అనుద్వేగకరం – వివరణ
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్।
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే।।
ఇతరుల మనస్సు కు బాధ కలిగించనిది, సత్యమైనది, ప్రియమైనది, మేలు కలిగించునది అయిన వాక్యము పలుకుట, వేదములను, శాస్త్రములను అభ్యసించుట వలె వాచిక తపస్సు అని చెప్పబడుతున్నది.
ఉద్రేకము కలిగించని, సత్యమైన, ప్రియమైన, హితమైన వాక్కు వేద, శాస్త్ర అధ్యయనం, వాక్ తపస్సు అంటారు. మన భగవానుడు అంటారు “we cann’t always oblige, but can talk obligingly”. ఉదాహరణ కు ఒక గ్రుడ్డివాడు ఉన్నాడు. ఇది సత్యము. కానీ ‘ఓ గ్రుడ్డివాడా’ అని పిలిస్తే అతని హృదయం గాయపడుతుంది. ఆ సంబోధన సత్యమైనది అయినప్పటికీ, ప్రియమైనది కాదు. శ్రీకృష్ణుడు చెప్పాడు, సత్యము, ప్రియము, హితము- వాచక తపస్సు చాలా ముఖ్యము అని. నిశ్శబ్దములో భగవంతుని వాణి వినిపిస్తుందని.
బాబా చెబుతారు ‘నాలుకను భగవాన్నామమనే తాడుతో కట్టివేయాలి’ అని. అంబరీషుడు దీనికి చక్కని ఉదాహరణ. అతను ఎప్పుడూ మధురముగా మాట్లాడుతూ, ఎవరినీ నొప్పించక ఉండుట చేత, భగవంతుడు అతనిని తన భక్తునిగా స్వీకరించి, అతని కొరకై ఎల్లప్పుడు సిద్ధముగా ఉండెను.
అంబరీషుడు ఏకాదశి వ్రతమును ఆచరించేవాడు. ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణ అతిధికి ఆతిథ్యము ఇచ్చి, తాను భుజించే వాడు. ఒక ద్వాదశి నాడు అతని భాగ్యము చేత దుర్వాస మహామునిని అతిథిగా ఆహ్వానించి, తనతో భోజనమును స్వీకరించమని ప్రార్థించాడు. దుర్వాసుడు స్నానమునకు వెళ్లి రావటము ఆలస్యం అవటం వలన, మంచినీటిని స్వీకరించి వ్రతమును పూర్తి చేయ తలిచాడు అంబరీషుడు. ఇంతలో దుర్వాస మహాముని ప్రవేశించి, క్రోధంతో ఒక రాక్షసుడిని సృష్టించి, అంబరీషుని వధించుటకు అతని మీదకు పంపాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం ఆ రాక్షసుని సంహరించి, దుర్వాస మహాముని వెంటపడింది. దుర్వాస మహాముని పరిగెత్తుతూ సత్య లోకము, కైలాసము చివరకు వైకుంఠము చేరాడు. అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడు, “అంబరీషుడు నా భక్తుడు. అతన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది. నమ్రత, అణుకువ ఉన్నప్పుడే, జ్ఞానమునకు, తపస్సునకు గౌరవం లభిస్తుంది. అంబరీషుడు ఎంతో అణకువగా, వినయముగా వ్యవహరిస్తాడు కనుక భగవంతుడే అతని రక్షణార్థమై తరలి వచ్చాడు. దుర్వాస మహామునిని అంబరీషుని వద్దకు వెళ్లి క్షమాపణ వేడుకొనమని ఆజ్ఞాపించాడు”.
విశదీకరణ:
ఐదు జ్ఞానేంద్రియముల శక్తి సామర్థ్యములు మరియు పరిమితులను ఆధారము చేసుకొని వాటిని జాగ్రత్తగా ఉపయోగించవలెను. దైనందిక జీవితములో తారసపడే ఘనమైన శక్తులను, ఉపకరణములును నియంత్రించినట్లుగా జ్ఞానేంద్రియాలు కూడా నియంత్రించవలెను. ఉదాహరణకు అగ్ని మరియు విద్యుత్ శక్తి- సక్రమంగా వినియోగించినట్లయితే ఉపయోగకారిగా ఉంటాయి, లేనిచో అవి ప్రమాద భరితముగా రూపొందుతాయి. మన నాలుకకు కూడా రెండు రకములైనటువంటి శక్తులు ఉన్నాయి. ఒకటి మాట్లాడుట, మరొకటి రుచి చూడటం.
ఉపవాసము శారీరిక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా, మానసిక స్థాయిలో ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుంది. వాక్కును నియంత్రించుటలో సహాయపడుతుంది. ఒక్క నాలుకను వశము చేసుకున్నట్లయితే మిగతా జ్ఞానేంద్రియములన్నీ నియంత్రణలోకి వస్తాయి. కోరికలు త్యాగం చేయడం ద్వారా సమస్థితిని పొందగలము.
మానసిక తపస్సు మనస్సు యొక్క నిషేధాత్మకమైన ఆలోచనలను పెరికివేయుటకు ఒక కఠినమైన నిఘాగా పనిచేస్తుంది. వాచిక తపస్సు– వాక్కునకు అద్భుతమైన శక్తి ఆపాదించబడినది. మాటలకు, పదములకు విలువ లేకపోయినా, అవి వెలకట్టలేనివి. వాటిని జాగ్రత్తగా ఉపయోగించవలెను. ఈ నాలుకను సత్యమును పలుకుటకు, మధురముగా మాట్లాడుటకు ఉపయోగించవలెను. ఎదుటివారిని మాటలతో బాధించటం మహా పాపం. భగవంతుడు అందరిలో ఉంటాడు కనుక ఎదుటివారి దూషణ దైవదూషణతో సమానము.
స్వాధ్యాయ అభ్యసనం- వేద విజ్ఞానమునకు సస్వరూపమైన, గురు బోధనల అభ్యాసమునకు / అధ్యయనమునకు అసమానమైన సర్వోత్తమమైన ప్రాముఖ్యత ఉంది.
మాట్లాడినటువంటి మాట చిన్నదైనా, చిన్న శబ్దముగా అనిపించినా, దానికి అణుబాంబు అంత శక్తి ఉంటుంది. నిరాశ, నిస్పృహలకు లోనైనటువంటి వానితో ఆనందకరమైనటువంటి పలుకులు పలికిన, అతనికి ఏనుగుంత బలము లభిస్తుంది. బలవంతునితో, సంతోషంగా ఉన్న వానితో అధైర్యపరిచేటువంటి, నిరాశపరచేటువంటి మాటలు మాట్లాడిన బాధతో దిగజారి పోతాడు. మాట్లాడేటువంటి మాటలు వాక్కు, మనిషిని ఉచ్చ స్థితికి లేదా అధోగతికి తీసుకువెళ్తాయి. అతిగా భాషించుట వలన ఎంతో శక్తి వృధా అవుతుంది. మరియు జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, అకాల వృద్ధాప్యము ప్రాప్తిస్తుంది. రేడియో తక్కువ వాల్యూమ్ లో ఉంచినా బ్యాటరీ ఖర్చు అవుతూనే ఉంటుంది. అదే మాదిరి, పైకి గట్టిగా మాట్లాడకపోయినా, మనస్సు లోపల నిరంతరము సంభాషణ సల్లాపములు జరుగుతూనే ఉంటాయి. శక్తిని వృధా చేస్తూ ఉంటాయి. మౌనంగా కూర్చుండుట, ధ్యానము చేయుట ద్వారా శక్తిని వినియోగించుకుని, ఉన్నత స్థితికి దిశా మార్గమును నిర్దేశించుకొనవచ్చు.
వాక్కు, భావ ప్రకటనకు శక్తివంతమైన మాధ్యమము. మరియు సంభాషణ జరిపేటువంటి వ్యక్తి యొక్క ఆలోచనలను, తీసుకువెళ్లే వాహనము. వాక్కు/ మాటలో శక్తి, విశ్వసనీయత ఉండాలి అంటే, మన ఆలోచన- మాట మధ్య సమన్వయము, ఏకత్వము ఉండాలి.
వ్యక్తి మాట్లాడేటువంటి విధానము బట్టి, మాటలను బట్టి అతని యొక్క మేధో సామర్థ్యమును, సంస్కారమును అంచనా వేయవచ్చు. ఒక్కొక్కసారి మనము గమనిస్తాము, సాధారణమైనటువంటి మాట కూడా మనమీద అత్యంత ప్రభావమును చూపుతుంది. అలాగే అత్యంత శక్తివంతమైన, వివేకముతో కూడిన మాటలు/ వాక్కు ఎటువంటి ప్రభావమును చూపవు. ఎందుకంటే ఆ మాట వెనుక ఉన్నటువంటి వక్త యొక్క వ్యక్తిత్వం పై ఆధారపడి ఉంటుంది. స్వీయ నియంత్రణ ఉన్నవారైనా లేక లేనివారైనా నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించనట్లయిన, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనునట్లుగా, ద్వంద్వ వైఖరి కలవారిగా చలామణి అవుతారు.
ఉద్రేకమును, ఆందోళనను కలిగించినటువంటి వాక్కు
మనము మాట్లాడేటువంటి మాట ఎటువంటి ఇబ్బంది కలిగించరాదు. వాక్కు ఆక్షేపించేది కాకుండా, చికాకు పెట్టేది కాకుండా, సభ్యత కలిగి ఉండాలి. శ్రద్ధగా జాగరూకతతో పరిశీలించినట్లయితే మనము మాట్లాడే మాటల యొక్క ప్రభావము వినే వారి ముఖముపై ప్రతిబింబించటం గమనించవచ్చు. కఠినమైనటువంటి మాటల వలన, నియంత్రణ లేని నాలుక వలన మంచి స్నేహితులను కూడా కోల్పోతాము.
సత్యము ప్రియము మరియు హితము
సత్యమును వ్యక్తీకరించేటువంటి మాట, అందరికీ అంగీకారమైనప్పుడు ఆ వక్తకు కూడా దీవెనగా మారుతుంది. “నిజాయితీ ఉన్నతమైన విధానము/ నీతి”- ఒక అబద్ధమును కప్పిపుచ్చటానికి, పది అబద్ధములు ఆడాల్సి వస్తుంది . ఎంతో శక్తి వ్యర్ధమవుతుంది. ఒక వ్యక్తి తనలోని భావాలను సౌమ్యంగా, శాంతముగా, స్వేచ్ఛగా, నిరాటంకంగా బయటపెట్టినప్పుడు, ఆ వ్యక్తి యొక్క ఆలోచన- మాట- కర్మల యందు ఏకత్వం ప్రస్ఫుటమవుతుంది. గీతాచార్యుడు కృష్ణ భగవానుడు ఇలా ఇలా తెలుపుతున్నాడు- మాట సత్యమైనది మాత్రమే కాదు ప్రియమైనది కూడా అయి ఉండాలి. సత్యమును కఠోర రీతిలో వ్యక్తపరచవలసి వచ్చినప్పుడు, దానికన్నా మౌనము ధరించుటయే మేలు.
తర్వాత వాక్యములో…,
స్వాధ్యాయన లేదా నిరంతర అభ్యాసము- పవిత్ర గ్రంథముల పఠనము వాక్ తపస్సుగా భగవంతుడు నిర్ణయించాడు. మౌనముగా, మాట్లాడకుండా ఉండటం ద్వారా మిత భాషను ఆచరిస్తున్నాము అనుకుంటారు. మన బాబా చెబుతారు – మనస్సు నందు ఉండు ఆలోచన అలజడిని నెమ్మది చేయాలి అని. మనస్సు నందు ఆలోచనలను తగ్గించుకొనుటకు, నెమ్మది చేసుకొనుటకు కొన్ని రకములైనటువంటి సాధనలను సలుపవలెను. మొట్టమొదట సదాలోచన కలిగి ఉండి దాని ఆధారంగా సత్కర్మ ఉండాలి. నిస్వార్థ, నిష్కామ కర్మల ద్వారా మన మనస్సు పవిత్రమైనప్పుడు స్వాధ్యాయమును చేపట్టవచ్చు. అనగా మన ప్రాచీన పవిత్ర గ్రంథముల పఠనము. మహర్షులు అందించిన సత్యము, మంత్రములపై ఏకాగ్రతతో, తదేక ధ్యాసతో మనము అధ్యయనము చేయు వాటిని ప్రతిఫలింప చేసుకోవాలి. ఈ విధంగా వ్యర్థ సంభాషణల తగులుకొనక, సత్యమునే పలుకుతూ, ఆలకించువాని స్థాయికి ఎదుగుతూ, మనలోనికి కీలక శక్తి, తేజస్సును సరి అయిన దిశలో నిర్దేశించవచ్చు. అప్పుడు ఈ శక్తి సహజంగా ధ్యానము, సేవ వైపు ప్రసరించి చివరకు అందరి పట్ల ప్రేమగా మారుతుంది.
