భజగోవిందం గురించి
భజగోవిందం గురించి
వేదాంత తత్వాన్ని చాలా సరళంగా అందరికీ అర్థమయ్యే రీతిలో సంస్కృతంలో పాడిన గొప్ప పద్యాలు భజగోవిందం పల్లవితో శ్రీ శంకరాచార్య చెప్పిన వాటి పరిస్థితి ఒక కథ వివరిస్తుంది. ఒకసారి వారణాసి లో తన 14 మంది శిష్యులతో ప్రదక్షిణలకు వెళ్తున్నప్పుడు పాణిని వ్యాకరణ నియమాలు వల్లె వేయడం చూశాడు. సంధ్యా సమయంలో భగవంతుని స్మరణలో ఆధ్యాత్మిక జ్ఞానం కోసం కాకుండా కేవలం మేధో పరమైన సాఫల్యత కోసం వినియోగించే అజ్ఞానం మూర్ఖత్వం చూసి జాలి చెందాడు. ఐహిక బంధాలు కేవలం ఆ వృద్దుడికే పరిమితం కాదని అందరికీ వర్తిస్తుందని తెలుసుకుంటాడు. మనుషులు తమ జీవితాలను వ్యర్థ మార్గాల్లో భూ సంబంధమైన ఇతర విషయాలకు వెచ్చించి ఏకైక మార్గమైన దేవుడిని మరిచి పోతారు. మనిషి యొక్క దుస్థితి పట్ల జాలితో ఈ వేదాంత తత్వాన్ని పాటగా చెప్పినది మోహ ముద్గరగా ప్రసిద్ధి గాంచింది
ఓ మూఢా! అజ్ఞానీ! మృత్యువు మిమ్మల్ని లాక్కొనడానికి దాపున చేరినప్పుడు వ్యాకరణం, మీ భౌతిక అవసరాలు మిమ్మల్ని కాపాడవు. మీ జీవితం లోని అమూల్యమైన కాలాన్ని నిష్ఫలమయ్యే రీతిలో వృధా చేయకుండా జీవన్మరణ చక్రం నుండి తప్పించగల గోవిందుని వెతకండి.
భజ గోవిందం అనే రచన వారి ఇతర భాష్యాలు, భారతీయ పురాణాల వ్యాఖ్యానాలతో పోల్చితే వారి చిన్న కూర్పుల్లొ ఒకటి. ఆత్మ బోధ మొదలైన వాటితో పాటు భజగోవిందం ఆధ్యాత్మిక అధ్యయనంలో పరిచయానికి పనికివచ్చే ప్రకరణాల క్రింద వస్తుంది. ఇవి ప్రాధమిక మైనవి ఆధ్యాత్మిక దీక్షాపరుల కోసం తత్వాన్ని వివరిస్తాయి. ఆధ్యాత్మిక తత్వాలను తెరపైకి తెచ్చి గ్రంధస్థం గావించి మనిషి ఈ విధంగా ఆలోచించేటట్లు చేశారు. అయ్యో ఇంతేనా జీవితం, నేను ఈ బందీ అయిన జీవితం నుంచి తప్పించుకోవాలని కోరుకుంటాను దానికి భగవంతుడు తగిన మార్గనిర్దేశం చేసి సహాయం చేస్తాడు. ఈవిధంగా మనిషి తన దుర్భరమైన వాటి నుంచి బయట పడి ఆధ్యాత్మిక రాజమార్గంలో దైవ మార్గంలోకి మళ్ళింపబడుతాడు.
1973 బృందావనంలో విద్యార్థుల కోసం భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మిక వేసవి తరగతుల సమయంలో శ్రీ సత్యసాయి బాబా ప్రతిరోజూ సాయంత్రం తమ దైవిక ప్రసంగాలు భజగోవిందం అనే అంశంపై తీసుకున్నారు. వారు భజగోవిందం పదహారు శ్లోకాలను తెలుగులో ప్రత్యేకంగా తమ మధురమైన రీతిలో అందించారు. శంకరులు స్వయంగా వివరించినట్లు, అర్థాలు విశదీకరిస్తూ ఉపన్యాసాలు భజగోవిందం విషయాన్ని అత్యద్భుతంగా చెప్పారు. అందువల్ల బృందావనం వేసవి తరగతుల ఉపన్యాసాలు ‘సమ్మర్ కోర్సు ఆఫ్ బృందావనం 1973’ అనే పుస్తకం ఈ విషయాన్ని అధ్యయనం కోసం ఉత్తమంగా ఉపయోగించడం మంచిది. బాబా వారు ‘ ఓ మూఢమతీ! ముక్తిమతిగా మరి గోవిందుడైన భగవంతుని వెతుకు’ అన్నారు.
బాబా వారు తమ ఉపన్యాసాల కోసం ఎంచుకున్న య16 చరణాలు హరి గోవిందా అనే పల్లవితో ఉంటాయి.
(పూర్తి వివరాల కోసం బృందావన్ వేసవి జల్లులు 1973 చూడవచ్చు)