అహింస
అహింస
ఆత్మ పరిపూర్ణ వికాసము పొంది, తద్వారా కలిగిన అద్వైతానుభూతి, సకల చరాచర సృష్టి ఒకటే అను భావనే అహింస. తనకు, సృష్టిలోని ఇతర జీవులకు గల ఆత్మ సంబంధాన్ని తెలియ జేసేది అహింసాతత్వము. ఇది ఆత్మ వికాసాన్ని వ్యక్తము చేసే లక్షణము. ఒకే దివ్యత్వము ప్రతి జీవిలోను ఉన్నది అని అహింస గుర్తిస్తుంది. అందువలన మరొకరికి కల్గిన సుఖ, దుఃఖాలు మనకు కలిగినట్లే భావిస్తాము. ఇదే నిస్వార్ధమైన, ఇంద్రియాతీతమైన ప్రేమ.
సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను విలువలు ఒక వ్యక్తికి, మరొక వ్యక్తికి లేక మరి కొందరు వ్యక్తులకుగల సంబంధ, బాంధవ్యాలలో వ్యక్తమవుతాయి. కానీ అహింస అనే విలువ మానవుని సామాజిక ప్రవర్తనలో ప్రతిబింబిస్తుంది. ప్రతి జీవి ఎడ అతని దృక్పధాన్ని సర్వజీవ ప్రేమను తెలియ జేస్తుంది.
“అహింసా పరమోధర్మః” – అహింస అత్యుత్తమ ధర్మము అని అన్ని మతాలు చెప్తున్నాయి. దీని భావము భౌతికంగా హింస చేయకుండా ఉండటమే కాదు. మనసా, వాచా, కర్మణా కూడ అహింసా తత్వము అవసరమని బోధిస్తున్నాయి.
ఈ అయిదు విలువలను అవగాహన చేసికొని మన నిత్య జీవితములో వాటిని ఆచరించినపుడే మన జీవితాలు సార్థక మవుతాయి.
అన్ని ధర్మాలు, జీవిత విలువలు ఈ అయిదు విలువల్లోనే ఇమిడి ఉన్నాయి. వీటిని ఆదర్శంగా పెట్టుకొని, మన మనస్సును, హృదయాన్ని వీటితో నింపుకొని, బుద్ధిని, సంకల్పశక్తిని వీటి మార్గంలోకి మళ్ళించి, మన ప్రవర్తనను మలచు కొన్నపుడే మనము సరియైన జీవిత మార్గంలో ప్రయాణిస్తాము. తద్వారా మన క్షేమాన్ని, ఇతరుల క్షేమాన్ని, సమాజ శ్రేయస్సును పెంపొందించ గలుగుతాము. ఈ విధంగా భగవంతుడు అనుగ్రహించిన దివ్యపధంలో పయనించే భాగ్యము కలుగుతుంది. ఇదే సాయి సందేశము. తన జీవితము ద్వారా పగలు, రాత్రి సాయి ఈ సందేశాన్నే అందిస్తున్నారు. ఈ సాయి పథాన్ని మనము అనుసరించి, సాయి అగుగుజాడల్లో పయనించి, పునరుజ్జీవితులమై సంఘ శ్రేయస్సుకు శాయశక్తులా కృషి చేద్దాము.
These five human values should be deemed as the fivefold life breaths or Pancha Pranas (Prana, Apana, Udhana, Samana, Vyaana – the incoming, outgoing, upward flow, even and circulating breaths). Since the values constitute the life breath, one who does not radiate the values in one’s actions is deemed to be lifeless!
This indeed is the Sai Message, the Divine Message that Sai is teaching us through His own personal life and example, day in and day out, and all along. Our Swami says,
“Sathya is My Prachar (what I teach);
Dharma is My Aachar (the way I live);
Shanthi is My Swabhaava (the mark of My personality);
Prema is My Swaroopa (my very Nature)”
Let us tread the Sai Path, follow in his Footprints and redeem ourselves and contribute to the good of the Society and the World in our own small and humble measure.