కుంభకర్ణుని మరణం

Print Friendly, PDF & Email
 కుంభకర్ణుని మరణం

Kumbakarna's Death

ఆరు రోజులు భయంకరమైన యుద్ధం జరిగింది, కాని రాక్షసులు ఓడిపోయేరు. ఓటమిని అంగీకరించడానికి రావణుడు భయపడిపోయేడు. సోదరుడు కుంభకర్ణుని సహాయం కోసం వెళ్ళాడు. “ఇతరుల భార్యను అపహరించి నువ్వు చాలా దుర్మార్గమైన పని చేశావు. రామునికి క్షమాపణ చెప్పుకో” అని కుంభకర్ణుడు చెప్పేడు. కానీ రావణుడు అతని మాటలు లక్ష్య పెట్టలేదు. చివరికి రావణుని బలపరచాడానికి కుంభకర్ణుడు యుద్ధభూమికి వెళ్ళేడు. రాజుని దూరంగా ఉంచడంవలన తాను వానరసేనను ఓడించగలిగాననుకున్నాడు కుంభకర్ణుడు. అయితే సుగ్రీవుడు అతని పట్టు నుంచి విడిపించుకుని తిరిగి దాడి ప్రారంభించాడు. అయినా వానరులు భయపడ్డారు, చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయేరు. అతడు యుద్ధభూమిలో అడుగు పెట్టవలసిన సమయము ఆసన్నమయిందని తన అక్షయతూణీరాన్ని తీసుకొని రమ్మని రాముడు లక్ష్మణునికి చెప్పేడు. కోదండ ధనుస్సుని చేత ధరించి యుద్ధ ప్రాంతంలో అడుగు పెట్టేడు శ్రీరాముడు. రామబాణాల తాకిడికి తట్టుకోలేక రాక్షసులు పరుగులు పెట్టేరు. కుంభకర్ణుడు తన శక్తిమేరకు యుద్ధం చెయ్యడానికి ప్రయత్నించేడు. కాని రాముని చేతిలో మరణించేడు. కుంభకర్ణుని శరీరం నుండి ఒక జ్యోతి వెలువడి రామునిలో లీనమైంది.

గురువులు బాలలకు బోధించవలసినవి:

 ఎవరైనా పక్షపాతం చూపిస్తూ, అన్యాయంగా పనులు చేస్తే, మన సన్నిహిత మిత్రులైనా వారిని బలపరచకూడదు, చెడు మార్గం నుంచి వారిని తప్పించడానికి ప్రయత్నించాలి. ధర్మమార్గంలోకి తిరిగి రావడానికి వారిని ఒప్పించలేకపోతే, అట్లాంటి వారి నుండి దూరంగా ఉండాలి.

అలా కాకుండా, అటువంటి వారితో కలసి వెళ్ళాలనుకుంటే వారితో పాటు మీ జీవితాలు కూడా నాశనమైపోతాయి.

గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు:
చెడు సహవాసాలను విడిచిపెట్టు, ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు. నీ మాట, చేత, ఆలోచన, శీలము, హృదయము పట్ల జాగరూకుడవై ఉండు.

(గురువులు జయ-విజయుల కథ వివరించాలి. జయ-విజయులు శ్రీమహావిష్ణువు ద్వార పాలకులు. వారు తమ తప్పుడు పనుల నుండి విమోచన కొరకు త్రేతాయుగంలో రావణ-కుంభకర్ణులుగా జన్మించారు. అందుచేతనే రాముని (శ్రీమహావిష్ణువు అవతారం) చేతిలోనే కుంభకర్ణుడు వీరమరణం పొందేడు. జ్యోతి స్వరూపుడిగా రామునిలో ఐక్యమయ్యేడు. జయ-విజయుల శాపం, వారు మూడు యుగాల్లో మూడు జన్మల కథని తరగతిలో ‘వేదానుద్ధరతే’ శ్లోకం బోధిస్తున్నప్పుడు వివరించవచ్చు).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: