గోల్డుస్మిత్ దయా హృదయము
ఆంగ్ల సాహిత్యం చదివినవారికి ఆలివర్ గోల్డ్ స్మిత్ పేరు బాగా తెలిసిందే. ఆయన ప్రసిద్ధి చెందిన వ్యాసకర్త, నాటక రచయిత. ఆయన ఎంతో దయా హృదయడు. గోల్డ్ ఎవరికయినా ఏ విధంగానైనా సహాయం చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే.
గోల్డ్ స్మిత్ కొన్నాళ్ళు వైద్యం చదివాడు. కాని ఎన్నడూ ఆ వృత్తి చేయలేదు. ఒకనాడు ఒక బీద స్త్రీ ఆయన ఇంటికి వచ్చింది. ఆమె గోల్డ్ స్మిత్ ఎంతో దయగల వాడనీ సహాయం చేస్తాడనీ విని వచ్చింది.
“అయ్యా! నా భర్త చాలా జబ్బుతో ఉన్నారు. వైద్యుణ్ణి పిలిపించుకునే శక్తి మాకు లేదు. మీరు ఒకసారి వచ్చి మా వారిని చూస్తారా?” అని ప్రాధేయ పడింది.
గోల్డ్ స్మిత్ ఆమె ఇంటికి వెళ్ళి అక్కడి పరిస్థితి చూచాడు. ఆమె భర్త ఎంతో బలహీనంగా ఉన్నాడు. వాళ్ళింట్లో ఈ నాలుగయిదు దినాలుగా పొయ్యిలో పిల్లి లేచిన సూచనలు ఏవీ కనుపించలేదు. రోగి కప్పుకోడానికి కనీసం ఒక దుప్పటిలాంటిది కూడా లేదు. గోల్డ్‌స్మిత్ కి పరిస్థితి అర్థమయ్యింది. కొంత సేపు అక్కడ గడిపి “అమ్మా ఇంటికి వెళ్ళి కొన్ని మాత్రలు పంపిస్తాను” అని వెళ్ళాడు.
ఇంటికి తిరిగి వెళ్ళి పది గినీ (ఇంగ్లీషు నాణాలు) లను ఒక చిన్న డబ్బాలో ఉంచి పైన చీటీ అతికించి పంపాడు. ఆ చీటీలో డబ్బాలో ఉండేవి రోజూ ఒకటి పాలు రొట్టె కొనడానికి వాడండి అని రాసి ఉన్నది.
వారం రోజుల తర్వాత ఆ రోగి గోల్డ్ స్మిత్ ఇంటికి వచ్చి కృతజ్ఞత తెల్పుకొని వెళ్ళాడు
ప్రశ్నలు:
- గోల్డుస్మిత్ ఎవరు?
- రోగి ఏం జబ్బు తో బాధ పడు తున్నట్టు గుర్తించాడు?
- దానికి అతడు చేసిన చికిత్స ఏది?
- ఈ కధ లోని నీతి ఏమి?