ఓంకారము – ఉచ్చారణ
ఓంకారము
ప్రియమైన విద్యార్థులారా! నిటారుగా కూర్చోండి. నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకోండి. ఇప్పుడు శ్వాసను వెలుపలికి వదిలి వేయండి. పక్షులతో, పువ్వులతో, నీ తల్లిదండ్రులతో ఈ విశాలమైన ప్రపంచం ఎంత అందంగా, ఆహ్లాద భరితముగా ఉన్నదో ఊహించుకోండి. విశ్వమంతా అన్ని వైపుల నుండి దయానుగ్రహముల కాంతులు వెదజల్ల పడుతున్నాయి. మనము కూడా అందరికీ ఆనందాన్ని పంచుదాము.
మూడుసార్లు ఓంకారం పలకండి. భగవంతుని నుండి వెలువడిన మొట్టమొదటి ప్రప్రథమ శబ్దము ఓంకారము. ఈ ఓంకారము దైవము నుండి వెలువడినప్పుడు దానిని సంగ్రహించుకొనుటకు ఆకాశము ఉనికిలోనికి వచ్చినది. ఓంకారము మంత్ర రాజముగా చెప్పబడినది.
భగవంతుని సృష్టిలో మొదటిగా ఆకాశమును సృష్టించడము జరిగినది, ఎందుకనగా ఆకాశము అన్నిటిని తనలో ఇముడ్చుకోగలదు. స్వామి చెప్పారు “అందరినీ ప్రేమించు – అందరినీ సేవించు”. భగవంతునికి మనమంటే ఎంతో ప్రేమ. అందుకనే మనము నివసించడానికి ఇంత అందమైన ప్రపంచాన్ని, విశ్వమంతటిని ప్రసాదించాడు. నిన్ను ఉద్ధరించుటకు, అభివృద్ధి పరుచుటకు, మార్గదర్శకత్వం వహించుటకు, నీ విజయము, కీర్తి ప్రతిష్టలవైపు నిన్ను నడిపించుటకు నీ ప్రార్థన ఉండాలి.
ప్రశ్నలు:
- మంత్ర రాజము అని దేనిని అంటారు?
- ఏ మంచి గుణములను నీవు పెంపొందించుకొనదల్చుకున్నావు?