మిత భాషతో అమితమైన శాంతిని సాధించవచ్చు, శాంతిని, పవిత్రతను సాధించిన అనేకమందిని మన దైనందిక జీవితంలో చూస్తున్నాము. వారి యొక్క ప్రవర్తన, గుణము నందు శాంతిని, పవిత్రతను కాంచవచ్చు. అటువంటి వారు చాలా మృదువుగా, నెమ్మదిగా, మితముగా మాట్లాడుతారు, అదే వారిని కనుక ఏదైనా విషయముపై వివరణ కొరకు లేదా ప్రసంగము కొరకు ఆహ్వానించిన, విశ్వాసంతో, స్పష్టతతో ఆ కార్యమును సిద్ధింప చేయగలరు.
మన సాయి అవతార పురుషుడు. అయినప్పటికీ మితముగా మాట్లాడుతారు. వారి మృదు మధురమైన, లోతైన పలుకులు విను వారిపై ప్రేమ, శాంతి అను ఉత్తరీయమును పరుస్తాయి. భారతావనియందు మహనీయులు అందరూ మితముగానే సంభాషించేవారు. రమణ మహర్షి, మౌనం ద్వారా అంతర్గత సంభాషణ ద్వారా బోధించేవారు.
కథ (చిన్న కథ)
“ఒరేయ్! మూర్ఖుడా,మా సైన్యము ఇటు వైపు రావటం విన్నావా” అని ఒకతను అంధుడైన రైతుని ప్రశ్నించాడు.
కొద్ది నిమిషముల తర్వాత మరొక అతను వచ్చి ప్రశ్నించాడు, “గుడ్డి వెధవా! నోరు తెరిచి సమాధానం చెప్పు. ఇటువైపు ఎవరైనా కవాతు చేసుకుంటూ వెళ్లారా? అటువంటి శబ్దం ఏమైనా విన్నావా?”.
కొద్దిసేపు తర్వాత మూడవ కంఠము స్వరం అతనిని సమీపించి “నాయనా! ఈ దారి గుండా మా సైన్యం ఏమైనా కవాతు చేసుకుంటూ వెళ్లిందా?”, అని ప్రశ్నించింది.
చివరగా ఒక అతను వచ్చి ఈ గ్రుడ్డి వాని భుజముపై చేయి వేసి, “నాయనా! దయచేసి చెప్పు, ఎవరైనా కవాతు చేసుకుంటూ వెళ్ళటం విన్నావా”, అని అడిగాడు. గ్రుడ్డివాడు అయినప్పటికీ తనను ప్రశ్నించింది ఎవరో అర్థం చేసుకున్నాడు.
మొదట దురుసుగా మాట్లాడిన వాడు సైనికుడు. ‘ఓ గ్రుడ్డివాడా’ అని పిలిచినవాడు సైన్యాధికారి. ఎదుటివారి యొక్క భావములను పట్టించుకోరు. వారి యొక్క మాటలు ఎంత బాధిస్తాయో లెక్క చేయరు.
