- గణేశ శరణం పరమ పావనం సత్య సాయినం గజాననమ్
- నిత్య స్మరణం పరమ పావనం సత్య సాయినం గజాననమ్
- సద్గురు చరణం పరమ పావనం సత్య సాయినం గజాననమ్
- భవ భయ హరణం పరమ పావనం సత్య సాయినం గజాననమ్
గణేశ శరణం
సాహిత్యం
అర్థం:
గణేశుడికి భక్తితో నమస్కరిద్దాం, సాయి గణేశుడికి సంపూర్ణ పవిత్రతతో నమస్కరిద్దాం, సాయి యొక్క పవిత్ర నామాన్ని నిరంతరం స్మరించుకుందాం, ఏనుగు ముఖం గల గణేశుడిని స్మరించుకుందాం. సద్గురువు ఐన సాయి యొక్క పవిత్ర పాదాలు పట్టుకుందాము. సాయిగణేశుని నామ స్మరణతో భవ భయములను తొలగించి కాపాడమని ప్రార్ధిస్తున్నాను
వివరణ
గణేశ శరణం పరమ పావనం సత్య సాయినం గజాననమ్ | ఏనుగు ముఖం గల గణేశుని రూపాన్ని కూడా ధరించే ఓ భగవాన్ సత్యసాయి నీకు మేము శరణాగతి చేస్తున్నాము |
---|---|
నిత్య స్మరణం పరమ పావనం సత్య సాయినం గజాననమ్ | సాయి గజానన,సర్వోత్కృష్టమైన శుద్ధి మరియు మంగళకరమైనవాడవు. ప్రతి క్షణం మేము నిన్ను స్మరించుకుంటాము. |
సద్గురు చరణం పరమ పావనం సత్య సాయినం గజాననమ్ | సాక్షాత్తూ గణేశుడే అయిన పరమ గురువైన సాయి భగవంతుని పాదాలకు మేము భక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాము. |
భవ భయ హరణం పరమ పావనం సత్య సాయినం గజాననమ్ | సాయి గజానన లౌకిక అస్తిత్వ భయాలను పోగొట్టి, పవిత్రతతో, ఐశ్వర్యములను నింపే సాయి గణేశా కాపాడుము |
రాగం: సింధు భైరవి
శృతి:డి (పంచం)
బీట్ (బీట్): కెహెర్వా లేదా ఆది తాళం 8 బీట్
Indian Notation
Western Notation
Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_12/01JAN14/bhajan-tutor-Prem-Ganesha-Sharanam.htm