- జయ జయ జయ హే గజానన
- పార్వతీ నందన శుభాననా
- జయ జయ జయ హే గజానన
- నీలకంఠ సుత గజానన
- నిత్య శుభంగ గజానన
జయ జయ జయ హే
సాహిత్యం
అర్థం
ఏనుగు ముఖం గల వినాయకునికి జయం. తల్లి పార్వతి యొక్క ప్రియతమ కుమారుడవు. ఏనుగు ముఖం గల వినాయకునికి జయం. నీలకంఠం కలిగినశివుని ప్రియ పుత్రుడవు. నీవు నిత్య శుభప్రదుడవు.
వివరణ
జయ జయ జయ హే గజానన | ఏనుగు ముఖం గల గణేశునికి జయం! |
---|---|
పార్వతినందన శుభాననా | పార్వతి దేవి ముద్దుల కొడుకువు |
జయ జయ జయ హే గజానన | ఏనుగు ముఖ స్వరూపుడైన వినాయకునికి జయం! |
నీలకంఠ సుత గజానన | నీలకంఠము కలిగిన శివుని ప్రియ పుత్రుడవు ఐన వినాయకా |
నిత్య శుభంగ గజానన | ఓ ఏనుగు ముఖం గల ప్రభూ, నువ్వే నిత్య మంగళకరుడవు |
రాగం: మోహనం (కర్నాటిక్) భూపాలి (హిందుస్తానీ)
శ్రుతి: C# (పంచమం)
బీట్ (తాలా): కెహెర్వా లేదా ఆది తాళం – 8 బీట్
Indian Notation


Western Notation

https://archive.sssmediacentre.org/journals/vol_15/01AUG17/Bhajan-Tutor-Jaya-Jaya-Jaya-Hey-Gajanana.htm