అవ్వయ్యార్
(అవ్వయ్యారు నాటకంలో)
రంగం – ఒక అడవి – ఒక వృద్ధురాలు చేతిలో కర్రతో నడుస్తూ ప్రవేశము:
పాట: నడిచి నడిచి వచ్చాను. నా కాళ్ళు నొప్పులు.
“నేను చెప్పేది వినండి :- ఆపదలో ఉన్న వారిని ఆదుకొనుటే ధర్మము న్యాయంగా సంపాదించినదే అర్థము. ఉండేది రెండు కులాలు, ఒకటి ఆపదలో తోటివారిని ఆదుకొనేవారు, రెండు అటువంటి మంచి పని ఎన్నడూ చేయనివారు. మొదటివారు ఉన్నతులు, , రెండవ వారు అధములు
అన్ని మతాలు చెప్పెది ఒకటే. మంచినే చేయి పాపం జోలికి పోకు. పూర్వజన్మలలో నీవు చేసిన మంచి ఈనాడు నీకు తర సంపద, కాబట్టి పాపం చేయవద్దు, మంచినే చేయి”
ఆ వృద్ధురాలు ఒక చెట్టు క్రింద రాయి మీద కూర్చుంటుంది. పైనుండి ఏదో ధ్వని వినపడుతుంది. తలఎత్తి పైకి చూస్తుంది. చెట్టుకొమ్మమీద ఒక గొల్లపిల్లవాడు కూర్చుని ఉన్నాడు.
అవ్వై: ‘నాయనా! నాకు ఒక పండు ఇస్తావా !!
మురుగన్ : – ఇస్తాను అవ్వా! మరి నీకు పండు వేడిది కావలెనా చల్లది కావలెనా!
అవ్వై : (తనలో) “ఏమిటి వీడు ఏదో నాటకం ఆడుతున్నాడే! చూస్తాను. (ప్రకాశంగా) నాయనా నాకు వేడి పండు ఇస్తావా ?” బాలుడు కొన్ని పళ్ళను నేలమీద ఇసకలో పడవేస్తాడు. అవ్వ వాటిని తీసుకొని ఊదుకొని తింటుంది.
మురుగన్ : – ‘అవ్వా! పళ్ళు చాలా వేడిగా ఉన్నాయి. “ఊదుకొని తిను గొంతు కాలుతుంది’.
అవ్వై :– (తనలో) హా ! భగవాన్ ! ఒక బాలుడు నాకు ఏం చెప్పాడే!
మురుగన్ : – ‘అవ్వా! ఎందుకు ఆయాసపడతావు? ఇంకా నన్ను గుర్తుపట్టలేదా?’
అవ్వై :–’ఆ ! స్వామీ ! మురుగా!
మురుగన్ : – ‘అవ్వా! నీవు చాలా చమత్కారి అని విన్నానే, నీతో మాట్లాడాలి, కొన్ని ప్రశ్నలు వేస్తాను జవాబిస్తావా?
అవ్వై :– సంతోషంగా! స్వామీ!
మురుగన్ : – గట్టిదేది ?
అవ్వై :– దారిద్య్ర్యం గట్టిది. చిన్న వయస్సులో బీదతనం ఇంకా గట్టిది. జబ్బు మరింత గట్టిది.
మురుగన్ : – తియ్యనిది ఏది?
అవ్వై :– ఏకాంతము తియ్యంది, భగవదారాధన ఇంకా మధురం, సాధుజనుల సాంగత్యము మరింత మధురం.
మురుగన్ : – ఏది గొప్పది?
అవ్వై :– విశ్వం పెద్దది. దానిని సృష్టించిన బ్రహ్మ ఇంకా పెద్దవాడు. ఆయన విష్ణువు నాభినుండి జన్మించాడు. విష్ణు మూర్తి సముద్రంలో పవ్వళించి ఉన్నాడు. ఆ సముద్రాన్ని త్రాగివేసిన అగస్త్యుడు ఇంకా గొప్పవాడు. అగస్త్యుడు కుండనుండి పుట్టాడు. కుండ మట్టినుండి వచ్చింది. మట్టి భూమిలో భాగము, భూమిని మోస్తే ఆదిశేషుడు. చిటికిన వేలికి సర్పము ఉంగరంగా ఉంది. పార్వతి పునిలో భాగము. శివుడు ఎక్కడున్నాడు ? భక్తుని హృద మంలో బంధించబడి ఉన్నాడు. కాబట్టి భక్తుడు ఎంత గొప్ప దో వర్ణించడం అసాధ్యము.
మురుగన్ : – మరొక ప్రశ్న వేస్తాను “అరుదైనది ఏది ?”
అవ్వై :– మానవ జన్మ.
మురుగన్ : -బాగా చెప్పావు అవ్వా! మహాభక్తురాలు ఆవ్వైయారు తప్ప ఈవిధంగా జవాబులు మరెవ్వరు చెప్పగలరు?
ముగన్ అవ్వైను ఆశీర్వదించి భగవత్సాక్షాత్కా ము ప్రసాదించాడు. అవ్వైయారు మోకరిల్లి తన్మయత్వంతో జరుగన్ విూద భక్తిగీతం పాడుతుంది.
(తెర వ్రాలుతుంది.)
ప్రశ్నలు:
- Who is Murugan?
- మురుగన్ అవ్వైకు ఏ విధంగా కనుపిస్తాడు నిజంగా పళ్ళు వేడిగా ఉన్నవా?
- అవ్వై మంచి చమత్కారి అని, మహా జ్ఞాని అని ఎట్లు చెప్పగలవు?
[Illustrations by M. Sai Eswaran, Sri Sathya Sai Balvikas Student.]
[Source: Stories for Children II, Published by Sri Sathya Sai Books & Publications, PN]