ప్రశంశలు

Print Friendly, PDF & Email
ప్రశంశలు
నాలో మరియు ఇతరులలో మంచి లక్షణాలను చూడగల్గినందుకు ప్రశంసలు

(పేరాగ్రాఫ్ లు మరియు పులిస్టాప్ ల మధ్య విరామం ఇవ్వండి)

దశ 1:

సౌకర్యం వంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ లేదా నేల మీద స్థిరాసనంలో కూర్చోండి.

వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి. మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘ శ్వాసను మళ్లీమళ్లీ తీసుకోండి.

దశ 2:

ఇప్పుడు శరీరంలోని ఉద్రిక్తతను తగ్గించండి. మీ కాలు వేళ్ళను సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. పిక్క కండరాలను బిగించి, ఆపై వాటికి విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత మీ పైకాళ్లు మరియు తొడలలోని కండరాలను బిగించండి. ఆ తర్వాత వాటికి విశ్రాంతినివ్వండి. మీ కడుపు కండరాలను లాగండి. మళ్లీ వాటికి విశ్రాంతినివ్వండి. భుజాలను వెనక్కి లాగండి. మళ్లీ వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి కిందికి తట్టండి. ఇప్పుడు మీ ఎడమ వైపు చూడండి. మళ్లీ ముందుకు చూడండి. తిరిగి కుడివైపు చూడండి. మళ్లీ ముందుకు చూడండి. ఇప్పుడు మీ ముఖం యొక్క కండరాలను బిగించండి. తిరిగి వాటికి విశ్రాంతినివ్వండి.మీ శరీరం మొత్తం విశ్రాంతి పొందినట్లుగా అనుభూతి పొందండి. అప్పుడు మీలోని ఉద్రిక్తతలన్నీ తగ్గిపోయి మీరు మంచి అనుభూతిని పొందుతారు.

దశ 3:

మీ హృదయంలో ప్రేమ యొక్క వెచ్చటి అనుభూతిని పెంపొందించండి. అది మీ శరీరం అంతా వ్యాపించనివ్వండి. ఇప్పుడు మీరు ప్రేమ స్వరూపంతో అందంగా ఉన్నారు. మీ చుట్టూ ఉన్న వారంతా కూడా అలాగే ఉన్నారు. మీలోని ప్రేమను తరగతి గదిలోని ప్రతి ఒక్కరికి, తర్వాత మీ కుటుంబానికి, ఆ తర్వాత మీ వీధిలోని వ్యక్తులకు, ఆ తర్వాత మీ పట్టణం అంతా, తర్వాత దేశవ్యాప్తంగా, తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని జీవులకు, చేపలు, చెట్లు, మొక్కలు…ఈ విధంగా ప్రతి జీవి ప్రేమించబడాలి. ప్రశంసింపబడాలి. మీ చుట్టూ ఉన్న అన్నింటికీ మీ ప్రశంసలు మరియు ప్రేమ ముఖ్యము.

దశ 4:

ఇప్పుడు మీరు తిరిగి మీ దృష్టిని తరగతిగదిలోనికి తీసుకురండి. మీ కళ్ళని విప్పార్చండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ ప్రక్కన ఉన్న వారిని చూచి నవ్వండి.

[శ్రీ సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *