నా పట్ల శ్రద్ద వహించటం

Print Friendly, PDF & Email
నా పట్ల శ్రద్ద వహించటం

దశ 1 :

  1. సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
  2. మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
  3. మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
  4. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.

దశ 2 :

ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రేకాలను తగ్గించండి. మీ కాలి వేళ్ళని సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి.

మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి.

మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు తిరిగి కుడి వైపుకు చూడండి. ముందుకు చూడండి. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని‌ పొందండి. ఉద్రేకాలు అన్నీ తొలిగిపోతాయి.

దశ 3 :

ఇప్పుడు మీ శ్వాసపై ఎఱుకను కలిగి ఉండండి. మీ ఊపిరితిత్తుల నిండా దీర్ఘ శ్వాసను తీసుకోండి. తగినంత సమయం తీసుకుని మెల్లగా బయటికి వదలండి. కళ్ళను నెమ్మదిగా మూయండి.

మీరు శ్వాసను లోపలికి తీసుకుంటున్నప్పుడు స్వచ్ఛమైన గుణనివారణ శక్తి (హీలింగ్ పవర్) మీ లోపలికి ప్రవేశించినట్లుగా ఊహించుకోండి. ఆ శక్తి మీలో ఆనందాన్ని, ప్రేమను, శాంతిని నింపుతున్నట్లుగా భావించండి. శ్వాసను బయటికి వదులుతున్నప్పుడు మీకు అసౌకర్యాన్ని కలిగించే గుణాలైన విచారము, అలసట, కోపము, చిరాకు, భయము, విసుగు, అసూయ వంటివి బయటికి వెళ్తున్నట్టుగా భావించండి. మీరు సంతోషంగా ఎటువంటి చింతలు లేకుండా ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇలా మూడు నాలుగు పర్యాయములు చేసినచో, మిమ్మల్ని ఆందోళనపరచే విషయములు అన్ని ఒక్కొక్కటి దూరంగా వెళ్లిపోతాయి.

దశ 4 :

మిమ్మల్ని మీరు ఎలా ఉండాలో తెలియచేసే అన్ని విషయాల గురించి ఆలోచించండి. అనగా మీ శరీరం మరియు మనస్సును రూపొందించే అన్ని అంశాలు, మీరు తినే ఆహారం, మీరు చదివే విషయాలు, మీరు టీవీలో చూసే విషయాలు… మీరు వినే విషయాలు, సంగీతం, ఇతర విషయాలు, ప్రజలు చెప్పే విషయాలు, మీరే చెప్పే విషయాలు. అవన్నీ మంచి విషయాలు అని మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారా? మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే మీరు విలువైనవారు కాబట్టి.

దశ 5 :

ఇప్పుడు దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి. కూర్చుని చేసే ఈ వ్యాయామం యొక్క అనుభవాలను విద్యార్థులు పక్కవారితో పంచుకోవాలని అనుకోవచ్చు కనుక వారిని ప్రోత్సహించండి.ఈ వ్యాయామం వలన వారు ఎటువంటి అనుభూతిని పొందారో అడగండి. ఆ అనుభూతిని చిత్రంగా గీయమని ప్రోత్సహించడం వల్ల పిల్లలలో సృజనాత్మకత పెంపొందుతుంది.

[BISSE Ltd శ్రీ సత్యసాయి మానవతా విలువల బోధని ఆధారంగా.]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *