ఆది శంకరాచార్య జీవితం

Print Friendly, PDF & Email

ఆది శంకరాచార్య జీవితం

ఆదిశంకరాచార్య కీ.శ. ఎనభై శతాబ్దం చివరలో కేరళ లోని కాలడీ అనే గ్రామంలో జన్మించారు. భక్తులైన నంబూద్రి బ్రాహ్మణులు శివ గురువు, ఆర్యాంబ దంపతులకు ఏకైక కుమారుడు. త్రిచూర్ లోని వృషభాచలశ్వర శివాలయం లోని శివునికి చేసిన తీవ్ర ప్రార్థనల వల్ల జన్మించాడని వారి నమ్మకం. అతను శిశు ప్రాయంలో అంటే ఎనిమిదేళ్ళ వయసులో తన వేద విద్యను పూర్తి చేశాడు. చిన్న వయసులోనే తండ్రి మరణించాడు తల్లి చాలా శ్రద్ధగా ప్రేమగా పెంచింది. అతనే అప్పుడు ఆమెకు ఓదార్పు ఏకైక మద్దతు కూడా. బాలుడు సన్యాసి లక్షణాలు కలిగి ఉండేవాడు దానికి తల్లి కలత చెందేది. అయినా ఆ గొప్ప మేధావి తన దైవిక లక్ష్యం నెరవేర్చాల్సి ఉంది. కాబట్టి శంకరుణ్ని ప్రాపంచిక బంధాల నుండి విముక్తి చేయడానికి ఏదో ఒక అద్భుతం జరగాలి. ఒకరోజు బాలుడు పూర్ణానది లో స్నానం చేస్తుండగా తల్లి ఒడ్డున ఉన్నది. ఒక మొసలి కాలును పట్టి లోపలికి లాగుతోంది. మరణం (అకారణంగా ) సమీపించినపుడు ప్రతి హిందువు కోరుకునే చివరి ఆశ్రమం సన్యాసి ఆశ్రమం తీసుకోవడానికి తల్లి అనుమతి కోరాడు. అటువంటి ఆపత్సమయంలో తన అధికారాన్ని వదులుకుని అయిష్టంగానే తల్లి అంగీకరించింది. రహస్యంగా మొసలి బాలుడిని వదిలింది. నది నుంచి బయటకు వచ్చిన బాలుడు సన్యాసిగా మారాలని నిర్ణయించుకుని తల్లిని ఒప్పించి ఆమె చివరి దశలో తాను పక్కనే ఉంటానని ఆమె అంత్యక్రియలు తానే చేస్తానని మాట ఇచ్చి గ్రామాన్ని విడిచి వెళ్ళాడు. శంకరుడు ఎనిమిదేళ్ళ వయసులో తన దైవిక కార్యక్రమానికి బయలుదేరాడు. ఆ వయసులో పిల్లలు తమ ఆట బొమ్మలు కూడా విడిచిపెట్టరు .

కాలడీ వదిలిన తరువాత బాల సన్యాసి పండితుడు దక్షిణ భారత దేశంలో గురువును వెతుక్కుంటూ చివరకు నర్మదా నదీ తీరానికి చేరుకున్నాడు. అక్కడ మాండ్యూక శాఖా కారకుడిగా ఖ్యాతి గాంచిన మహా గౌడపాద శిష్యుడైన గోవింద భగవత్పాదుడిని కలిశాడు. వారు స్వాగతించి తమ శిష్యునిగా స్వీకరించారు. ఏడు సంవత్సరాల పాటు వేదాంత రుక్కులను వేదాధ్యయనం సాధన పూర్తి చేసిన తర్వాత గురువు కాశీకి వెళ్ళమని చెప్పాడు. పురాతనమైన విద్య సంప్రదాయాలు, ఆధ్యాత్మిక నగరమైన కాశీ నగరానికి చేరుకుని బ్రహ్మ సూత్రాలకు వ్యాఖ్యానం, అద్వైత సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయమని ఉపనిషత్తులు భగవద్గీత వ్యాఖ్యానాలు ఆదేశించాడు. గురువు ఆదేశానుసారం కాశీకి వెళ్ళి అక్కడ కొద్ది కాలంలోనే వేదాంతం తత్వ శాస్త్రంలో గొప్ప విజేతగా స్థిరపడ్డారు. అనేక చర్చలో విజయం సాధించాడు. పెద్ద సంఖ్యలో శిష్యులు దగ్గరికి చేరారు. వారిలో పద్మపాదుడు, హస్తమలక, తోటకాచార్య ముఖ్యులు. ఈ విధంగా 16 సంవత్సరాలకే వారణాసి లో గొప్ప తత్వవేత్తగా స్థిరపడ్డారు. అప్పటికే అది ఆధ్యాత్మిక , మేధో ఉద్యమాలకు గుండె కాయ అయింది. తత్వవేత్తగా స్థిరపడి బ్రహ్మ సూత్రాలకు భాష్యం రాస్తున్నప్పుడు శ్రీ వేదవ్యాస మహర్షి అనుగ్రహించి చేసిన నిర్దిష్ట సూచన మేరకు దేశమంతా దిగ్విజయ యాత్ర కోసం పర్యటన ప్రారంభించారు. వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడి తత్వవేత్తలను గెలిచి అద్వైత సిద్ధాంతాన్ని దృఢంగా స్థాపించాడు. వారి అపారమైన పాండిత్యానికి, మాండలిక నైపుణ్యానికి, ఆధ్యాత్మిక అంతర్దృష్టికి వ్యతిరేకంగా ఎవరూ నిలబడలేదు. వారు చేసిన చర్చల్లో ముఖ్యమైనవి ఏమిటంటే ఆచార సంప్రదాయాలు. వాటిలో కథానాయకుడు అనిపించుకున్న కుమారీల భట్టు శిష్యుడైన మండన మిశ్రుడును కలుసుకోవడం. వేదాల్లోని కర్మకాండ భాగం ఆనాడు హిందూ మతంపై చాలా పట్టును కలిగి ఉంది. ఇది కూడా కుమారీల భట్టు, మండనమిశ్రుడు వంటి నాయకుఈలు తత్వవేత్తలు అధికారుల కారణంగా ఉంది. శంకరుడు జ్ఞాన కాండ యొక్క సత్యాలను చూపించడానికి వీరిద్దరినీ గెలవ వలసి వచ్చింది. ఆ సమయంలో కుమారీల భట్టు ఆత్మను బంధించకుండా శాశ్వతంగా విముక్తి చేస్తుందని విశ్వసించే ఒక ఆచారమైన స్వీయ దహన అగ్ని లోకి ప్రవేశించినందున తన శిష్యుడైన మండన మిత్రుడు తో చర్చను ప్రారంభించాలని కోరాడు. అతనితో ఆ తర్వాత వారిద్దరి మధ్య న్యాయ మూర్తిగా ఉన్న మండన మిశ్రుడి భార్య ఉభయ భారతి తో చాలా కాలం వాదన సాగింది చివరకు మండనమిశ్రుడు ఓటమి అంగీకరించాడు. ఎవరైతే ఓడిపోతారో వారు గెలిచిన వారికి శిష్యులుగా మారి వారి జీవన విధానాన్ని అనుసరించాలి అనేది చర్చనీయాంశం. మండనమిశ్రుడు శిష్యుడు గా మారి సన్యాసాశ్రమం స్వీకరించాడు. అతనికి సురేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఈ గెలుపు శంకరునికి ఆధ్యాత్మిక విజయంగా మంచి శక్తి వచ్చింది . శ్రీ శంకరులు అతని శిష్యులు ఆధ్యాత్మికంలో తప్పుడు సిద్ధాంతాలను ఖండిస్తూ దేశమంతా తిరిగారు. ఆ పర్యటనలో వారు నాలుగు మఠాలను స్థాపించారు. దక్షిణాన శృంగేరి ఉత్తరాన బదిరి పశ్చిమాన ద్వారక తూర్పున జగన్నాధం. కంచిలో కూడా కామకోటి పీఠం స్థాపించారు. మంచు పర్వతాలు అడవులు నదులు మధ్య, సముద్రపు ఒడ్డున భూలోక స్వర్గం అనిపించే ఈ ప్రదేశాలను ఎన్నుకున్నాడు. మనిషి ఆలోచనలను ఉత్కృష్టమైన ఎత్తుకు తీసుకుని వెళ్లాలని ఈ అందమైన సహజ ప్రకృతి గల ప్రదేశాలను ఎంచుకున్నారు. శృంగేరీ లో సుందరేశ్వర చార్యులను ద్వారక లో పద్మపాదుడిని, బద్రీలో తోటక మరియు పూరీ లో హస్తమలక పీఠాధిపతి గా నియమించారు. ఈ మఠాల స్థాపన భారతదేశం యొక్క భౌతిక ఆధ్యాత్మిక ఐక్యతను సూచిస్తుంది. శంకరుడు తన భాష్యాలను సంస్కృతం లో రాశాడు అది మాత్రమే భారతీయ భాష, ఆ భాషతో ప్రపంచ మేధావులను ఆకర్షించాడు. శృంగేరీ లో చాలా కాలం గడిపిన తర్వాత కాలడీ గ్రామంలో తన తల్లి మరణిస్తున్న పడక వద్దకు వెళ్ళి ఆమె ఆత్మకు శాంతి కలిగించాడు. శివ, విష్ణువు స్తోత్రాలు మధురంగా రచించి అన్ని జాతుల మన్ననలు పొందారు. అన్ని వ్యతిరేకతలను తట్టుకుని తల్లికి తమ ఇంటి వెనుకనే ఉన్న నది ఒడ్డున అంత్యక్రియలు చేశారు అది కాలక్రమంలో పుణ్యక్షేత్రం అయింది. కంచి కామాక్షి ఆలయం, బదరీ నారాయణ ఆలయం, గుహ్యేశ్వరి ఆలయాల్లో శ్రీ చక్ర స్థాపన చేసి, ఆరాధనా పద్దతులను శుద్ధి చేసి ప్రజల మనోభావాలను సమ్మిళితం చేస్తూ దేశమంతటా పర్యటించారు. నేపాల్ వంటి ప్రాంతాలు తిరిగారు. కాశ్మీరీ పండితులను ఓడించి అత్యున్నత పరమహంస పరివ్రాజక ఉపాధ్యాయులుగా విజయ కీర్తి పొందారు. అన్ని శాఖల్లో పాండిత్యం, తన తిరుగులేని తత్వాన్ని బోధించి సర్వజన పీఠాన్ని అధిరోహించారు.

తన చివరి నేపాల్ పర్యటనలో శ్రీ దత్తాత్రేయ దర్శనం పొందారు. అక్కడ నుంచి కేదారనాథ్ వెళ్ళారు. తాను 32 వ సంవత్సరంలో తమ భౌతిక జగత్తు నుండి అదృశ్యమయ్యారని చెబుతారు. కేదార్ నాథ్ పుణ్యక్షేత్రం లోని ఒక ప్రదేశాన్ని ఆయన అదృశ్యం అయిన చోటుగా పేర్కొంటారు.( ఒక రకంగా పవిత్రమైన కంచి కామాక్షి లో లీనమయ్యారు ) ఏదైనా వారి భూ సంబంధం ముగిసింది.

శంకరుడు ఉపనిషత్తు, తత్వశాస్త్రం లోని హేతు బద్ద సిద్ధాంతంతో హిందూ మతం అనే భవనాన్ని పటిష్టం గావించారు. ఆ విధంగా సనాతన ధర్మం ఆధునిక కాలంలో అన్ని సవాళ్ళను ఎదుర్కొనగలదు. భారతీయ తత్వ శాస్త్రానికి వారి సహకారం ఎంతో గొప్పది, శాశ్వతమైనది. తర్వాత కాలంలో శాస్త్రవేత్తలు అందరూ వారిని తిరస్కరించడం లేదా వారిని వివరించడానికి ప్రయత్నించారు. భారతీయ తత్వ శాస్త్రం ఎప్పుడూ శంకరుని అద్వైత సిద్ధాంతంతో ముడిపడి గుర్తించబడింది.

శంకరుడు ఒక రుషి సంస్కరణకు ప్రతీక. వారి సందేశం ఎప్పుడూ ఆశావాదం. మనిషి అంతిమంగా తుది ఉత్పత్తి మాత్రమే కాదని చెప్పారు. మనిషిలో దైవిక స్వరూపం ఉంది ఇది స్వీయ చేతన సాధనతో గుర్తించబడుతుంది. శాంతి,సంపూర్ణత, ఆనందం మనలో ప్రతి ఒక్కరిలో ఉందని అద్వైతం చెపుతుంది. మనం దాన్ని గుర్తించాలి. వారి పేరు సూచించినట్లు ( సం కరోతి ఇతి శంకర అనుగ్రహించేవాడు శంకరుడు) శంకరాచార్య మానవజాతి శ్రేయోభిలాషి ఎందుకంటే ఆయన వేదాల సారాంశం, ఆనంద మార్గం, అమరత్వం అయిన అద్వైత సిద్ధాంతాన్ని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: