జ్ఞాన రత్నాలు మరియు ముత్యాలు (జ్ఞాన నిధి)
నీటి బిందువులు ఒక్కొక్కటి చేరితే నీటి కుండ నిండుతుంది. అదేవిధంగా మనిషి జ్ఞానాన్ని కొద్ది కొద్దిగా సముపార్జన చేసుకుంటే మనీషి అవుతాడు.
“ఓ యువకులారా! మీ ప్రాచీన వారసత్వాన్ని చూసి ఆనందించండి. మరియు ప్రపంచ సేవకై దానిని సుసంపన్నం చేయండి. శక్తివంతమైన భారత జాతి అంతా ఆమె కొరకై వేచి ఉంది. ఆమె గళాన్ని వినండి. ఆమె ఆదర్శలను కాపాడండి. ఆమె పురాతన గతం కంటే శక్తివంతమైన భవిష్యత్తు కొరకు ముందుకు సాగండి.
-సాధు వాస్వాని
మనం మన ఆత్మ గురించి ఎరుకలో ఉన్నప్పుడు, అహంకారాన్ని వీడి, అందరి హృదయాలలో ఉండే అంతర్యామిని గ్రహిస్తాము.
-రవీంద్రనాథ్ ఠాగూర్
పరమాత్మతో సంబంధాన్ని కలిగి ఉండే వరకు, బాహ్య ప్రపంచం పూర్తి భావాన్ని పొందదు. ప్రపంచాన్ని పూర్తిగా చూడటం, జీవిని నిజమైన ఆత్మగా భావించడం అనునది మాయలో చిక్కుకొనుటయే. ఆధ్యాత్మిక నేపథ్యం లేని జీవితం అర్థహితమైనది.
– శ్రీ అరబిందో
శరీరము రథము వంటిది. ఆత్మ స్వరూపుడైన భగవంతుడు ఆ రథంలో వెలసి ఉన్నాడు. ఇంద్రియాలు గుర్రాలు. మనసు పగ్గం, రథసారధి బుద్ధి, రహదారులు ఇంద్రియ వస్తువులు మరియు నిర్దేశించబడిన గమ్యస్థానం పరమాత్మను చేరుకొనటం. రథసారధి పగ్గాలను (మనసును) నియంత్రించవలసి ఉంటుంది. పగ్గాలు గుర్రాలను (ఇంద్రియాలను) నిగ్రహించవలసి ఉంటుంది. రథసారధి (బుద్ధి) రథాన్ని సురక్షితమైన గమ్యానికి చేర్చవలసి వుంటుంది. రథసారధి ఆదేశాలను అనుసరించి, ఇంద్రియాలను మనస్సు ద్వారా నిగ్రహించి నట్లయితే జీవిత లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఇది తెలుపుతుంది. మనసును బుద్ధిచే నియంత్రించ బడుతుంది. బుద్ధి ఆత్మకు లోబడి ఉంటుంది. ఈ విధమైన మార్గము లేకపోతే జీవితము దుఃఖమయం అవుతుంది.
(కఠోపనిషత్)
మన శారీరక జీవనము ఎలాంటిది అంటే, మనస్సు కంటే, లోపలి అంతరాలలో ఉండే ఆత్మ స్పృహలో ఉండి చేసే ఇంద్రియముల పనితీరు. మనస్సు అనేది ఆత్మకు సంబంధించిన ఉపకరణం మాత్రమే. ఇది సంపూర్ణ సార్వభౌమత్వాన్ని కలిగి ఉండి, నిరంతరం చింతలను సృష్టిస్తూ, క్రూరమైన ప్రణాళికలను రూపొందిస్తుంది. అవన్నీ పూర్తిగా బాహ్య ప్రపంచం వైపుకు దారి మళ్ళి స్తాయి. ఆత్మతత్వాన్ని పూర్తిగా విస్మరిస్తాయి.
అహం అన్నది ఆత్మ యొక్క ప్రతిబింబము. ఆధ్యాత్మిక పరిభాషలో దీనిని ‘జీవము’ అని పిలుస్తారు. ఇది ఎటువంటిది అనగా గుర్రము పై కూర్చుని గాయపడిన వున్న లేదా అపస్మారక స్థితిలో వున్న రౌతులాంటిది. ఇటువంటి సందర్భంలో ఆత్మ యొక్క స్పృహ చాలా అసంపూర్ణంగాను మరియు చాలా స్వల్పంగాను ఉంటుంది. ఈ స్పృహను పదును పెట్టడానికి మరియు ప్రేరేపించటానికి ఋషులు ‘నేను ఎవరు?’ అను ప్రాథమిక విచారణను సూచించారు. నేను ఎక్కడ నుంచి వచ్చాను? నేను ఎక్కడికి వెళ్తున్నాను?, పుట్టుక, మరణము, వృద్ధాప్యము మరియు అన్ని రకాల బాధలు నుండి విముక్తి పొందే శాశ్వతమైన ఆలోచనను తరచుగా చేస్తుండాలని వారు సూచించారు.
ఒక వ్యక్తి తన ఇంద్రియాల నియంత్రణలో ఉన్నప్పుడు, అతని జీవితం ప్రపంచానికి సంబంధించినదిగా ఉంటుంది. అతను తన ఇంద్రియాలను తానే నియంత్రించినప్పుడు, అతని జీవితం ఆత్మతో కలిసి ఉంటుంది.
మనసు ఏకాగ్రతగా ఉన్నప్పుడు విజయాన్ని పొందుతుంది. చేసే కర్మలో అటువంటి ఏకాగ్రతనే కలిగి ఉంటే, అహం అన్న స్పృహ ఉండదు. ‘నేను నాది’ అనే భావన ఉండది. అప్పుడు ‘కర్మబంధం’ ఉండదు
ఇదంతా మనసుపై ఆధారపడి వుంది. మనసు స్వచ్ఛంగా ఉంటే తప్ప ఏదీ ఫలించదు.
కోరిక నుండి శరీరం ఏర్పడుతుంది. కోరిక లేకపోతే శరీరం విడిపోతుంది. కోరికల అంతిమ ముగింపు అనగా మోక్షం లభిస్తుంది. కోరికలు ఉన్నంత కాలం పునర్జన్మ అనివార్యం. మంచి కోసం తపన, భగవంతుని కొరకై వాంఛ అనేవి ప్రాపంచిక సుఖాల కోసం కోరే కోరికలు కావు. దీనినే ‘ఆకాంక్ష’ అంటారు. కోరికలు మనిషిని అధోగతి పాలు చేస్తాయి. కానీ ఆకాంక్షలు అతన్ని ఉద్ధరిస్తాయి. బాహ్యమైన వాటితో కాకుండా భగవంతునితో సంబంధాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే అన్ని వాస్తవం అయినవి కావు. భగవంతునితో అనుబంధం మాత్రమే వాస్తవిక ఆనందానికి దారితీస్తుంది. అవాస్తవికంతో అనుబంధం దుఃఖానికి దారితీస్తుంది. ప్రాపంచిక ఆలోచనలు వదులుకునే వరకు ఆధ్యాత్మిక ఉన్నతిని పొందలేము.
భగవంతునిపై ఉన్న భయ భక్తులే జ్ఞానానికి నాంది. ఒక వ్యక్తి జ్ఞానంతో ఎదుగుతున్న కొద్దీ భయం ప్రేమగా మారుతుంది. పరిపూర్ణ ప్రేమను పెంపొందించుకుంటే భయం పూర్తిగా తొలగిపోతుంది. భగవంతునితో పూర్తి సంబంధాన్ని పెంపొందించుకోవడానికి ముఖ్యమైన మార్గము చిత్తశుద్ధి. మనం చిత్తశుద్ధితో ప్రార్థిస్తే భగవంతుని ఉనికిని అనుభవం పొందుతాము. మానవత్వాన్ని, దివ్యత్వాన్ని ఒకటిగా చేసేదే చిత్తశుద్ధి.
