మాత కన్యాకుమారి పాదములచెంత – భవిష్యత్ కార్యక్ర ప్రకటనము

Print Friendly, PDF & Email
మాత కన్యాకుమారి పాదములచెంత – భవిష్యత్ కార్యక్ర ప్రకటనము

వివేకానంద జీవితమునందు కన్యాకుమారిని దర్శించుట ఒక ముఖ్య మైన ఘట్టము; ప్రగతిలో ఒకమైలురాయి. కన్యాకుమారి దేవాలయమును దర్శించి, ఆ దివ్యమాతృదేవతా విగ్రహమునకు సాష్టాంగ ప్రణాములు అర్పించి, మాతృభూమినుండి విడివడి కొంతదూరములో సముద్రజలములు నడుమ నిలిచియున్న ఒక మహాశిలవరకు నీటిలో ఈదికొనుచుపోయి, దానిపై కూర్చుండి, దివ్యధ్యానమునందు మునిగి, భారత దేశముయొక్క భూతభవిష్య వర్తమాన విశేషములను ప్రస్తుత పతనావస్థకు గల కారణములను, పునరుద్ధరణ కనువైన ప్రణాళికలనుగూర్చి చింతించెను. ఆ సంఘటనమునుగూర్చి స్వామియే స్వయముగా నిట్లు పేర్కొనెను.

“కన్యాకుమారియంచు, భారతభూభాగముయొక్క దక్షిణాగ్రమునందు నిలచియున్న శిలాఖండముపై కూర్చుండి, మాతృదేవి కన్యాకుమారికి మోకరిల్లి, నాలో ఒక పథకమును రూపొందించుకొంటిని. మేము ఎందరమో నన్న్యాసులము దేశమంతటను సంచరించుచు ప్రజలకు వేదాంతమును బోదించుచున్నాము. ఇదియంతయు వెర్రితనము. “ఆకలితో మలమల మాడు చిన్న మానవులకు మతవిషయములు మనసుకెక్కవు”. అని గురుదేవులు చెప్పియుండలేదా? ఆ ప్రజలందరు అజ్ఞానమువలన మాత్రమే మూర్ఖులవలె జీవితములను గడుపుచున్నారు. ప్రజాసేవకంకిత మైన కొందరు సన్న్యాసులు పరోపకారబుద్ధితో, గ్రామగ్రామములకు వెడలి, చండాలురకు సైతము తమ జీవిత విధానములను మెరుగుపరచుకొనుటకు తగిన పరిజ్ఞానమును ప్రచారము చేయుచు, వారు చెప్పెడి విషయములను బాగుగా తెలిసికొనుటకు పటములు, కెమేరాలు, గ్లోబులు మొదలైన సాధనములుపయోగించి బోధించి నచో, దేశమున ఉజ్జ్వలభవిష్యత్తును సృష్టింపలేమా? మనము, ఒక దేశ ప్రజలుగా, మన వ్యక్తిత్వమును కోల్పోయినాము. అదియే నేటిభారత దేశము నందలి విషాదవికట పరిస్థితికి కారణము. కోల్పోయిన వ్యక్తిత్వమును మరల దేశమునకు కల్పింపవలెను; సామాన్యప్రజను సముద్దరింపపలెను.”

ఈవిధముగా కన్యాకుమారి అగ్రమునందు స్వామి వివేకానందుడు భారత దేశ సేవకు, ప్రత్యేకముగా లక్షలాదిసంఖ్యలలో నున్న బడుగువర్గపు దరిద్రనారాయణుల, క్షుద్బాధాపీడితుల సేవకు తనంతట తాను అంకిత మయ్యెను. అక్కడే వివేకానందుడు దేశభక్తుడైన సన్న్యాసిగా పరిణతి చెందెను. ఆతని ధ్యానములో, యోగాభ్యాసములో, వేదాధ్యయనములో పతితభారత ప్రజా ఉద్ధరణము ఒకభాగమై పరిణమించినది. మరియొక విధముగా చెప్పవలె ననినచో రామకృష్ణ పరమహంస వివేకానంద జీవిత ధ్యేయముగా భావించిన మహోద్యమము కార్యరూపముగా రూపుదాల్చినది కన్యాకుమారి అగ్రమునందే. అచ్చటే వివేకానందుని హృదయములో అమెరికాను దర్శించవలేనను సంకల్పము జనించిన ప్రోగుచేసి, దానితో భారతదేశమున విద్యాలయములు, తరములైన ఉపయోగ సంస్థలను నిర్మించి, ఇచ్చటి ప్రజలను ఉదార్తీకరించేన దురుకైన కార్యక్రమములను ఆరాంభింప వలెనని తలంచినది. వివేకానందుని ఈసంకల్పమునకు రామనాద్ రాజా ఇచ్చిను ప్రోత్సాహము తోడైనది. చికాగోనగరములో జరుగునట్లు ప్రచురింపబడిన విశ్వమత పరిషత్తు (Parliament of Religions) లో వివేకానందుడు.

పాల్గొనవలె నని ఆ రాజావారు ప్రోత్సహించిరి. స్వామి మద్రాసులో ఉనున్నప్పుడు ఔత్సాహికులైన పలుపురు యువకులు, వారి శిష్యులై, కొంత ధనమును ప్రోగుచేసి, అమెరికాను దర్శించుటకు వారిని చేసిరి. కాని, వివేకానందుని మనస్సులో తన ఉద్యమమును మాత శారదదేవి అంగీకంచి, ఆశీర్వదించునా యనెడి అనుమాన మొకటి యుండెడిది అట్టి తరుణమున వివేకానందున కొక అద్భుతమైన స్వప్నము వచ్చెను అందులో రామకృష్ణ పరమహంస దర్శన మిచ్చి, తనవెంట రమ వివదానందునికి సైగచేయుచు, సముద్రములపై నడచుచు ముందుకు వచించుండెను. అది యొక ప్రతీకాత్మక స్వన్నము ఆదేసమయమునమ శారదాదేవికికూడ ఒక స్వప్నము వచ్చెను. అందులో గురుదేవు లామె దర్శన మిచ్చి, వివేకానందుని దీవించి విదేశములకు మతప్రచారమున పంపు మని ఆదేశించెను.

ఖేత్రీ సంస్థానాధీశుడైన రాజా, ఆతరువాత వివేకానందుని జం కా నించి, విదేశయాత్రకు కావలసిన ఏర్పాట్ల నన్నియు చేయించెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *