ఓం సర్వేవై సుఖినః సంతు శ్లోకము – కృత్యము
కృత్యము: ఆనందమయ (స్థలం) ప్రదేశాలలోకి (గెంతే) దుమికే ఆట
నిక్షిప్తమయిన విలువ:
ఎల్లప్పుడూ ఆనందంగా ఉండుట.
కావలసిన వస్తువులు:
సుద్దముక్క, సంగీతం లేదా పాట వినిపించుటకు తగిన పరికరం. ఇందుకు బదులుగా గురువులు తామే భజన పాట పాడవచ్చు.
చేయవలసిన పని:
గురువు నేలపై కొన్ని వృత్తములు గీచి ఒకటి మార్చి ఒకటి వచ్చేలాగా నవ్వు ముఖము, విషాద ముఖములను చిత్రించాలి.
విధానం:
ఈ ఆట ఖాళీ స్థలంలో చక్కగా ఆడించవచ్చు. ఉన్న స్థలంలో పిల్లల సంఖ్యను అనుసరించి వృత్తాలు గీసుకోవాలి. ఒక భాగంలోని వృత్తంలో ఒక పిల్లవాడు నిలబడాలి. సంగీతం ప్రారంభించగానే పిల్లలు తమ తరువాతి వృత్తంలోకి గడియారపు దిశలో గెంతుతూ వెళ్ళాలి.
సంగీతం ఆగిపోగానే పిల్లవాడు తను ఉన్న చోటనే శిలలా నిలబడి పోవాలి. ఎవరి వృత్తంలో అయితే విషాద ముఖం ఉందో వారు ఆట నుండి వెళ్ళిపోవాలి. ఇలా ఒక్కరు విజేతగా మిగిలే వరకూ కొనసాగించాలి.
నియమాలు: 1) రెండు కాళ్ళతో గెంతాలి. 2) నడవకూడదు. 3) గెంతటం మధ్యలో ఆపకూడదు. 4) ఒకే చోట రెండు సార్లు గెంతరాదు. 5) ఒకేసారి రెండు వృత్తాలు గెంతరాదు. 6) వృత్తము నుండి బయటకు వెళ్ళరాదు (గీత దాటరాదు).
గురువు పిల్లలకు ఎల్లవేళలా ఆనందంగా ఉండవలసిన అవసరం లేదా ప్రాముఖ్యతను తెలియజేయాలి.