సువాసన – గులాబీ పువ్వు
ప్రియమైన పిల్లలూ!
నిటారుగా కూర్చుని గట్టిగా శ్వాస తీసుకుని వదలండి. మెల్లగా కళ్ళు మూసుకోండి. రోజా పువ్వు మీద దృష్టి పెట్టండి. అది పిల్లలను ఎంతగానో ఇష్టపడే జవహర్లాల్ నెహ్రూకి చాలా ఇష్టమైన పువ్వు. గులాబీ చాలా అందంగా మంచి సువాసనతో ఉంటుంది. కానీ దానికి ముళ్ళు కూడా ఉంటాయి. మీరు గులాబీ వలే సువాసనను స్వచ్ఛమైన ప్రేమను కలిగి ఉన్నారు. గులాబీ కి గల ముళ్ల వలే మీరు కూడా తల్లితండ్రులు చెప్పే మాటలు వినకుండా చెడు మార్గాల లో కి వెళ్తారు.అట్లు అవిధేయత తో ప్రవర్తించుట మంచిది కాదు.