెట్లను వేళ్ళతో సహా పీకేశాడు. ఈ వార్త రావణుని చెవికి సోకగానే ఆ కోతిని పట్టుకోవడానికి అతడు రాక్షస సమూహాన్ని పంపించేడు. కాని వారు విఫలమయ్యేరు. చివరికి హనుమంతుణ్ణి రావణుని సభా ప్రాంగణానికి తీసుకువెళ్ళేరు. తాను రాముని దూతనని హనుమంతుడు తనను పరిచయం చేసుకున్నాడు. “శాంతిని కోరుకుంటే సీతను విడిచి పెట్టి రామునిపై గౌరవం చూపించు. అలా కాకపోతే రావణుడు, అతని రాజ్యమూ రామునిచే సర్వనాశనం చేయబడుతుంది” అని చెప్పేడు హనుమ. రావణుడు కోపోద్రిక్తుడై హనుమకి సంహరించమని ఆజ్ఞాపించాడు. ఈ సమయంలో విభీషణుడు కలగజేసుకుని హనుమంతుడు దూత కనుక అతనిని చంపడం సరికాదన్నాడు.

దాంతో అతని తోకకు నిప్పంటించాలని నిర్ణయం తీసుకున్నారు. అతని తోక చుట్టూ గుడ్డలు కట్టి దాన్ని తడపడానికి నూనె తీసుకువచ్చేరు. ఇది చేస్తున్నంత సేపూ హనుమంతుని తోక పెరుగుతూనే ఉంది. చివరికి తోకకు నిప్పంటించారు. లంకా నగర వీధుల్లో అతన్ని ఊరేగించారు. వెంటనే తన పరిమాణాన్ని తగ్గించుకున్నాడు హనుమ. తనను బంధించిన కట్లను తెంచుకున్నాడు. తప్పించుకున్నాడు. అప్పుడు మండుతున్న తన తోకనే కాగడాగా చేసుకుని ఒక భవనం మీద నుండి మరొక భవనానికి లంఘిస్తూ యావత్తు లంకా నగరానికి నిప్పంటించేడు. అప్పుడు తన తోక నీటిలో ముంచి మంటను ఆర్పుకున్నాడు.

స్వామి అమృతవాక్కు: వర్తమానంలో మనం చేసే ప్రతి పనికి ప్రతిచర్య, ప్రతిధ్వని, ప్రతిఫలించడము ఉండి తీరుతాయి. అందుచేత మనం ఎప్పుడూ తప్పు చెయ్యకూడదు. చిట్టచివరికి తప్పుడు పనుల పర్యవసానం ప్రభావం వల్ల మనమంతా బాధపడతాం. రావణునికీ, లంక పౌరులకీ ఇదే జరిగింది . హనుమంతుని తోకకు నిప్పంటించి అతనిని గాయపరచాలనుకున్నారు. కాని చివరికి అదే అగ్ని వారిని దహించింది. ఎవరినీ గాయపరచకూడదని పిల్లలకు చెప్పాలి. పక్షులూ జంతువులైనా కూడా, పంజరాల్లో పెట్టి, వాటి తోకలకు వస్తువులను కట్టి వాటిని చిత్రహింసలకు గురి చెయ్యకూడదు.

గ్రహించి అలవరచుకోవలసిన విలువలు: “అహింసా పరమో ధర్మ:”. మీరు ఏమి చేస్తారో అదే తిరిగివస్తుంది. అందుచేత ఏదైనా చేసే ముందు జాగ్రత్త వహించండి. మీ మాటలు, చేతలు, ఆలోచనలు, శీలము పట్ల జాగరూకులై ఉండండి.

అప్పుడు హనుమంతుడు సీత వద్దకు వెళ్ళి తాను నిశ్చయంగా సీతను కలిసినట్లు ఋజువుగా సీత వద్ద నుండి రామునికి ఏదైనా గుర్తుగా ఇవ్వమన్నాడు. సీత తన చూడామణిని హనుమకు ఇచ్చి రామునికి అందజేయమని చెప్పింది.
అప్పుడు హనుమంతుడు సముద్రం పై లంఘించి రాముని దగ్గరకు తిరిగి చేరుకున్నాడు. జరిగినదంతా సవివరంగా రామునికి చెప్పి సీత తనకిచ్చిన చూడామణిని అందజేశాడు. మాట వారు సంఘటనలను నే
వెంటనే రాముడు లక్ష్మణుని పిలిచి యుద్ధానికి సిద్ధంగా ఉండమన్నాడు. రాముడు వానరయోధులందరికీ ఆశీస్సులందించేడు. వారు ముందంజ వేయగానే శుభ శకునాలు స్వాగతం పలికేయి. రావణుని భార్య మండోదరి రావణుని పాదాలపై పడి సీతను తిరిగి పంపివేయమని ప్రార్థించింది. కాని రావణుడు ఆమె మాటను వినడానికి తిరస్కరించేడు.

గురువులు బాలలకు బోధించవలసినవి: స్వామి ఎప్పుడూ చెబుతారు మనం మంచివారుగా ఉండడానికి కృషి చెయ్యాలి. గురువులు ముఖ్యంగా స్వామి జీవితంలో జరిగిన వివిధ సంఘటనలను వివరించి, మంచితనపు విలువను తెలియజెప్పాలి.

గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు : గొప్పతనం సద్గుణాలలో ఉంటుంది. అంతే కాని ధైర్య శౌర్యాలలో కాదు. మంచిగా ఉండండి, మంచినే చేయండి, మంచినే చూడండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: