పీటర్
హాలండి (నెదర్లాండ్) యూరపు ఖండంలో సముద్ర మట్టానికి తక్కువగా ఉండే దేశము. సముద్రం నుండి రక్షణకు డైక్సు అని పిలవబడే పెద్ద కట్టలు ఉంటాయి.
ఆ పటి బాలుడు గాలులు దానిలో ఇంకా పెద్దదైంది.
చాలా కాలం క్రిందట ఈ డైక్సు ఇప్పుడున్నంత పటిష్ఠంగా ఉండేవికాదు. కట్టలలో ఒక చిన్న రంధ్రం ఏర్పడినా, వెంటనే దానిని పూడ్చక పోతే పెద్దదై సముద్రపు నీరు దానిలోకి వచ్చి, కొన్ని ప్రాంతాలను ముంచివేస్తూ ఉండేది. అందుకని ఆ కట్టలను ఏమరకుండా రాత్రింబవళ్ళు కావలి కాచేవారు.
ఒక సాయంత్రం పీటర్ అనే గొర్రెలు కాచుకునే బాలుడు, ఒక కట్టలో రంధ్రం ఏర్పడడం గమనించాడు. అంతకుముందే కావలివాడు ఇంటికి వెళ్ళాడు. ఏ రాత్రికోగానిరాడు. రంధ్రాన్ని ఆ విధంగా వదిలితే ఏమవుతుందో పీటరు గ్రహించాడు. సహాయం కోసం పెద్దగా అరిచాడు. కాని ఎవ్వరు రాలేదు. తన వ్రేలితో ఆ రంధ్రం పూడ్చాడు. కాని నీటి తాకిడి ఎక్కువై రంధ్రం పెద్దది కాసాగింది. చలి గాలులు వీస్తూ సముద్రపు నీరు తాకితే గడ్డకట్టేంత చల్లగా ఉంది. రంధ్రం చాలా పెద్దదయింది. పీటరు భయపడి తన చేయి దానిలో దూర్చి పూడ్చడానికి ప్రయత్నించాడు. అది ఇంకా పెద్దదైంది. తన రెండవ చేతిని గూడ దూర్చాడు.
నీరు మంచుగడ్డవలె ఉండి శరీరం గడ్డకట్టుకోకపోయి ఉంటే, పీటరు తన శరీరాన్ని అంతటిని దూర్చేవాడు, కాని చలికి తట్టుకోలేక అచేతనంగా పడిపోయాడు. ఈ స్థితిలో అతన్ని కావలివాడు తిరిగివచ్చినపుడు చూచి లేవదీశాడు.
ప్రశ్నలు:
- పీటర్ భయపడిన దేమిటి?
- సముద్రపు నీటిని నిలపడానికి అతడు చేసిన ప్రయత్నము ఏమిటి ?
- పీటర్ కథను సంగ్రహంగా వివరింపుము.
- ఇలాంటి కధ మరియొకటి చెప్పగలవా?