మీరు ఏది భుజించినప్పటికీ ముందుగా భగవంతుడికి సమర్పించండి. భగవంతునికి నైవేద్యం పెట్టకుండా ఆహారం తినకూడదు. మీ ఆహారం ఎలా ఉంటుందో మీ రక్తం అలాగే ఉంటుంది. స్వచ్ఛమైన ఆహారం నుండి మీరు స్వచ్ఛమైన రక్తము, స్వచ్ఛమైన మనసు మరియు శారీరక బలాన్ని పొందుతారు. స్వచ్ఛమైన మనసు భగవంతుడి పట్ల భక్తి ప్రేమలను కలిగిస్తుంది. ప్రసాదం తినడం వలన మనసు శుద్ధి అవుతుంది.
మన కర్తవ్య కర్మలను నిర్వర్తించకుండా , ఇంకొక దానిని ఆస్వాదించడం దొంగతనంతో సమానం. ఇది ఖండించదగిన విషయం.
మతము అనగా ఆత్మను ఆత్మగా గుర్తించమని తెలుపునది. అయితే మనం చేసేదంతా దానికి వ్యతిరేకంగా ఉంది. ఆత్మను ఒక పదార్థముగా భావిస్తున్నాము.
నిశ్శబ్దంలో మనము ఆత్మ యొక్క వాణిని వినవచ్చు. ఆ వాణి స్వేచ్ఛ కొరకు ఖైదీ చేసే కేకల వలె, ఇంటిలో సంచరించేవారివలే, అనంతమైన వాటికోసం పరిమితిలో వున్న వారి దుఃఖం వలే ఉండును.
అంతిమసత్యాలు చాలామందికి చిన్నవిగా అనిపించి తక్కువ అర్థాన్ని తెలుపుతాయి. “నేనే అతను” వంటి ఈ సత్యాలు చాలా నిగూఢమైనవి. అసంపూర్ణమైన, పరిమితమైన, ఫలించని, అసత్యమైన దేహము వినాశకరమైనది అని స్థిరమైన అవగాహనతో తెలుసుకోవాలి.
రామకృష్ణ పరమహంస గృహస్థ శిష్యుడైన నాగమహాశయుడు, అహంకారాన్ని వీడి సంసార బంధనాలనుండి తప్పించుకొని, సురక్షితమైన మార్గాన్ని అనుసరించాడు. స్వామి వివేకానంద విశ్వమంతా తనని గుర్తించ బడే విధంగా తనని తాను విస్తరించుకున్నాడు. జగత్తుతో బంధనను తొలగించుకున్నాడు.
నాగ మహాశయుడు “నేను భగవంతుని దాసుడను” “దాసోహం” అని భావించాడు. “ఇదం సర్వం” “సదాసోహం” అని స్వామి వివేకానంద భావించాడు. అతను ఎల్లప్పుడూ దృఢనిశ్చయంతో ఉండి, “తాను ఆత్మ స్వరూపుడను” అని భావించాడు. దీనినే జీవ-బ్రహ్మ-ఐక్య-అనుసంధానం అంటారు. దీని కొరకై చేసే సాధన అహంకారాన్ని అభివృద్ధి చేయదు. ఈ విశ్వంలో అహాన్ని విలీనం చేస్తుంది.” నేను” అనే ఆలోచన, “నీలో” అదృశ్యమవుతుంది. ఇదే ఆత్మ యొక్క ఉన్నత స్థితిని కనుగొనే ఏకైక మార్గము. – (భగవాన్ శ్రీ సత్య సాయి బాబా)
“శివోహం” అన్నది “ఆదర్శము”. “దాసోహం” అన్నది “ఆచరణ”. మీ అభ్యాసం ద్వారా ఆదర్శంగా ఉండటం తెలుసుకోండి. -(శ్రీ సత్య సాయి బాబా)
“నేను” మరియు “నాది” అన్న భావం ఉన్నంతవరకు భగవంతుని అనుగ్రహం లభించదు. మనం మన గురించి ఆలోచిస్తే భగవంతునికి దూరం అవుతాము. మనము మన అహంకారాన్ని విడిచి పెట్టినప్పుడు, మన తెరచాపలు అతని అనుగ్రహం యొక్క గాలులను స్వీకరించటానికి సిద్ధంగా ఉంటాయి మరియు అతని దయ మనకు పరిపూర్ణంగా లభిస్తుంది. మన ఆహారం అతని అనుగ్రహ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది.
ఒక వ్యక్తి నిజమైన జ్ఞానాన్ని పొందినప్పుడు, భగవంతుడి వేరు అన్న భావానికి దూరం అవుతాడు. అప్పుడు నాలో ఉన్న వాడు, అందరిలోనూ కూడా ఉన్నాడని గ్రహిస్తాడు. అప్పుడు మనలో వినయం పెరుగుతుంది.
ప్రపంచాన్ని విడిచిపెట్టి జీవించకండి. ప్రపంచంలోనే జీవించండి. కానీ “నిశ్శబ్దంగా వుంటూ నేను అన్నది వదిలిపెట్టిన వాడే నిజమైన జ్ఞాని”. చిన్నపిల్లల వద్ద నుండి అందరూ పదవిని గట్టిగా పట్టుకుని ఉన్నారు. ప్రాపంచిక జగత్తులో ఉన్నప్పటికీ, భగవంతుడిని గట్టిగా విడవకుండా పట్టుకోండి.
ఒక వ్యక్తి పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకమైన దృక్పథం ఏమిటంటే, అన్ని కార్యకలాపాలలో తాను నిమగ్నమై, తన కర్తవ్యాన్ని.
నిర్వర్తించటం. ఆకాశం యొక్క నీలివర్ణము, మేఘాలు, వర్షము మెరుపులు, ఉరుములు అన్ని ఒకదానికి ఒకటి అనుబంధం లేకుండా ప్రభావితం కావు. ఆటంకాలు తాత్కాలికంగా ఉంటాయి. అలాగే మనిషి యొక్క మనసు తుఫాను వంటి ఎన్నో ఒత్తిడులకు లోనై యున్నప్పటికీ, స్పష్టంగాను శుభ్రంగానే ఉండాలి. చాలామంది ఎక్కువ భావోద్వేగాలకు, ఒత్తిడికి లోనవుతూ గొప్ప పనులు చేస్తారు. కానీ ఒక వ్యక్తి తన నిత్యం పనిచేసే ముఖ్యమైన పనులు, మరియు అతను చేసే విధానాన్ని బట్టి అతని నిజ స్వరూపం తెలుస్తుంది. అందరికీ ఉపయోగపడటం కోసం మరియు అందరికీ మంచి చేయడం కోసం ఆత్మ నుండి సద్గుణ కాంతి ప్రకాశిస్తుంది.
ఆచారాలు వరి గింజ మీద పొట్టు లాంటివి. పొట్టు లేకపోతే ఒరిగింజ మట్టిలో నాటినప్పటికీ మొలకెత్తదు. ఆ విధంగా మన ధర్మాన్ని పరిరక్షించడము, వాటి వేర్లు నాటుకోనడానికి, ఎదగడానికి కీలకమైన శక్తిని ఇవ్వడానికి ఆచారాలు, వేడుకలు మరియు పండుగలు ఒక నిర్దిష్టమైన మతం ద్వారా నిర్దేశించబడ్డాయి.
ఈ విధంగా నేను ఎన్ని విషయాలను మీకు ఒక్కొక్కటిగా వివరించగలను? మీలో సేవా భావాన్ని పెంపొందించుకోండి. మీ కంటికి కనిపించే దూరంలో ఉన్న, అవసరమైన వారందరికీ సేవ చేయండి. ఎందుకంటే “వారందరూ నా స్వరూపాలే” అని గ్రహించండి. మరియు అన్ని జీవుల పట్ల దేషాన్ని విడిచిపెట్టి, నేను అణువణువునా ఉన్నాను అన్న పూర్తి విశ్వాసంతో, వినయంతో, ప్రతి చోటా నన్ను దర్శించండి. అప్పుడే మీరు నా పూర్తి రక్షణను పొందగలుగుతారు. అప్పుడు ఈ ప్రపంచంలో మీకు నేను తప్ప మీకు వేరే విషయాలు ఏవి ఉండవు. అన్ని సమయాలలో నేను మీతో ఐక్యమైపోతాను.