మూడవ వ్యక్తి మంత్రి. క్రమశిక్షణ, సత్ప్రవర్తన కలిగినవాడు. మంచి పెంపకం వలన చక్కగా సంబోధించాడు. చివరగా భుజము మీద చేయి వేసి, ప్రేమగా పలకరించిన వాడు ఆ రాజ్యానికి రాజు. వినయముతో, స్నేహ శీలంతో రాజసమును ప్రదర్శించాడు. ఎటువంటి కుటిలత్వము, డాంబికము, ఆడంబరము లేకుండా తను మాట్లాడే విధానము మీద ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఆధారపడి ఉంటుంది.
హృదయం యొక్క ఆయుధము నాలుక. ఒకని జీవితమును రక్షిస్తుంది. బిగ్గరగా మాట్లాడటం, ఎక్కువసేపు మాట్లాడటం, అనాగరికంగా మాట్లాడటం, క్రోధంతో, ద్వేషంతో మాట్లాడటం మానవుని ఆరోగ్యమునకు హాని కలుగచేస్తాయి. ఎదుటివారిలో కోపమును, ద్వేషమును పెంచుతాయి. గాయ పరుస్తాయి, ఉద్రేక పరుస్తాయి, రెచ్చగొడతాయి, మిత్రభేదం చేస్తాయి.
మౌనమును బంగారముతో ఎందుకు పోలుస్తారు?
మౌనంగా ఉండే వారికి స్నేహితులు లేకపోయినా శత్రువులు ఉండరు. ఇతనికి తనను తాను తెలుసుకోవడానికి, తనలోని తప్పులను సమీక్షించుకోవడానికి అవకాశము, సమయము ఉంటుంది. ఇతరుల నుండి నేర్చుకోవడానికి, తెలుసుకోవటానికి మొగ్గు చూపరు. నీ కాలు జారితే చీలిక ఏర్పడి, విరగవచ్చు. కానీ నాలుక జారి నట్లయితే ఎదుటివారి విశ్వాసము, ఆనందములో చీలిక ఏర్పడుతుంది. ఆ గాయము ఎన్నటికీ మహానటి మానదు. కనుక నాలుకను జాగరూకతతో ఉపయోగించవలెను.
ఎంత మృదువుగా, తక్కువగా, మితముగా, మాధుర్యము గా మాట్లాడితే అంత నీకు, లోకమునకు కూడా మంచిది.
Story – The Nature of the Fire
Suthra was an enlightened Fakir or Sadhu who was exceptionally resolute and bold. One day a friend came to him and said,’ A famous holy man has come, who is very much revered by everybody in this neighbour-hood. Let us go to see him’.
Suthra agreed and they walked to the holy man’s hut, greeting him upon their arrival by bowing low and saying: ‘Praise be to the Merciful Lord’.
The holy man returned their greeting and invited them to be seated near him. After remaining silent for a few minutes later, Suthra asked the holy man:
Have you any fire ? I need some’.
‘No I have no fire here just at present’, replied the holy man.
Again there was a silence, but a few minutes later, Suthra asked again, ‘Oh, Sadhu, have you any fire’?
‘I have already told you that I have none’ said the holy man, slightly annoyed.
But this reply did not seem to suit Suthra at all for he immediately asked for a third time.
‘Sadhu, I have great need of fire, so kindly let me have some’.
At this the holy man became really irritated and replied with great heat:
‘Oh, foolish man! Please stop asking me for fire! Can’t you understand what I say? I have told you three times that I do not have any fire. Isn’t that enough? Or will you go on repeating the same stupid question over and over again?”
Suthra remained silent and entirely imperturbed. But as soon as the holy man stopped, he said: Brother, I really do need some fire. Are you sure you do not have any fire?’
Now, thoroughly enraged, the holy man picked up a stick , advanced towards Suthra and beat him until the stick broke. Suthra then smiled and said: ‘ Peace, brother. My question is now answered. I saw and smelled some smoke, when I first entered here, so I knew that there was a fire here. Now, as everyone can see, the fire has blazed up burning with angry flames. Yet, strangely enough, still maintain that you have none of it.’
Understanding now what had all the time been in Suthra’s mind, the holy man’s anger left him. Hanging his head in shame, he said in a humble voice: ‘Thank you, brother, for your lesson. I will take it to heart and try to mend my ways’.