భూమి (1)
ప్రియమైన పిల్లలూ,
ప్రకృతి అనేది, భగవంతునికి వస్త్రం లాంటిది. మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే,స్థానం ఇచ్చింది భూమి. మనల్ని భరిస్తుంది భూమి.
భూమి (1)
ప్రియమైన పిల్లలూ,
ప్రకృతి అనేది, భగవంతునికి వస్త్రం లాంటిది. మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే,స్థానం ఇచ్చింది భూమి. మనల్ని భరిస్తుంది భూమి.
ఇప్పుడు మనం దృశ్యమానంతో భూమిని చూద్దాం. కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం పంచభూతాలు. ఇవి దేవుడు ఇచ్చిన వరాలు. అవి పవిత్రమైనవి అని వేదాలు పేర్కొన్నాయి. భూమి మనకు నివసించడానికి ఇల్లు, గాలి ప్రాణవాయువును, ఆహారాన్ని తయారుచేసి ఆకలిని తీర్చుకునేందుకు అగ్ని, దాహాన్ని తీర్చుకునేందుకు నీరు మరియు అన్ని ఉంచడానికి ఖాళీ (స్థలం) ఆకాశం బహుమతిగా ఇచ్చాయి. ఒకటి లేకుండా మరొకటి లేదు. మనిషి తన చెడు వ్యతిరేక ఆలోచనలతో,భూమిని వశం చేసుకుంటున్నాడు. నీటిని కలుషితం చేస్తున్నాడు. అంతరిక్షాన్ని పాడు చేస్తున్నాడు. అందుకే మనం చూస్తున్నాం, తగ్గుతున్న మంచు పర్వతాలు, మారుతున్న వాతావరణం, తరిగిపోతున్న నదులు మొదలైనవి.
భూమాతను ఎలా కాపాడుకోవాలి? మంచిగా బాగు చేయటం,పరిసరాలు శుభ్రంగా ఉంచడం. నీరు మరియు ఎనర్జీ ( శక్తిని) ఆదా చేయటం, మరిన్ని మొక్కల్ని పెంచడం ద్వారా భూమిని కాపాడుకోవాలి. వేదమంత్రాలు పఠించడం, భజనలు పాడటం,మంచి ఆలోచనలతో ఉండటం,మంచిని వ్యాప్తి చేయటం చెయ్యాలి. ప్రేమతో,భక్తితో అందరినీ చూసేందుకు దేవుడు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నాడు.
విశ్రాంతితో మనం తిరిగి ఇక్కడికి వద్దాం. ప్రేమ నిండిన ముఖంతో చిరునవ్వుతో కళ్ళు తెరవండి.
భూమి, పర్వతాలు, చెట్లు వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు సహనం భూమి ధర్మాన్ని బోధిస్తుంది. భూమ్మీదే నడుస్తాం పనిచేస్తాం.అయినా ఓపికతో అన్నిటిని తట్టుకొని,భూమి సహనంగా ఉంటుంది. పర్వతాలు చెట్లు స్థిరంగా ఉంటాయి. పక్షులు, జంతువులు,మనుషులకు అవి సహాయం చేస్తాయి. అలాగే మనం సహనము ఓర్పు తో ఉండాలి. క్షమించడం నేర్చుకోవాలి.
తరగతిలో చర్చ:
భూమి, పర్వతాలు, చెట్లు వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు
సహనం భూమి ధర్మాన్ని బోధిస్తుంది. భూమ్మీదే నడుస్తాం పనిచేస్తాం.అయినా ఓపికతో అన్నిటిని తట్టుకొని,భూమి సహనంగా ఉంటుంది. పర్వతాలు చెట్లు స్థిరంగా ఉంటాయి. పక్షులు, జంతువులు,మనుషులకు అవి సహాయం చేస్తాయి. అలాగే మనం సహనము ఓర్పు తో ఉండాలి. క్షమించడం నేర్చుకోవాలి.
[English Ref: Silence to Sai-lens – A Handbook for Children, Parents and Teachers by Chithra Narayan & Gayeetree Ramchurn Samboo MSK – A Institute of Sathya Sai Education – Mauritius Publications]