బుద్ధపూర్ణిమ
బుద్ధపూర్ణిమ
బుద్ధ జయంతిని బుద్ధ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. బుద్ధ పౌర్ణిమ బౌద్ధుల పవిత్ర పండుగ. వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు వస్తుంది. (ఏప్రిల్-మే నెలలలో). ఆరోజు బౌద్ధులు బుద్ధుని జీవితంలోని మూడు సంఘటనలను జ్ఞాపకం చేసు కుంటారు. అవి ఏవనగా –
- బుద్ధుని జననం-జన్మస్థలం
- బుద్ధుని మోక్ష సాధన – బుద్ధుని జ్ఞానోదయం.
- బుద్ధుని పరి నిర్వాణం.
బౌద్ధ మత స్థాపకుడైన గౌతమ బుద్ధుడు విష్ణుమూర్తి దశావతారాలలో 9వ అవతారము. బుద్ధుని పూర్వ నామము సిద్ధార్థుడు. బుద్ధుడు నేపాల్ దేశంలోని కపిలవస్తు నగరంలో జన్మించాడు.
బుద్ధుని జననం- జన్మస్థలము
శుద్ధోదన మహారాజు మాయాదేవిల కుమారుడు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు నేపాల్ లోని రూపాండి జిల్లాలోని కపిలవస్తు నగరంలోని లుంబినీ వనంలో సాలవృక్షం క్రింద జన్మించాడు. యునెస్కో వారు నేపాల్లోని బుద్ధుని జన్మస్థలాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఎంపిక చేశారు.
బుద్ధుడు అనగా ఆత్మ సాక్షాత్కారము పొందినవాడు అని అర్థం. బుద్ధున్ని “శాక్యముని” అని కూడా పిలిచెదరు.
సిద్ధార్థుడు పుట్టిన వెంటనే ఉత్తరదిశ వైపు ఏడు అడుగులు వేసి, వేలు గాలి లోనికి చూపించాడు. తను ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతుడని, తనకు ఇది చివరి జన్మ అని సూచించాడని అర్థము.
సిద్ధార్థుడు పుట్టిన వెంటనే ఉత్తరదిశ వైపు ఏడు అడుగులు వేసి, వేలు గాలి లోనికి చూపించాడు. తను ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతుడని, తనకు ఇది చివరి జన్మ అని సూచించాడని అర్థము.
బుద్ధుడు తన 80వ ఏట, తన అత్యంత ప్రియ శిష్యుడయిన ఆనందునితో తనకు త్వరలో ఈ లోకాన్ని వదిలే సమయం ఆసన్నమైనదని తెలియజేశాడు.కుసి నగరంలో పౌర్ణమిరోజు రాత్రి, బుద్ధుడు చెడిపోయిన ఆహారాన్ని స్వీకరించి, అస్వస్థతకు గురి అయ్యారు. ఆ తర్వాత సాలవృక్ష తోటలో ధ్యానం చేస్తూ తన భౌతిక శరీరాన్ని వదిలారు.
బుద్ధుని చివరి మాటలు-“ఈ లోకంలో సృష్టించబడ్డ వస్తువులన్నీ అశాశ్వతములు అన్న ఎరుకతో ముందుకు సాగండి”.