హర హర శంకర
సాహిత్యం
- హర హర శంకర సాంబ సదాశివ ఈష మహేశ
- తాండవ ప్రియకరా చన్ద్రకలాధరా ఈషా మహేశా
- అంబ గుహా లంబోదర వన్దితా ఈషా మహేశా
- తుంగా హిమాచలా శృంగ నివాసితా ఈషా మహేశా
సాహిత్యం
భగవంతుని అనేక నామాలను శంకర, సాంబ సదాశివ , మహేశ అని జపించండీ. ఓ మహేశా! మీకు తాండవ నృత్యం (కాస్మిక్ డ్యాన్స్) అంటే చాలా ఇష్టం. మీ నుదుటిపై చంద్రుని అలంకరించుకున్నారు. గణేషుని చే పూజించబడ్డారు. మీరు హిమాలయాల నివాసి. మీ దివ్యనామాలను జపించడం ద్వారా చెడును నశింపజేసి రక్షణను ప్రసాదిస్తారు.
వివరణ
హర హర శంకర సాంబ సదాశివ ఈష మహేశ | పరమేశ్వరా! నీవు నిత్య శుభప్రదుడు, సందేహాల నివృత్తి చేయువాడవు. ప్రకృతికి యజమాని, సకల శుభాలకు మూలం. |
---|---|
తాండవ ప్రియకరా చంద్రకళాధర ఈషా మహేశా | ఓ శివా! మీరు తాండవ నృత్యం చేస్తూ విశ్వం లో సమతుల్యత మరియు లయను అనుగ్రహిస్తారు. నెలవంకను శిరస్సున ధరించునది మీరే ఎప్పుడూ ప్రశాంతంగా, నిర్మలంగా ఉండి కాలాన్ని శాసించే గురువు మీరే! |
అంబ గుహ లంబోదర వందిత ఈషా మహేశా | ఓ పరమ శివా! మాత పార్వతితో పాటు సుబ్రహ్మణ్యగణేశునిచే నీవు పూజింపపడుతున్నావు. సర్వశక్తిమంతుడైన ప్రభువు నీవే! |
తుంగా హిమాచలా శృంగ నివాసితా ఈషా మహేశా | శివా వ! హిమాలయాలలె పవిత్రమైన, స్థిరమైన హృదయాలలో నివసించే వాడవు. మా హృదయ లోతులలో ఊహించదగిన నిశ్శబ్దం మీరు. |
Raga: Largely based on Darbari Kanada
Sruthi: C# (Pancham)
Beat (Tala): Keherwa or Adi Taalam – 8 Beat
Indian Notation
Western Notation
Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_12/01FEB14/Hara-Hara-Shankara-Samba-Sadashiva-Eesha-Mahesha-bhajan-tutor-february.htm