శిబిరాల నిర్వహణ
పిల్లలలో విలువలు పెంచేందుకు రెసిడెన్షియల్ క్యాంపులు నిర్వహణ ఒక చక్కని మార్గం. దీనిలో పాల్గొనే బాలబాలికలు ఇంటికి దూరంగా వేరే పిల్లలతో కలిసి ఉండటం ద్వారా వారు స్వతంత్ర భావాలు పెంపొందించుకుంటారు .కొత్త పిల్లలతో సంభాషించడం ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటారు. వారిలో స్నేహభావం పెరుగుతుంది. ఇంటిలో ఉన్న సురక్షిత స్థానం నుంచి బయటికి రావడంతో వారి చుట్టూ ఉన్న పరిస్థితులతో ఎలా రాజీ పడాలో, ఉన్న వనరులను వారికి అనుగుణంగా ఎలా మార్చుకోవాలో, ఎలా సర్దుబాటు చేసుకోవాలో తెలుస్తుంది. వారి వారి సొంత బాధ్యతలను తెలుసుకుంటారు. వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. గ్రూప్ 3 బాలబాలికల కోసం రెసిడెన్షియల్ క్యాంప్ నిర్వహించడానికి మార్గదర్శకాలు. జిల్లా స్థాయిలో శిబిరం.
Guidelines to organize Residential Balvikas Camps for Group3 boys and girls:
- Duration: 2 to 3 days
- District Level Camp comprising of all Samitis
సూచించబడిన కార్యకలాపాలు:
- నమోదు
- ఓరియంటేషన్
- ఐస్ బ్రేకర్,- to get the students familiarize with one another.
- సమూహాలుగా విభజించడం
- నగర సంకీర్తన
- యోగాసనాలు -ధ్యానం
- ప్రధాన మతాల నుంచి ప్రార్థనలు
- ఎగ్జిబిషన్
- బోధన ఉపకరణాలు తయారు చేయటం
- మెంటరింగ్ , క్యారీర్ కౌన్సిలింగ్, టీనేజర్లకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ,విద్యార్థుల సామాజిక బాధ్యతలు మొదలగు విభిన్న అంశాలపై నిపుణుల ద్వారా చర్చలు.
- స్వామి పూర్వ విద్యార్థులు, బాలవికాస్ పూర్వ విద్యార్థుల అనుభవాలను పంచుకోవడం.
- స్వామి వారి కార్యకలాపాలపై వీడియో ప్రదర్శనలు
- భజన శిక్షణ.
- రోల్ ప్లేలు, ప్రేరణాత్మక ఆటలు
- మొక్కలు నాటడం
- వృద్ధాశ్రమాలు అనాధ శరణాలయాలను సందర్శించడం.
- SSSIHL లో అందుబాటులో ఉన్న కోర్సులపై క్లుప్తంగా చెప్పటం.
- శిబిరంలో జరిగిన టాపిక్ ఆధారంగా క్విజ్
- టాలెంట్ షో (డాన్స్, మ్యూజిక్, మైమ్, మిమిక్రీ మొ||)
- శిబిరంలో పాల్గొన్న వారిలో కొంతమంది వారి అభిప్రాయాలను పంచుకోవడం.
- ముఖ్యఅతిథిచే సర్టిఫికెట్ల పంపిణీ.
గమనించవలసిన అంశాలు:
- ప్రతి గ్రూపులో ప్రతి సమితి నుండి బాలవికాస్ పిల్లలు ఉండాలి.
- పిల్లలలో ఉత్సాహాన్ని, ఆసక్తిని పెంచి కొనసాగించడానికి ప్రోగ్రాం షెడ్యూలు సాధారణమైన వాటికంటే భిన్నంగా ఉండాలి.
- గురువులు కేవలం సహాయకులుగా ఉండాలి. అవసరమైనప్పుడు మార్గ నిర్దేశం చేయాలి. శిబిరంలో పాల్గొనే వారికి భోజన సమయాలలో, అక్కడ బస చేయడానికి సంబంధించిన ఇతర సేవలలో పిల్లలకు అవకాశాలు ఇవ్వాలి.
- ఎంజాయ్మెంట్ పేరుతో క్రమశిక్షణ ఎట్టి పరిస్థితుల్లోనూ త్యాగం చేయకూడదు.
- ఈ శిబిరం తప్పనిసరిగా విలువల ఆధారితంగా వినోదాత్మకంగా, జ్ఞానోదయం మరియు ఉత్పాదకతను కలిగి ఉండాలి.
జ్ఞాపకాలు ఎలా ఉండాలంటే మళ్ళీ మళ్ళీ జీవితంలో వారు నేర్చుకున్న జ్ఞానం ఉపయోగపడేలా ఉండాలి.