రాముడు విశ్వామిత్రుననుసరించుట
ఒకరోజు పూజనీయుడైన విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వచ్చేడు. తన యజ్ఞానికి విఘాతం కలిగిస్తున్న రాక్షసులను సంహరించడానికి, తనతో రామలక్ష్మణుల్ని పంపమని దశరథుని కోరేడు. దశరథుడు సందేహిస్తున్నప్పుడు, రాముడు “తన శరీరము మహర్షుల్ని, పవిత్రులైన మానవుల్ని రక్షించడానికీ, ఇతరులకి మంచి చేయడానికే ఉంది” అన్నాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
రాముని వలే ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడూ తప్పక ఇష్టపడి ఉండాలి.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: ‘పరోపకారమిదం శరీరం’ – ఈ శరీరము ఇతరులకు ఉపకారము కొరకే.
తన పని పూర్తికాగానే తాను రామలక్ష్మణులను అయోధ్యకు తిరిగి తీసుకుని వస్తానని విశ్వామిత్రుడు రాజుకు హామీ ఇచ్చేడు. ధశరధుని నుండి అనుమతి తీసుకుని, రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్ళిపోయారు.
గురువులు బాలలకు బోధించవలసినవి:
మనం బయటకు వెళ్ళే ముందు రాముని వలె తల్లిదండ్రుల అనుమతి తప్పక తీసుకోవాలి.
గ్రహించవలసిన విలువలు: తల్లిదండ్రులపట్ల విధేయత, గౌరవము.
శీఘ్రంగా వారు సరయూ నది చేరుకున్నారు. ఆపద, వ్యాధి నుండి రక్షణ పొందడానికి వారికి విశ్వామిత్రుడు బల-అతిబల అనే రెండు మంత్రాలనుపదేశించాడు. శీఘ్రంగా యక్షిణి తన కుమారుడు మారీచునితో నివసిస్తున్న అడవికి చేరుకున్నారు. వినాశనం చేసే ఆమె చేతుల నుండి ఎంతో మందిని రక్షించడానికి ఈ భూతాన్ని వధించడం నేరం కాదని విశ్వామిత్రుడు రాముడికి చెప్పేడు. అందుచేత ఆ రాక్షసితో యుద్దానికి తలపడడానికి రాముడు సందేహించలేదు. చివరికి రాముడు సంధించిన బాణం ఆమె వక్షస్థలాల్ని చీల్చివేసింది. విశ్వామిత్రుడు తన అస్త్రాలన్నిటినీ రాముడికి ఇచ్చి, ఆ అస్త్రాలన్నీ అతని ఆజ్ఞని పాటిస్తాయని చెప్పేడు.
రామలక్ష్మణులు అయిదురోజులపాటు కాపలా కొనసాగించేరు. ఆరవ రోజు మారీచ, సుబాహులు రాక్షసులతో వచ్చి యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించేరు. వారు రామలక్ష్మణులకి సమానులు కారు. రాముడు మానసాస్త్రాన్ని ప్రయోగించేడు. అది మారీచుణ్ణి మైళ్ళ దూరానికి విసిరివేసింది. అగ్నేయాస్త్రం సుబాహుని వెంటనే సంహరించింది. విశ్వామిత్రుడు నిరాటంకంగా యజ్ఞాన్ని పూర్తి చేయగలిగాడు. మహర్షి మహదానందంతో రాజకుమారుల్ని ఆశీర్వదించాడు.
గురువులు బాలలకు బోధించవలసినవి: రాముని వలే మనం మన గురువులు, పెద్దల మాట తప్పక వినాలి. వారి మాటను అనుసరించాలి. మనం మన గురువుల మాట పాటిస్తే, వారు ఉదారంగా ఆశీస్సులందిస్తారు.
గ్రహించి అలవరుచుకోవలసిన విలువలు: గురువులు, పెద్దలపట్ల విధేయత, గౌరవము.
ఒక యువ శిష్యుడు వ్రాత వ్రాసి ఉన్న తాళపత్రాలను తెచ్చేడు. దానిలో మిధిలకు రాజైన జనకుడు యజ్ఞం చేయాలనుకుంటున్నాడనీ, విశ్వామిత్రుడు తన శిష్యుల సహా దానికి హాజరు కావలని కోరుకుంటున్నాడనీ ఉంది. అందరూ ఆ ఆహ్వానాన్ని స్వాగతించారు. కాని రాముడు అయోధ్యకు తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు. తాను వారి తండ్రి గారికి రాజకుమారులిద్దరితోనూ స్వయంగా అయోధ్యకు తిరిగి వస్తానని వాగ్దానం చేశానని విశ్వామిత్రుడు వివరించాడు. రాముడు అంగీకరించడం చేత విశ్వామిత్రుడు రామలక్ష్మణులిద్దరితోనూ మిథిలానగరం దిశగా బయలుదేరాడు. పరమశివుని వద్ద నుండి జనకుడు ఒక ధనస్సును పుచ్చుకున్నాడనీ, దానిని అతడు నిత్యం పూజిస్తాడనీ, ఇంత వరకూ ఆ వింటినారిని ఎవరూ ఎక్కించలేకపోయారనీ విశ్వామిత్రుని నుండి రాముడు తెలుసుకున్నాడు. విశ్వామిత్రుడు ఇద్దరు రాజకుమారులతోనూ మిథిలకు చేరుకోగానే వారికి ఘనమైన స్వాగతం ఇవ్వబడింది. ఇద్దరు రాజకుమారులను చూడగానే జనకుడు చాలా సంతోషించేడు. వారు స్వర్గం నుంచి దిగివచ్చిన దేవతల్లా కనిపించేరు. యజ్ఞశాల వద్దకు శివధనస్సు తీసుకురావటానికి ఏర్పాట్లు జరిగేయి.