రామకృష్ణ మిషన్ అవిర్భావము
రామకృష్ణ మిషన్ అవిర్భావము
స్వామి వివేకానంద తన కార్యక్రమములకు స్థిరమైన పునాదులను కల్పింపదలచి 1897 మే ఒకటవ తేదీన పరమహాంస శిష్యులైన సన్న్యాసులను, ఇతరులను సమావేశపరచి, రామకృష్ణమిషన్ను స్థాపించెను. సంస్థయొక్క ఆశయములు పూర్తిగా తాత్త్విక, మానవతా ప్రాతిపదికలపై నిలిపి ప్రపంచించెను. ఆ ఆశయములను కార్యరూపమున నిర్వహించు వ్యవస్థను ప్రారంభించెను. ఆమరుసటి సంవత్సరము కలకత్తానగరములో ప్లేగువ్యాధి వ్యాపించినపుడు, అవ్యాధి వ్యాపింపకుండ ఆరికట్టుటకై తన సంస్థ సభ్యులైన సన్న్యాసులలోను, ఇతరులతోను శిబిరముల నేర్పాటుచేసి, సామాన్య ప్రజలకు అహోరాత్రములు సేవలు చేసి, అంటువ్యాధి వలన కలిగెడి అపారనష్టమునుండి ప్రజలను కాపాడెను, ప్లేగురోగ వ్యాప్తి అరికట్టునట్లు కృషిచేసెను. స్వామి జీవిత చరిత్ర రచించినవారి మాటలలో “స్వామి సాధించిన అసంఖ్యాకములైన విజయములలో వాట గొప్ప విశేషమేమనగా,తన తోటి రామకృష్ణ శిష్యులందరిని వారి వ్యత్తిగత సాధనలనుండి మత జీవితములోని అంతర్భాగమైన జాతీయభావము వైపు పురోగమించునట్లు చేసెను. సాటి మానవులకు మించినవి.” ఆ సాధనలో సంఘసేవాభావము సేవజేయు స్వభావము ప్రధాన స్థానము ఆక్రమించినవి.”