వీధి నాటకం (నుక్కడ్)
వీధి నాటకం (నుక్కడ్)
ప్రపంచం సాంకేతికంగా అభివృద్ధి చెందని కాలంలో వీధులలోనూ బహిరంగ ప్రదేశాలలోనూ ఈ వీధి నాటకాలను ప్రదర్శించే వారు. వీటిని వీక్షించటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యేవారు. సామాన్య ప్రజానీకానికి వారి వారి సమస్యలను వాటి పరిష్కారాలను నాటకీయంగా వీధులలో ప్రదర్శించేవారు. ఇప్పటికీ ఇది ప్రజలతో కనెక్ట్ కావటానికి, వారికి అవగాహన కల్పించడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక. వీటికి విస్తృతమైన ఏర్పాట్లు లేదా ఆధారం అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాలు మరియు మురికివాడలలో స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు వీధి నాటకాలు ఆదరణ పొందుతున్నాయి.
గ్రూప్ త్రీ బాలవికాస్ విద్యార్థులు గ్రామ సేవలలో భాగంగా ఇలా నాటకంగా వారి సమస్యలను పరిష్కరించవచ్చు. స్థానికంగా ఉన్న పిల్లలతో ఆ నాటకం యొక్క చిన్న పాత్రల చేయించడం ద్వార వారిలో కూడా ఆ ఊరి పట్ల బాధ్యతను కలిగించవచ్చు. వీధి నాటకాలు చూసేవారు సమిష్టి బాధ్యత భావాన్ని పెంపొందించడంలో ఇది సహాయపడుతుంది.
మార్గదర్శకాలు:
- నాటకాలు ఆ గ్రామ నిర్దిష్ట సమస్యలను ప్రతిబింబించేలా ఉండాలి.
- పరిశుభ్రత, సహనం, ధూమపానం మరియు మద్యపానం యొక్క చెడులు, గృహదు, మతసామరస్యం, సమయపాలన, డిజిటలైజేషన్ వాటి ప్రాముఖ్యత తెలియజేయాలి.
- ఆ గ్రామ ప్రజల దృక్పథంలో ఆశించిన మార్పులు తీసుకురావడానికి ఇటువంటి నాటకాలు క్రమ పద్ధతిలో ప్రదర్శించాలి.
- అన్న నాటకాలు ప్రత్యక్షంగా సన్నిహితంగా ఉంటాయి.
- ఇలా వీధి నాటకాలు నిర్వహించడం ద్వారా వారు సామాజిక బాధ్యతగల పౌరులుగా ఎదుగుతారు.
- బలహీనవర్గాల ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికోసం పనిచేయటానికి నిర్ణయించుకుంటారు.