నేర్చుకోవడం పట్ల ఇష్టత
దశ 1:
- సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
- మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
- మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
- కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.
దశ 2:
ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రేకాలను తగ్గించండి. మీ కాలి వేళ్ళని సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి.
మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి.
మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు తిరిగి కుడి వైపుకు చూడండి. ముందుకు చూడండి. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని పొందండి. ఉద్రేకాలు అన్నీ తొలిగిపోతాయి.
దశ 3:
ఇప్పుడు మీ శ్వాసపై ఎఱుకను కలిగి ఉండండి. మీ ఊపిరితిత్తుల నిండా దీర్ఘ శ్వాసను తీసుకోండి. తగినంత సమయం తీసుకుని మెల్లగా బయటికి వదలండి. కళ్ళను నెమ్మదిగా మూయండి.
మీరు శ్వాసను లోపలికి తీసుకుంటున్నప్పుడు స్వచ్ఛమైన గుణనివారణ శక్తి (హీలింగ్ పవర్) మీ లోపలికి ప్రవేశించినట్లుగా ఊహించుకోండి. ఆ శక్తి మీలో ఆనందాన్ని, ప్రేమను, శాంతిని నింపుతున్నట్లుగా భావించండి. శ్వాసను బయటికి వదులుతున్నప్పుడు మీకు అసౌకర్యాన్ని కలిగించే గుణాలైన విచారము, అలసట, కోపము, చిరాకు, భయము, విసుగు, అసూయ వంటివి బయటికి వెళ్తున్నట్టుగా భావించండి. మీరు సంతోషంగా ఎటువంటి చింతలు లేకుండా ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇలా మూడు నాలుగు పర్యాయములు చేసినచో, మిమ్మల్ని ఆందోళనపరచే విషయములు అన్ని ఒక్కొక్కటి దూరంగా వెళ్లిపోతాయి.
దశ 4:
ఇప్పుడు మీరు విమానంలో వెళ్తున్నట్టుగా ఊహించుకోండి. మీరు విమానంలోనికి సురక్షితంగా అడుగుపెట్టారు. విమానం మెల్లగా గాలిలోనికి ఎగురుతోంది. కిటికీలో నుండి క్రింద ఉన్న నేలను చూడండి. పొలాలను మరియు దట్టంగా ఉన్న ఆకుపచ్చని చెట్లను చూడండి. మానవులకు, జంతువులకు, మొక్కలకు నీటిని అందించే పారుతున్న నదుల వంపులను చూడండి. మంచుపర్వతాలను చూడండి. ఇప్పుడు మీరు ఇంకా పైకి ఎగురుతున్నారు. పర్వతాలపై తెల్లగా మెరుస్తున్న ఆ మంచు యొక్క అందాలను ఆస్వాదించండి. ఆ తర్వాత మీరు ఇసుక రాళ్లతో కూడిన ఎడారిపై ఎన్నో మైళ్ళు ప్రయాణం చేస్తున్నారు.
అత్యధిక వర్షపాతంతో కూడిన అరణ్యాల మీదుగా,మంచుతో కూడిన ఆర్కిటిక్ మీదుగా ప్రయాణిస్తూ మీరు ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.
దశ 5:
ఇప్పుడు మీ దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి.వ్యాయామం పూర్తయినది కనుక, మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి
[BISSE Ltd శ్రీ సత్య సాయి మానవతా విలువల బోధిని ఆధారంగా.]