మరల ప్రపంచ యాత్ర

Print Friendly, PDF & Email
మరల ప్రపంచ యాత్ర

1899, జూన్ 20వ తేదీన స్వామి విదేశయాత్రలకు బయలుదేరెను. ఈ సారి ఆయన వెంట స్వామి తురీయానంద, సిస్టర్ నివేదిత బయలుదేరిరి. స్వామి వెంట యాత్ర చేయుట’ వారిరువురికిని ఒక విజ్ఞానము – పార్జన మయ్యెను. సిస్టర్ నివేదిత ఆ యాత్రను గురించి ఇట్లు వ్రాసెను-“మొదటినుండి చివరివరకు వివిధ కధా ప్రవాహములు జాలువారుచుండెను. ఏక్షణమునందు ఏవినూత్నసత్యప్రతిపాదనము వివేకానందుని అంతరాత్మ చైతన్యమునుండి ప్రబుద్ధమై వెలుగుల నింపుచుండునో అని ఆశ్చర్యము కలుగుచుండెడిది.” వివేకానందుడు వారితో నిట్లనెను. “పాశ్చాత్య దేశము లందలి సాంఘిక జీవితము ఒక మహాట్టహాసము వంటిది. కాని దానివెనుక ఒక వేదన దాగియున్నది. అది చివరకు దుఃఖాంతముకాక తప్పదు కాని, భారత దేశమునందో పైకి విచారవిషాదములు కనుపట్టుచుండును, దాని తులలో ఒకనిర్లక్ష్యభావము, ఒకహర్షము నిలిచియుండును. పాశ్చాత్యప్రపంచము బహిః ప్రకృతిని జయించుటకు యత్నించినవి. పాచ్యప్రపంచము అంతఃప్రకృతిని జయించుటకు పాటుపడినది. ఇప్పుడు ప్రాక్పశ్చిమములు రెండును కలిసి పరస్పరశ్రేయము కొరకు చేతులుచేతులు కలిపి స్వీయవ్యక్తిత్వలక్షణములు ధ్వంసముకాకుండ, కలిసి కృషిచేయవలసిన తరుణను వచ్చినది. పాశ్చాత్యప్రపంచము ప్రాచ్యమునుండియు, ప్రాచ్యము పాశ్ళా త్యమునుండియు ఎంతయో నేర్చుకొనవలసిన అవసరమున్నది. నిజమునకు భవిష్యత్తును ఈ ఆదర్శద్వయముయెక్క సమన్వయమూర్తిగా మలచవలసియున్నది. అప్పుడు ప్రాచ్యమనియు, పాశ్చాత్యమనియు భేదభావము పోయి మానవత ఒకటియే నిలిచియుండును”.

అట్టి సమన్వయముకొరకు స్వామి వివేకానంద సంతతము కృషిచేయుచుండెను. ఉత్తర కాలిఫోర్నియాలో ‘శాంతి ఆశ్రమము’ను నెలకొల్పి, స్వామి తురీయానంద ఆధ్వర్యమున దానిని ఉంచెను. సాన్ ఫ్రాన్సిస్కోలో ‘వేదాంత కేంద్రము’ను నెలకొల్పెను.

స్వామి వివేకానందుని ఆధ్యాత్మికజ్యోతి ఉజ్జ్వలముగా వెలుగుచున్నను, శరీరదార్ధ్య మనెడి తైలము క్రమముగా తరిగిపోవుచుండెను. అతనికి తన అంత్యకాలము సమీపించుచున్నదని తెలిసినది. మిస్ మెక్ దొనాల్డుకు ఇట్లు వ్రాసెను. “నా జీవితనొక ప్రశాంత నౌకాశ్రమమును సమీపించుచున్నది. ఇక దానినచ్చటినుండి వెలుపలకుత్రోయుటకు వీలులేదు.”

1900సం ఆగష్టు ఒకటవ తేదీన “మత చరిత్రలను గూర్చిన సదస్సు” (The congress of the History of Religions) లో పాల్గొనుటకు పారిస్ నగరమునకు చేరికొనను. ఆ తరువాత కొన్ని, ఐరోపా దేశములలో పర్యటించి టర్కీకి, ఆ తరువాత ఈజిప్ట్ వెళ్ళెను. అప్పటి కెప్టెన్ సేవియర్ మృతిచెందనున్నాడను పూర్వబోధ స్వామికి కలిగెను. వెంటనే భారత దేశమునకు పయనము కట్టి 1900 సం॥ డిసెంబర్ 3వ తేదీ నాటికి బేలూరు మఠమును చేరుకొనేను. అట్లు అనుకొనకుండా స్వామి త్వరగా తిరిగి వచ్చినందుల అచ్చటి సాటి శిష్యులు ఆశ్చర్యానందములను అనుభవించిరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: