హరి (3) – మరింత విపులంగా చదవటానికి

Print Friendly, PDF & Email
హరి (3) – మరింత విపులంగా చదవటానికి
  1. హరి
  2. మురళి
  3. మురహర
  4. గిరిధారి
హరి

హరి అనగా హరించువాడు, ఆటంకములను తొలగించు వాడు అని, సాధనా మార్గంలో ఆధ్యాత్మిక క్రమశిక్షణకు ఉండే అడ్డంకులను నాశనం చేయువాడు లేదా తొలగించువాడు అని భగవాన్ బాబా వారు చెప్పారు. “హరి”అనే పేరు కు హరిత (ఆకుపచ్చని) వర్ణంలో ఉన్నవాడు అని అర్థం. ఎందుకంటే “హరి”అనే మూలపదానికి ఆకుపచ్చ వర్ణము అని అర్థం. మహాభారతంలో శ్రీకృష్ణుడు “నా యొక్క అత్యున్నతమైన వర్ణము హరితవర్ణమై ఉండును” కనుక నేను ‘హరి’ అని పిలువబడతాను. దాని అంతరార్థం ఏమనగా హరిత వర్ణము మనస్సుకు శాంతిని చేకూరుస్తుంది. అదేవిధంగా హరినామ స్మరణ ఆత్మశాంతిని ప్రసాదిస్తుంది.

మురళి

శ్రీకృష్ణుడు వాయించే వేణువే మురళి. ఈ మురళి వెదురు చెట్ల నుండి తయారు చేయబడి, శ్రీకృష్ణుని పెదవుల పైకి చేరింది. శ్రీకృష్ణుడు మురళి నాదంతో గోపబాలురను, గోపికలను, ఆవులు, చెట్లు, మొక్కలు మరియు సమస్త సృష్టిని మంత్రముగ్ధులను చేశాడు. భగవంతుని పెదవులపై ఉన్న ఆవేణుపు అత్యంత మనోహరమైనది మరియు పవిత్రమైనది. ఇంతటి దివ్య ఆశీస్సులు పొందిన ఆ వేణువుకి ఉన్న అర్హతలు ఏమిటి? వేణువు ఎటువంటి వంపులు లేకుండా చక్కగా, నిరాడంబరంగా వుండి, లోపల ఏమీ లేకుండా డొల్లగా ఉండి, అహంకారహితంగా, ఉంటుంది. కనుక మనల్ని కూడా అహంకారం లేనివారిగా, నిరాడంబరంగా, మనసంతా తేలికగాను, అందంగానూ మార్చమని భగవంతుడు ప్రార్థించండి అని స్వామి చెబుతారు.

మాధవ

“మాధవ”అనే పదము ‘మా’ మరియు ‘ధవ’నేను పదాల నుండి వచ్చినది. ‘మా’ అనగా సంపదతో, వరాలతో కూడిన దేవత లక్ష్మీదేవి అని. ‘ధవ’అనగా భగవంతుడు. శ్రీకృష్ణుడు విష్ణు మూర్తి యొక్క అవతారంగా చెప్పబడతాడు. అతని భార్య లక్ష్మీదేవి. అందువలన పురాణాల ప్రకారం మాధవ అనే పేరు అంతర్గతంగా ఉన్న అర్థం ఏమనగా, లక్ష్మీదేవి ప్రకృతిని సూచిస్తుంది. అనగా ప్రకృతి పరమాత్మ యొక్క విడదీయరాని స్వరూపంగా చెప్పబడుతుంది. ప్రకృతి సృష్టితో విడదీయరాని సంబంధాన్ని కలిగి ఉంటుంది. నిజానికి సృష్టి కర్త యొక్క ప్రతిబింబమే ప్రకృతి. అందుచేతనే ప్రకృతికి అధిపతి అయిన మాధవుడు సృష్టికి మూల కర్త.

మురహర

సంస్కృతంలో మురహర అనగా ‘ముర’అను రాక్షసుని సంహరించిన వాడు అని అర్థం. మనము అజ్ఞానము అనే నిజమైన స్వభావంతో కప్పబడి. మన శరీరమే మనదిగా భావిస్తాము. కానీ మనము శరీరం కంటే గొప్పనైన, శాశ్వతమైన ఆత్మ స్వరూపులము. ముర అను రాక్షసుడు మన యొక్క అజ్ఞానాన్ని సూచిస్తాడు మరియు కృష్ణుడు మురహర అని పేరు కలిగి ఉండి మన అజ్ఞానాన్ని నాశింప చేసి, మనకు జ్ఞానోదయాన్ని ప్రసాదిస్తాడు.

గిరిధారి

‘గిరి’అనగా పర్వతము మరియు’ధారి’అనగా ధరించువాడు, భగవంతుడు అని అర్థం. శ్రీ మహావిష్ణువు తన రెండు అవతారాలలో పర్వతాన్ని తనపై మోసాడు. క్షీరసాగర మథనం సమయంలో, కూర్మావతారాన్ని ధరించి, పర్వతాన్ని మధించే కర్రగా ఉపయోగించిన మంధర పర్వతాన్ని మోసాడు. దీని అంతరార్థం ఏమనగా భక్తుడు తన హృదయాన్ని మధనపరుచుకొంటున్నప్పుడు, మంధర పర్వతానికి భగవంతుడు ఆసరా ఇచ్చినట్లే, ఆధ్యాత్మిక సాధకుల బుద్ధికి ఆసరాగా ఉంటాడు. మనసు మరియు హృదయ మదన జరిగినప్పుడే భగవంతుడు మనకు అండగా ఉంటాడని అర్థము. మరి ఈ మదనం ఎలా జరుగుతుంది? శ్రవణం, మననం, నిశ్చలత్వము కల్గి నప్పుడు వాటి ప్రతిబింబమే మధనము. పై మార్గాల ద్వారా మధనం జరిగినచో అమృతము బయటికి వచ్చి అమరత్వాన్ని సిద్ధింప చేస్తుంది. అనగా సాధన ఫలిస్తుంది అని అర్థం. అదేవిధంగా మరొక ఉదాహరణ ఏమనగా, కృష్ణావతారంలో గోవర్ధన గిరి పర్వతాన్ని మోసిన సందర్భం. బృందావనవాసులు ఇంద్రుడిని, వరుణ దేవుడిని పూజించేవారు. శ్రీకృష్ణుడు ఇంద్రుని పూజకు బదులుగా గోవర్ధనగిరిని పూజించమని నందుని ఒప్పించాడు. దీనితో ఆగ్రహించిన ఇంద్రుడు గోకులంపై తీవ్ర వర్షాన్ని కురిపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని తన చిటికెన వేలిపై మోసి గోకుల వాసులందరికీ, ఆ పర్వతం కింద ఆశ్రయాన్ని కల్పించి రక్షించాడు. ఇలా ఏడు రోజులపాటు శ్రీకృష్ణుడు పర్వతాన్ని మోస్తూ గోకుల వాసులను రక్షించాడు. అనగా మనము భగవంతుని శరణు జొచ్చినచో మన జీవిత భారాలను అంతా మోయగలడు అని నిరూపించాడు. కనుక మనం మధురానాధుడు, హృదయ నివాసి, నిరంతరం మన స్థితిని ఎరుక కలిగించే ప్రభువు, ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా గోవర్ధనగిరిని ఎత్తి బృందావనవాసులను రక్షించినట్టుగా ఎల్లవేళలా అండగా ఉంటాడు అని విశ్వసించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *