- Sri Sathya Sai Balvikas - https://sssbalvikas.in/te/ -

శ్రీ సత్య సాయి అష్టోత్రం[1-27]

Print Friendly, PDF & Email [1]
[vc_row css=”.vc_custom_1623406677897{margin-top: 0px !important;border-top-width: 0px !important;padding-top: 0px !important;}”][vc_column][vc_custom_heading text=”వివరణ” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text el_class=”video-sty”][/vc_column_text][vc_custom_heading text=”ఆడియో” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text el_class=”title-para postaudio”] http://sssbalvikas.in/wp-content/uploads/2021/04/Ashtothram1-27.mp3 [2] [/vc_column_text][vc_custom_heading text=”LYRICS” font_container=”tag:h5|text_align:left|color:%23d97d3e” use_theme_fonts=”yes” el_class=”te-sree-krushnadevaraya”][vc_column_text el_class=”te-sree-krushnadevaraya content-box”]
  1. ఓం శ్రీ భగవాన్ సత్య సాయి బాబాయ నమః

    మనందరికీ దివ్యమాత, పిత అయిన బాబాకు నమస్కరిస్తున్నాము

    ఓం : ఆది శబ్దము సర్వత్రా వ్యాపించినటువంటిది (యోగములో మానవుని వెన్నెముక కేంద్రభాగము). ఆ పరబ్రహ్మ యొక్క ముఖ్యమైన సంకేతము ఓంకారము. అట్లే బాబాకు గూడా అదే సంకేతము.

    శ్రీ : అన్ని రకములైన ఐశ్వర్యము.

    నమః : చేతులు జోడించి శిరస్సువంచుట, 10 వ్రేళ్ళు కలిపినప్పుడు కర్మేంద్రియ, జ్ఞానేంద్రియములు భగవంతుడికి అర్పించుట. నమః కు బాబా చెప్నినది, ఇంద్రియములు మనసుతో కలిపి భగవంతుని కర్పించుట. నామమ = నాది కాదు, మీది అనెడి శరణాగతిని తెల్పు క్రియ నమస్కారము.

  2. ఓం శ్రీ సాయి సత్య స్వరూపాయ నమః

    సత్యమే స్వరూపముగా కలవాడు.

  3. ఓం శ్రీ సాయి సత్యధర్మ పరాయణాయ నమః

    సత్య, ధర్మములు నెలకొల్పుట యందు అచంచల దీక్ష కలవాడు.

  4. ఓం శ్రీ సాయి వరదాయ నమః

    వరములను యిచ్చువాడు, వరప్రదాత.

  5. ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః

    నిత్యుడై వెలుగొందు సత్ పురుషుడు.

  6. ఓం శ్రీ సాయి సత్య గుణాత్మనే నమః

    సద్గుణములు, సత్సీలము కలిగియుండువాడు.

  7. ఓం శ్రీ సాయి సాధు వర్ధనాయ నమః

    సద్గుణములను పెంపొందించు వాడు.

  8. ఓం శ్రీ సాయి సాధు జన పోషణాయ నమః

    సజ్జనులను సంరక్షించువాడు.

  9. ఓం శ్రీ సాయి సర్వజ్ఞాయ నమః

    అన్నిటినీ తెలిసినవాడు.

  10. ఓం శ్రీ సాయి సర్వజన ప్రియాయ నమః

    సర్వులకు (అందరికీ) ప్రియమైనవాడు.

  11. ఓం శ్రీ సాయి సర్వశక్తి మూర్తయే నమః

    సర్వ శక్తులకు నిలయమైనటువంటివాడు.

  12. ఓం శ్రీ సాయి సర్వేశాయ నమః

    అందరికీ ప్రభువయినటు వంటివాడు.

  13. ఓం శ్రీ సాయి సర్వసంగ పరిత్యాగినే నమః

    అన్ని బంధములు వదిలినవాడు (విరాగి).

  14. ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః

    సర్వజీవుల హృదయములందు ఉండువాడు.

  15. ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమః

    మహిమలు గలవాడు (దివ్యాత్మ).

  16. ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమః

    శివ స్వరూపుడు.

  17. ఓం శ్రీ సాయి పర్తిగ్రామోద్భవాయ నమః

    పర్తి అను గ్రామమున జన్మించినవాడు.

  18. ఓం శ్రీ సాయి పర్తి క్షేత్ర నివాసినే నమః

    పర్తి క్షేత్రములో నివసించువాడు.

  19. ఓం శ్రీ సాయి యశకాయ షిర్డీ వాసినే నమః

    పూర్వశరీరములో షిర్డీ నివాసిగా కీర్తి పొందినాడు.

  20. ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమః

    ఒక భక్తుని బిడ్డను రక్షించి లీలలో ఈ పేరు ధరించెను.

  21. ఓం శ్రీ సాయి భారద్వాజ ఋషి గోత్ర్రాయ నమః

    భారద్వాజ ఋషి గోత్రము నందు జన్మించినవాడు.

  22. ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః

    భక్తుల యందు వాత్సల్యము, ప్రేమ కలిగినవాడు.

  23. ఓం శ్రీ సాయి అపాంత రాత్మనే నమః

    సంసార సముద్రము దాటి మనల దాటించువాడు, అందరి యందు వుండును.

  24. ఓం శ్రీ సాయి అవతార మూర్తయే నమః

    అవతారములకు మూర్తియైనవాడు.

  25. ఓం శ్రీ సాయి సర్వభయ నివారిణే నమః

    అన్నివిధములైన భయములను తొలగించువాడు.

  26. ఓం శ్రీ సాయి ఆపస్తంబ సూత్రాయ నమః

    ఆపస్తంబ సూత్రకారుని సంప్రదాయములో జన్మించినవాడు.

  27. ఓం శ్రీ సాయి అభయ ప్రదాయ నమః

    శరణు కోరిన వారికి అభయమిచ్చువాడు, రక్షించువాడు.

[/vc_column_text][vc_separator style=”shadow” border_width=”5″][/vc_column][/vc_row]