సత్సంబంధాలు
దశ 1 :
ఉపాధ్యాయుడు వ్యాయామాన్ని నెమ్మదిగా సూచిస్తాడు.ఆ సూచనలను అనుసరించండి. ఫుల్ స్టాప్ ల వద్ద నిలుపుతాడు.. అవసరమైతే నేపథ్యంలో మధువైన సంగీతాన్ని వినిపిస్తాడు.
- సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
- మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
- మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
- కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.
దశ 2 :
ఇప్పుడు ఐదు ఇంద్రియాల గురించి తెలుసుకోండి… గదిలోని గాలి యొక్క వాసన… మీ నోటిలోని నీటి రుచి… మీ పాదాల క్రింద నేల యొక్క దృఢత్వం. చర్మంపై గాలి యొక్క స్పర్శ. ఇప్పుడు గదిలోని శబ్దాలు వినండి. (ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు ). తర్వాత గది వెలుపల ఉన్న శబ్దాలను వినండి. ఈ వినికిడిని మీకు వీలైనంత వరకు విస్తరించండి.
దశ 3 :
సంగీతాన్ని వినండి… పాఠశాలలో మీ మొదటి రోజును గుర్తుతెచ్చుకొని, ఆరోజు మీరు ఎలాంటి అనుభూతిని పొందారో గుర్తుతెచ్చుకోండి.మీకు ఏ విషయము మంచిగా అనిపించిందో, దానిని గురించి ఆలోచించండి.మీ ఉచ్వాస ద్వారా ప్రేమ మరియు భద్రత అనే భావాలను లోపలికి తీసుకోండి. మీకు అసౌకర్యంగా అనిపించే వాటిని మీ నిశ్వాస ద్వారా బయటకు పంపండి.
దశ 4 :
ఇప్పుడు దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి.
కూర్చుని చేసే ఈ వ్యాయామం యొక్క అనుభవాలను విద్యార్థులు పక్కవారితో పంచుకోవాలని అనుకోవచ్చు కనుక వారిని ప్రోత్సహించండి.ఈ వ్యాయామం వలన వారు ఎటువంటి అనుభూతిని పొందారో అడగండి. ఆ అనుభూతిని చిత్రంగా గీయమని ప్రోత్సహించడం వల్ల పిల్లలలో సృజనాత్మకత పెంపొందుతుంది.
[BISSE Ltd శ్రీ సత్యసాయి మానవతా విలువల బోధని ఆధారంగా.]