బంధన
బంధన
ఒక నది ఒడ్డున కొందరు బాలురు ఆవులను మేపుకుంటున్నారు. అది వర్షాకాలము. హఠాత్తుగా నదిలో పెద్ద ప్రవాహము వచ్చింది. ఆ ప్రవాహంలో ఒక ఎలుగుబంటి కొట్టుకొని వచ్చింది. బాలురు ఆ నల్లటి ముద్దలాగా ఉన్న దానిని చూచి నల్లటి ఉన్ని కంబళ్ళమూట అనుకున్నారు. ఒక బాలుడు “నేను నదిలో దూకి ఆ మూటను ఒడ్డుకు తీసుకొని వస్తాను” అంటూ నీటిలో దూకి ఆ నల్లటి మూటవలె ఉన్నదాని దగ్గరకు వెళ్ళాడు. రెండు చేతులతో ఆ ఆకారాన్ని పట్టుకున్నాడు. బాలుడు తనను పట్టుకోగానే ఆ ఎలుగు బంటి కూడా బాలుణ్ణి గట్టిగా రెండు చేతుల్తో పెనవేసుకుంది. బాలుడికి తాను పట్టుకున్నది గుడ్డలమూట కాదని ఎలుగుబంటి అని అర్ధమయి విపరీతమయిన భయంతో వదల్చుకోవాలని చూచాడు. ఎలుగుబంటి మరింత గట్టిగా పట్టుకుంది. గట్టుమీద ఉన్న వాళ్ళు సంగతి గ్రహించి “వదుల్చుకొని రా”అని బిగ్గరగా అరిచారు.
ఆ బాలుడు “వదుల్చుకొని రావాలన్నా ఇది నన్ను వదలడం లేదు” అని కేకలు పెట్టసాగాడు.
ప్రశ్నలు:
- బాలురు నదిలో ఏమి చూచారు?
- బాలుడు ఎందుకు నదిలో దూకాడు?
- నదిలో దూకిన బాలునికి కలిగిన అనుభవ మేమి?
- తోటి బాలురు నీటిలో దూకిన బాలునికి ఏమి సలహా ఇచ్చారు?
- వదుల్చుకుందామన్నా వదలనిదేది?