ఆత్మ ఎక్కడ ఉంది?

Print Friendly, PDF & Email

ఆత్మ ఎక్కడ ఉంది?

Thief searching the merchant's purse

ఒక శ్రీమంతుడు ఒకనాడు తమ ప్రక్క గ్రామంలో జరుగుతున్న జాతరకు వెళ్ళాడు. ఆ జాతర నుండి అతడు తిరిగి వస్తూ ఉండగా, అతని వస్తువులను దొంగలించాలనుకుని ఒక దొంగ అతని వెనుకనే బయలు దేరాడు. దొంగ శ్రీమంతునితో మంచి మాటలు మాట్లాడి పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ కలిసి రాత్రికి ఒక సత్రంలో బసచేసారు. అందరూ నిద్రపోయిన తరువాత దొంగ మేలుకొని, శ్రీమంతుని డబ్బు సంచిని కాజేయాలనుకొని, బాగా వెదికాడు. ఎంత వెదికినా శ్రీమంతుని దగ్గర ఏదీ దొరకలేదు.

తెల్లవారు ఝామున దొంగ ఆ శ్రీమంతుని నిద్రలేపి “ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు. మీరు మీ సంచిని జాగ్రత్త చేసుకున్నారా?” అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీమంతుడు “అవునవును, అందుకే రాత్రి నా సంచిని నీ తలగడ క్రింద పెట్టాను. ఇదిగో చాలా జాగ్రత్తగా ఉంది” అంటూ తన సంచిని దొంగ తలగడ క్రింద నుండి తీసుకున్నాడు. డబ్బు సంచి రాత్రంతా తన తలక్రిందనే వున్నప్పుటికీ, దొంగకు ఆ విషయం తెలియక ఇతర ప్రదేశాలన్నిటినీ వెదికాడు, ఫలితము లేకపోయింది.

Merchant takes out the purse from thief's pillow

అదే విధంగా మానవుడు తనలో అంతర్గతంగా ఉన్న ఆత్మశక్తిని గుర్తించలేక బాహ్యా ప్రదేశాలలో వెదకటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.

దేవుడు ఆత్మశాంతి, ఆత్మజ్ఞానం, కలుషితం కాని ఆనందం ఉన్న సంచిని మనిషి తలలో పెట్టాడు. కాని మనిషి దీన్ని తెలుసుకోలేక వాటికోసం బయట వెతుకుతూ ఉంటాడు. అందుకే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు internet మీద ఆధార పడవద్దు, inner-net మీద ఆధార పడండి, అంతర్ శోధన చేయండి అంటారు. మనలో లేనిది, దొరకనిది యింక బయట ఎక్కడా లేదు, దొరకదు.

[Ref: China Katha – Part 1 Pg:188]

 Illustrations by Ms. Sainee
Digitized by Ms.Saipavitraa
(Sri Sathya Sai Balvikas Alumni)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: