త్రిగుణాలు
లక్ష్యం:
పిల్లలు సత్వ,తమో,రజో గుణాలలోని సత్వగుణాన్ని అభ్యసించే ఆహ్లాదకరమైన ఆట ఇది.
ఈ ఆటలోని విలువలు:
- ఏకాగ్రత
- వివక్ష
- ఐక్యత-బంధం
కావలసిన వస్తువులు:
మూడు రకాల పప్పులు కాబూలీ శనగలు, సత్వ మినుములు,తమో, రాజ్ మా/కిడ్నీ బీన్స్ రజో
పప్పులను ఉంచడానికి 3 గిన్నెలు/ప్లేట్లు
గురువు ముందుగా తయారుచేయవలసిన పని:
ఏదీ లేదు.
ఎలా ఆడాలి?
- గురువు పిల్లలను చిన్నచిన్న గ్రూపులుగా విభజిస్తారు.
- ప్రతి గ్రూప్ కు మూడు పప్పుల మిశ్రమం ఇవ్వబడుతుంది.
- గ్రూపులోని పిల్లలు మూడు త్రిగుణాలను సూచించే మూడు పప్పులను వీలైనంత త్వరగా వేరు చేయాలి.
- ముందుగా ఏ గ్రూపు వారు వేరు చేయగలరో ఆ గ్రూపుని విజేతగా ప్రకటిస్తారు.
గురువులకు చిట్కాలు:
- ఇది ఆడించిన తర్వాత తరగతిలో చర్చించే విషయం పిల్లలపై చక్కని ప్రభావం చూపుతుంది. అవి
- రావణుడు, విభీషణుడు, కుంభకర్ణులు ముగ్గురూ మూడు గుణాలకు ఉదాహరణలు. వరుసగా రజో, సత్వ, తమో.
- సత్యం,భక్తి మొదలైన
- సాత్విక లక్షణాలను అలవర్చుకోవాల్సిన అవసరం,
- అలాగే ప్రతి బృందం తమకు ఇచ్చిన పనిని ఎలా విభజించుకోవాలో, అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మొదలైనవి.