దశరథుని మరణం
ఇంతలో సుమంత్రుడు అయోధ్య చేరుకుని “ప్రజలు, మంత్రులు చక్రవర్తిని సంతోషపరచాలని, భరతుడు నిజాయితీతో ప్రజా సంక్షేమాన్ని నిర్వహించాలని, తల్లిదండ్రుల్ని సేవించాలని” రాముని సందేశాన్ని తెలియజేశాడు. దశరథుని దు:ఖం మరింత తీవ్రమయింది. దశరథుడు రామనామాన్ని స్మరిస్తూ తుదిశ్వాస విడిచాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
ఏ విధంగా దశరథుడు తన కుమారుడిని గాఢంగా ప్రేమించాడో, తనకు ప్రియమైన రాముడు, పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపే ఆలోచన భరించలేక ఎలా తుదిశ్వాస విడిచాడో చెప్పాలి. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ స్వార్ధరహితమైనది. షరతులు లేనిది. ఇంకేదీ వారికి ముఖ్యం కాదు. తమ పిల్లల సంక్షేమం కంటే మరేదీ వారికి ముఖ్యం కాదు. వారి జీవితాలు కూడా వారికి ముఖ్యం కాదు.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: తల్లిదండ్రుల ప్రేమను గౌరవించండి. వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండండి.
భరత శత్రుఘ్నులు తమ తాతగారింటి నుండి తిరిగి వచ్చేరు. గుండెలు పగిలే వార్త విన్నారు. రాముని వనవాసం, తనని రాజుని చెయ్యడం అన్న ప్రణాళిక తన తల్లి కోరిక అని తెలిసి అవమానంతో భరతుని తల వాలిపోయింది.
“తన తండ్రికి అంత్యక్రియలు చెయ్యాలి” అని భరతునికి వశిష్టుడు చెప్పాడు. అతడు రాముడిని తిరిగి అయోధ్యకు తీసుకురావాలనుకున్నాడు. వశిష్టుడు, ఇంకా ఇతరులు చాలా మంది అతడిని అనుసరించేరు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
మందర విషపథకానికి ఎర అయిపోయిన కైకేయి తన జీవితాన్ని నాశనం చేసుకుంది. ఆమె భర్తను కోల్పోయింది. భయంకరమైన ప్రవర్తనకి తన కన్న కొడుకు చేత తీవ్రంగా శిక్షింపబడింది. తన చుట్టూ ఉన్న వారందరి ప్రేమను, గౌరవాన్ని కోల్పోయింది.