గాలి

Print Friendly, PDF & Email
Guided Visua;isation

గాలి

ప్రియమైన పిల్లలూ…

సో …హమ్ …అని చెప్పండి. మూడు మార్లు సో అని చెప్పినప్పుడు గాలి పీల్చడం,హమ్ అన్నప్పుడు ఊపిరి వదలటం అవే ఉచ్చ్వాస,నిశ్వాసలు.

గాలి దేవుని సృష్టిలో ప్రధానమైనది. ప్రాణులన్నీ గాలి లేకుండా కొద్దిసేపు కూడా బతకలేవు. గాలిని వాయుదేవునిగా పూజిస్తాం. నెమ్మదిగా మీరు కళ్ళు మూసుకోండి. మనం ఇప్పుడు,ఒక అందమైన పూల తోటలోకి వెళ్తున్నాం.

తోటలో ఒకవైపు మంచి వాసన వచ్చే మల్లెపూలు, మరొకవైపు గులాబీ పువ్వులు అందంగా ఉన్నాయి. చల్లటి గాలి వేస్తోంది. దానిలో పూల పరిమళం కూడా ఉంది. చల్లగాలితో,మన శరీరం తాజాదనం పొందుతున్నది. చెట్ల మీద పక్షుల కిలకిల రావాలు, ప్రకృతి అందాన్ని చూస్తూ నడుస్తున్నాం. దగ్గరిలో ఎవరో వేణువు వాయిస్తున్నారు. వేణునాదం చెవులకు సోకి ప్రశాంతంగా ఉంది. మంచి వాతావరణం, మనకి శక్తినిస్తుంది. మన చుట్టూ ప్రేమ,ఆనందం యొక్క కిరణాలు గాలి ద్వారా అందుతున్నాయి. మనం కూడా గాలి లాగానే ఉండాలి. గాలి ధనిక, పేద తారతమ్యం చూపదు. మనుషులు,జంతువులు, చెట్లు అన్నిటికీ అందుబాటులో ఉంటుంది.చల్లగా మరియు స్వచ్ఛంగా ఉండే గాల్లో, మనం చిరునవ్వుతో ఉల్లాసంగా గడపాలి. భగవంతుని మెత్తని పాద కమలాలకు సమీపంగా మనం ఉండాలి.

ఒకసారి మీ అరచేతులు గట్టిగా రుద్దండి. కళ్ళ మీద పెడితే వేడి తగులుతుంది. కళ్ళను నెమ్మదిగా మసాజ్ చేయండి. ముఖం తుడుచుకోండి.ఇప్పుడు కళ్ళు తెరవండి.

తరగతి చర్చ

ప్రశ్నలు:
  1. గాలికి మరో పేరు ఏమిటి?
  2. గాలి ప్రాముఖ్యత గురించి చెప్పండి.

[English Ref: Silence to Sai-lens – A Handbook for Children, Parents and Teachers by Chithra Narayan & Gayeetree Ramchurn Samboo MSK – A Institute of Sathya Sai Education – Mauritius Publications]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *