విజయోత్సాహముతో మాతృభూమికి మరలి వచ్చుట
విజయోత్సాహముతో మాతృభూమికి మరలి వచ్చుట
వివేకానందుడు తనసిష్యబృందముతో 1897 జనవరి 15వ తేదీన కొలంబో నగరమునకు చేరెను. అతడు మాతృదేశమునకు తిరిగివచ్చు చున్నా డను వార్త భారతదేశమున కందెను. అతనిని ఆహ్వానించుటకు భారతీయ ప్రజలందరు అత్యంతాసక్తితో ఎదురుచూచుచుండిరి. వివేకానందుడు భారతదేశ గౌరవము నొకవైపునను, పాశ్చాత్య ప్రపంచ ప్రతిష్టను మరియొక వైపునను పునరుద్ధరించిన మహాత్ములలో ఒక డని భావించి, అతనిని గౌరవింపవలే నను తలంపునందు భారత దేశమంతయు ఐక్యలవ ములో ఒకవ్యక్తిగా నిలువబడెను. వివేకానందునికి ఘనస్వాగతమును ససుర్పించుటకు ప్రతినగరమునందును, చిన్నవో, పెద్దవో ఆహ్వాన సంఘము లేర్పడెను. భారతదేశమున కెట్టి సందేశ మిచ్చునో అని వెర్రి అవేశములో ఎదురుచూచుచున్న దేశప్రజల నుద్దేశించి వివేకానందుడు ప్రబోధించిన విధమును రొమైన్ రోలండ్ (Romain Rolland) ఇల్ల 3 వర్ణించి చెప్పెను. వివేకానందుడు “శిపుడు, రాముడు, కృష్ణుడు అవతరిం చిన ఈ పుణ్యభూమిని జాగృతపరచి, విస్మృతిమైన ఆదివ్యశక్తిని ప్రబో ధించుటకు తన సందేశమును వీరశంఖముగా పూరించెను.” దేశమునందలి దివ్యాత్మ మేల్కాంచి పురోగమింపవలె నని ఎలుగెత్తి చాటెను. తిన ప్రచార ప్రణాళికను ప్రజలకు వివరించి చెప్పెను. భారత ప్రజ మూక ఉమ్మ। దిగా ఆధ్యాత్మికముగా మేల్కాంచి అభ్యుదయ పథమునందు సాగునట్ల ప్రబోధించెను. “ఓ నాప్రియతమ భారతదేశమా: ఉత్తిష్ఠ! నీ ఆత్మ ఎచ్చటకు తరలిపోయినది? అమృతమైన నీ అంతరాత్మను అన్వేషించును. ముందుకు సాగిపో” అని వై తాళికునివలె ప్రబోధించెను.
మదరాసులో స్వామి వివేకానందుడు అయిదుసభలలో ప్రజల నుద్దేశించి ఉపన్యసించెను. ప్రతి ప్రవచనము ఒక ప్రదోదము. భారతీ యులు తమ బలహీనతలను, మూఢ భారత నిర్మాణమునకు నడుముకట్టు విశ్వాసములను పరిత్యజించి, సిని కాల మాసన్నమైన దని దేవద తమునుపూరించినట్లు ప్రబోధించెను. ప్రపంచము నంతటిని ఆధ్యాత్మికదృష్టితో ఒక్క కుటుంబముగా భావించెడిమతమే, భారతీయ జీవన వీణానాదము నకు క్రప్రతిసత్ర మని వివేకానందుడు నొక్కివక్కాణించెను. దానిని మనము బలపరచినచో, మిగిలినవాని నన్నింటిని అడియే సరిపరచును. వెర్రి స్వదేశీయులలో బలముగా నాటుకొనియున్న మూఢాచారములపైగల గుడ్డి 65 నమ్మకములు, కుల వర్ణవైషమ్యములు మొదలగు వానిని వివేకానందుడు. విమర్శించి; ఉచిత మైన అంశములయందు పాశ్చాత్యులను అనుసరించుట మేలని నొక్కి చెప్పుటకు వెనుకాడలేదు.
ఫిబ్రవరి 20వ తేదీన స్వామి వివేకానందుడు కలకత్తా నగరము చేరికొనెను. జన్మనగరము అతనికి ఘనస్వాగత మిచ్చెను. అచ్చట ఆయన తనగురుదేవులను అర్ద్రహృదయముతో కీర్తించెను. “నావలన ఏమైనను సాధింపబడిన దన్నచో, నా మనోవాక్కాయ కర్మలద్వారా నేనేమైన నిర్వ హించి నా నన్నచో, నా పెదవులపై పదములు పలుకబడినవన్నచో, నా త్మ, కీప్రపంచమున నెవరైన సహాయపడినారన్నచో, అవియన్నియు నా స్వయంప్రయోజకత్వములుకావు. అనియన్నియు ఆ గురుడేపుల లీలలే….. ఈ దేశము జాగృతి పొందవలెనన్నచో, ఆ గురుదేవుల దివ్యనామము చుట్టును అది మూగవలెను. నా మాటలు నమ్ముడు.”