గ్రామీణ బాలవికాస్ కార్యక్రమాలు

Print Friendly, PDF & Email

గ్రామీణ బాలవికాస్ కార్యక్రమాలు- విద్యాజ్యోతి కార్యక్రమాలు

విద్యార్థులు గ్రామాలలోనూ విద్యాజ్యోతి పాఠశాలలో బాలవికాస్ తరగతులు నిర్వహించినప్పుడు గురువుకు సహాయం చేయవచ్చు. ఆ పాఠశాలలలో సౌకర్యాలు తక్కువ, పిల్లలు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారి సహాయం చాలా విలువైనది. విద్యాజ్యోతి కార్యక్రమాలు, గ్రామీణ బాలవికాస్ కార్యక్రమాలు:

a) బాలవికాస్ తరగతులలో:
  • పిల్లలను వరుసలో కూర్చోబెట్టడం,
  • క్రమశిక్షణ పాటించేలా చేయడం,
  • క్లాస్ కోసం ప్రధానమైన ప్రోగ్రాములకు చార్ట్లు తయారు చేయడం, పట్టుకోవడం,
  • ఆడియో విజువల్ ఎయిడ్స్ తయారు చేయడం,
  • కుర్చీల ఆటల కోసం కుర్చీలను ఏర్పాటు చేయడం,
  • చార్టులు అంటించడం,
  • హాజరైన విద్యార్థుల పేర్లు వ్రాయడం,
  • కరపత్రాలు, ప్రసాదం పంచడం,
  • క్లాస్ క్రమబద్ధంగా ముగించడం.
b) ఆటల పోటీల నిర్వహణ
  • అలంకారాలు, పూలదండలు వేయడం.
  • కూర్చోవడానికి కావలసిన ఏర్పాట్లు చేయడం
  • ట్రాక్ ఈవెంట్స్ లో గురువుల ఆదేశాల ప్రకారం ట్రాక్లు గీయడం.
  • చిట్టీలు తయారు చేయడం
  • బహుమతుల ప్రధానానికి ఏర్పాట్లు,
  • వచ్చిన వారికి నీటిని అందించడం
  • ప్రాథమిక చికిత్స కేంద్రాలలో సహాయం.

పైన పేర్కొన్న కార్యక్రమాల ద్వారా బాలవికాస్ విద్యార్థులు భవిష్యత్తులో బాలవికాస్ గురువుగా మారాలనే ఆసక్తిని పెంపొందించుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *