ప్రకృతి పట్ల ప్రేమ
దశ 1:
- సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీలో కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
- మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
- మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
- కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.
దశ 2:
ఇప్పుడు ఐదు ఇంద్రియాల గురించి తెలుసుకోండి… గదిలోని గాలి యొక్క వాసన… మీ నోటిలోని నీటి రుచి… మీ పాదాల క్రింద నేల యొక్క దృఢత్వం. చర్మంపై గాలి యొక్క స్పర్శ. గదిలో శబ్దాలు వినండి. (ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు). తర్వాత గది వెలుపల ఉన్న శబ్దాలను వినండి. ఈ వినికిడిని మీకు వీలైనంత వరకు విస్తరించండి.
దశ 3:
మీరు భూమి లోపల ఒక చిన్న విత్తనంగా ఉన్నట్లు ఊహించుకోండి. అక్కడ చీకటిగా ఉంది మరియు నీటిని కొరకై మీరు మీ వేర్లను లోపలికి పంపుతారు. ఆ తర్వాత మీరు పైకి ఎదగటం ప్రారంభిస్తారు. మీరు దేని కోసం వెతుకుతున్నారో మీకు తెలియనప్పటికీ, మీరు మాత్రం పైకి రావటం ప్రారంభిస్తారు. అకస్మాత్తుగా, మీరు భూమిని చీల్చుకుని కాంతిలోనికి చొచ్చుకుని వచ్చారు. ఇది చాలా అద్భుతంగా వుంది.సూర్యుని నుండి ప్రసరించే సూర్యరశ్మి వలన మీరు బాగా పొడవుగా ఎదుగి, ఆరోగ్యంగా, దృఢంగా అవుతారు.
వర్షం పడి భూమిలోకి నీరు ఇంకుతున్నప్పుడు మంచి అనుభూతిని పొందుతారు. మరియు మీరు చల్లనైన, స్వచ్ఛమైన నీటిని త్రాగారు…. చాలా ఎత్తుగా పెరిగిన తర్వాత నిజంగా మీరెవరో తెలుసుకుంటారు. మీరు ఒక పువ్వు కానీ, చెట్టు కానీ, కూరగాయ లేదా పొద కానీ కావచ్చు…
మీ మనస్సులో మిమ్మల్నిమీరు ఎలా భావించుకుంటున్నారో చిత్రించుకోండి మరియు మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. మీరు సూర్యుడు మరియు వర్షం సహాయంతో భూమి నుండి పైకి వచ్చిన అందమైనవారు.
దశ 4:
ఇప్పుడు మీ దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి.
కూర్చుని చేసే ఈ వ్యాయామం యొక్క అనుభవాలను విద్యార్థులు పక్కవారితో పంచుకోవాలని కూడా అనుకోవచ్చు కనుక వారిని ప్రోత్సహించండి.ఈ వ్యాయామం వలన వారు ఎటువంటి అనుభూతిని పొందారో అడగండి. ఆ అనుభూతిని చిత్రంగా గీయమని ప్రోత్సహించడం వల్ల పిల్లలలో సృజనాత్మకత పెంపొందుతుంది.
[శ్రీ సత్యసాయి మానవతా విలువల బోధిని ఆధారంగా.]